త్వరగా వృద్ధాప్యం రాకూడదంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!-how to reduce premature skin aging avoiding this foods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  త్వరగా వృద్ధాప్యం రాకూడదంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

త్వరగా వృద్ధాప్యం రాకూడదంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

HT Telugu Desk HT Telugu
Jun 13, 2022 07:06 PM IST

వయసు పెరుగుతున్న కొద్ది వృద్ధాప్య ఛాయలు కనిపించడం సహజం. అయితే కొంత మందిలో చిన్నవయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపింస్తుంటాయి. దీనికి కారణం వారి జీవనశైలిలో సరైన ఆహారపు అలవాట్లను ఎంచుకోకపోవడం. ఆహారపు అలవాట్లపై మరింత శ్రద్ధ పెట్టడం వల్ల యవ్వనాన్ని చాలా కాలం పాటు కొనసాగించవచ్చు

Food habits
Food habits

నిత్యం యవ్వనంగా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. మెరిసే చర్మం కోసం, చాలా మంది సమయం, డబ్బు వృధా చేస్తుంటారు. యవ్వనంగా, చర్మం మెరిసేలా కనిపించాలంటే ఆహారం చాలా ముఖ్యమనే విషయాన్ని మర్చిపోతుంటారు. చర్మం కాంతి వంతంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. షోషకాహారం వృద్ధాప్యానికి సంబంధించిన ముందస్తు సంకేతాలను నివారించడంలో సహాయపడుతుంది. అయితే కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల చర్మం పాడవుతుంది కూడా. వృద్ధాప్యం రాకుండా ఉండాలంటే దూరంగా ఉండవలసిన కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వయసు పెరుగుతున్న కొద్ది వృద్ధాప్య ఛాయాలు కనిపిస్తుంటాయి. ఇది సహజ ప్రక్రియ. కానీ కొంత మందిలో చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తుంటాయి. దీనికి కారణం వారి జీవనశైలిలో చేసే కొన్ని పొరపాట్లు. ముఖ్యంగా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలి. వృద్ధాప్యాన్ని పెంచే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.

వేయించిన ఆహారం

ఫ్రైడ్ ఫుడ్ చర్మ కణాలను దెబ్బతీసే.. చర్మాన్ని బలహీనపరిచే ఫ్రీ రాడికల్స్‌ను విడుదల చేస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్ పొటాటో ఫ్రైస్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. అంతే కాకుండా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా తక్కువగా తీసుకోవాలి.

చక్కెర వినియోగం

చక్కెర ఎక్కువగా తినడం వల్ల కొల్లాజెన్-నష్టపరిచే AGEల పెరుగుదలకు దోహదపడవచ్చు. అధిక మోతాదులో చక్కెర చర్మ సమస్యలను కలిగిస్తుంది. బదులుగా, మీకు తీపి తినాలని అనిపించినప్పుడు పండు లేదా డార్క్ చాక్లెట్ తినండి.

ప్రాసెస్ చేసిన మీట్

బేకన్, సాసేజ్, పెప్పరోని వంటి ప్రాసెస్ చేసిన ప్రాసెస్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీటిలో సోడియం, సంతృప్త కొవ్వు, సల్ఫైట్‌లతో నిండి ఉంటాయి, ఇవన్నీ వాపుకు కారణమవుతాయి, ఇది కొల్లాజెన్‌ను బలహీనపరుస్తుంది. చర్మంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది.

కెఫిన్ కలిగిన పానీయాలు

సోడా, కాఫీ తాగడం వల్ల చర్మంపై ప్రభావం పడుతుంది. అలాగే నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది. నిద్రలేమి వల్ల వృద్ధాప్యం, ముడతలు, నల్లటి వలయాలు ఏర్పాడుతాయి. కెఫిన్ ఉన్న పానీయాలను వీలైనంత తక్కువగా తాగండి.

ఆల్కహాల్

ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల ముడతలు, కొల్లాజెన్ లేమికి, వాపు, ఎరుపు వంటి అనేక చర్మ సమస్యలకు దారితీయవచ్చు. ఇది విటమిన్ ఎతో సహా కొన్ని పోషకాల లోపాలకు కూడా దారితీస్తుంది.

వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది, ఇది శరీరంలో మంటను కలిగిస్తుంది, ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగ వంతం చేస్తోంది. చర్మానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే మొలకెత్తిన గ్రెయిన్ బ్రెడ్‌ని తినడానికి ప్రయత్నించండి.

WhatsApp channel

సంబంధిత కథనం