Hair Fall Reasons : జుట్టు రాలుతుందా? డోంట్ వర్రీ.. ఈ ఆహారం తినండి-hair fall and food take these foods to control hair fall ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Fall Reasons : జుట్టు రాలుతుందా? డోంట్ వర్రీ.. ఈ ఆహారం తినండి

Hair Fall Reasons : జుట్టు రాలుతుందా? డోంట్ వర్రీ.. ఈ ఆహారం తినండి

HT Telugu Desk HT Telugu

Hair Fall and Food : కలుషిత వాతావరణం, సరైన ఆహారం తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అనేక ఇతర కారణాలతో జుట్టు రాలుతుంది. మీ జుట్టును రక్షించుకునేందుకు.. మీరు ఏం చేస్తున్నారనేదానికంటే.. మీరు ఏం తింటున్నారనేది కూడా చాలా ముఖ్యం.

జుట్టు రాలడానికి ఆహారాలు (unsplash)

జుట్టు సమస్య(Hair Problems) ఇటీవల చాలా మందిని వేధిస్తోంది. ఇప్పుడు అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరో విషయం ఏంటంటే.. చిన్న వయసులోనూ.. జుట్టు రాలడం(Hair Loss)తో ఇబ్బంది పడుతున్నారు. కలుషిత వాతావరణం, సరికాని ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, అనేక ఇతర కారణాలు జుట్టు రాలడానికి దారితీస్తాయి. జుట్టుకు అవసరమైన పోషకాలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా.. హెల్తీ, షైనీ హెయిర్‌ని అందిస్తాయి. కింది ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.

చేప(Fish)ల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. సాల్మన్, హెర్రింగ్, సార్డినెస్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్(Omega 3 Fatty Acid) ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి, జుట్టు మూలాలకు సహజమైన ఆయిల్ ను అందిస్తాయి. దీని వల్ల వెంట్రుకలు రూట్ నుండే బలంగా తయారవుతాయి.

శాకాహారులు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను పొందడానికి అవిసె గింజలతో పాటు బాదం, వాల్‌నట్, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. వాల్ నట్స్ లో విటమిన్ ఇ(Vitamin E) కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని బయోటిన్ కంటెంట్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. వాల్‌నట్‌లోని కాపర్ కంటెంట్ జుట్టు యొక్క సహజ రంగును కాపాడటమే కాకుండా, జుట్టు మెరుపు(Shiny Hair)ను కూడా పెంచుతుంది.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. అన్ని ఆకుపచ్చ కూరగాయలు జుట్టు ఆరోగ్యానికి(Hair Health) మంచివి. బచ్చలికూర మరియు పార్స్లీ వంటి ఆకుపచ్చ కూరగాయలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడం, పగుళ్లు రాకుండా చేస్తుంది.

క్యారెట్ తీసుకోవడం కంటి ఆరోగ్యానికే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ(Vitamin A) లేకుండా మీ శరీరంలోని కణాలేవీ పనిచేయవని గమనించడం ముఖ్యం. ఆహారంలో తగినంత విటమిన్ ఎ తీసుకోవడం మంచిది. ఆహారంలో విటమిన్ ఎ లేకపోవడం వల్ల జుట్టు రాలడం, సన్నబడటం, బట్టతల వచ్చే అవకాశం ఉంది. బత్తాయి, గుమ్మడి, మామిడి, నేరేడు పండ్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

గుడ్లలో విటమిన్లు మాత్రమే కాకుండా జింక్, సల్ఫర్, ఐరన్, సెలీనియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ కారకాలన్నీ జుట్టు పెరుగుదలకు(Hair Growth) దోహదం చేస్తాయి. కోడిగుడ్లలో బయోటిన్ లేదా విటమిన్ బి7 పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు సప్లిమెంట్.

అనేక జుట్టు సమస్యలకు(Hair Problems) గుడ్డు మంచి మందు. ఇందులో విటమిన్ బి12, ప్రొటీన్, అయోడిన్, కాల్షియం ఉంటాయి. దీనితో పాటు, స్కిమ్డ్ మిల్క్, కాటేజ్ చీజ్, తక్కువ కొవ్వు చీజ్, పెరుగు వంటి పాల ఉత్పత్తులు జుట్టు కుదుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

బెర్రీలలో విటమిన్ సి(Vitamin C) పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉండే బీన్స్, పప్పులు మీరు ఊహించని విధంగా జుట్టు ఆరోగ్యాన్ని(Hair Health) మెరుగుపరుస్తాయి. ప్రొటీన్లు అధికంగా ఉండే శాఖాహారం, బీన్స్, పప్పులలో బయోటిన్ ఉంటుంది. దీని లోపం జుట్టు రాలడానికి దారితీస్తుంది.

ఎండుద్రాక్షలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పొడి జుట్టు(Dry Hair), సన్నని జుట్టు, రంగు మారిన జుట్టు ఉన్నవారికి ఇది ఉత్తమమైనది. ఇది జుట్టు నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.

రొయ్యల వినియోగం జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో అధిక ప్రొటీన్లు ఉంటాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. వీటన్నింటితోపాటుగా.. తగినంత నీరు తాగడం వల్ల కూడా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.

సంబంధిత కథనం