Hair Growth Remedy । జుట్టు పెరుగుదలకు ఈ ఒక్క చిట్కా పాటించి చూడండి!-garlic oil to prevent hair fall and boost hair growth here is diy method ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Garlic Oil To Prevent Hair Fall And Boost Hair Growth, Here Is Diy Method

Hair Growth Remedy । జుట్టు పెరుగుదలకు ఈ ఒక్క చిట్కా పాటించి చూడండి!

Mar 31, 2023, 01:30 PM IST HT Telugu Desk
Mar 31, 2023, 01:30 PM , IST

Hair Growth Remedy: జుట్టు రాలడం చాలా మంది ఎదుర్కొనే సమస్య, జుట్టు పెరుగుదల లేకపోవడం వలన కూడా ఆందోళన ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని ఇంటి చిట్కాలు చూడండి.

జుట్టు రాలడంను నివారించే, వేగంగా వెంట్రుకలు పెరగటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా మార్పు తప్పకుండా కనిపిస్తుంది.  

(1 / 8)

జుట్టు రాలడాన్ని నివారించడానికి చాలా మంది ఉల్లిపాయ రసం లేదా ఉల్లినూనెను ఉపయోగిస్తారు. కానీ అందరి జుట్టు రకాలకు ఇది పనిచేయకపోవచ్చు. ఉల్లితో ఉపయోగం లేకుంటే వెల్లుల్లికి మారండి. 

(2 / 8)

జుట్టు రాలడాన్ని తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. వెల్లుల్లి నూనె కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. 

(3 / 8)

వెల్లుల్లిలో ఉండే జింక్, కాల్షియం, సల్ఫర్, యాంటీ-ఆక్సిడెంట్లు స్కాల్ప్ సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాదు ఇందులో ఉండే విటమిన్లు కొత్త వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడతాయి. 

(4 / 8)

వెల్లుల్లి నూనె తయారీకి నిర్దిష్ట పద్ధతులు ఉన్నాయి. ఈ వెల్లుల్లి నూనెను ఎలా తయారు చేయాలి? దాని సరైన పద్ధతిని తెలుసుకోండి. 

(5 / 8)

8 వెల్లుల్లి రెబ్బలు, అర కప్పు ఆలివ్ ఆయిల్ , 1 ఉల్లిపాయ అవసరం. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వెల్లుల్లిని వేసి, పేస్ట్‌లా చేయండి. 

(6 / 8)

ఇప్పుడు పాన్‌లో అరకప్పు ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయండి. దానికి వెల్లుల్లి-ఉల్లిపాయ పేస్ట్ కలపండి. ఈ మిశ్రమంను మీడియం మంట మీద వేయించాలి. పేస్ట్ గోధుమ రంగులోకి మారినప్పుడు, వేడిని ఆపివేసి చల్లబరచండి. 

(7 / 8)

చల్లారిన తర్వాత బాగా ఫిల్టర్ చేసి నూనెను వేరు చేయండి. ఈ నూనెను తలకు బాగా పట్టించాలి. నూనెను తలకు పట్టించి 30 నుంచి 45 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. ఈ నూనెను వారానికి 3-4 రోజులు వాడండి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు