అరటిపండ్లు, అవకాడొలు, సాల్మన్ అధికంగా తీసుకునే స్త్రీలలో ఈ సమస్యలు ఉండవంట!-consuming bananas avocados salmon may reduce high salt effect in women study ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  అరటిపండ్లు, అవకాడొలు, సాల్మన్ అధికంగా తీసుకునే స్త్రీలలో ఈ సమస్యలు ఉండవంట!

అరటిపండ్లు, అవకాడొలు, సాల్మన్ అధికంగా తీసుకునే స్త్రీలలో ఈ సమస్యలు ఉండవంట!

HT Telugu Desk HT Telugu
Jul 25, 2022 07:16 PM IST

యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల తక్కువ రక్తపోటుకు గురవుతారని తెలింది. ఇది ముఖ్యంగా అధిక ఉప్పు తీసుకునే మహిళల్లో జరుగుతుందని గుర్తించారు.

Avocadosistock_d
Avocadosistock_d

Says Study Consuming bananas, avocados, salmon may reduce high-salt effect in women : పండ్లు , కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. తాజాగా యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో కొన్ని పండ్లకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అరటిపండ్లు, అవకాడోలు, సాల్మొన్‌లు తినడం వల్ల మహిళలు తిసుకునే ఆహారంలో ఉండే ఉప్పు ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుందని కనుగొన్నారు. అధిక ఉప్పు తీసుకునే మహిళలు రక్తపోటు గురవుతుంటారని దీన్ని తగ్గించడంలో పోటాషియం ఉపయోగపడుతుందని తెలింది.

ఈ అధ్యయనంలో 24,963 మంది పాల్గొన్నారు (11,267 మంది పురుషులు, 13,696 మంది మహిళలు). ఇందులో పాల్గోన్న పురుషుల సగటు వయస్సు 59 సంవత్సరాలు ఉండగా.. మహిళలకు 58 సంవత్సరాలు. పొటాషియం వినియోగం మహిళల్లో రక్తపోటుతో ముడిపడి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అరటిపండ్లు, అవకాడోలు, సాల్మొన్‌లను తీసుకోవడం వల్ల వాటిలోని పొటాషియం అధిక రక్తపోటు తగ్గించినట్లు తేల్చారు.

సాధరణంగాఉప్పు లేదా సోడియం అధిక రక్తపోటు, గుండె జబ్బులకు ప్రధాన కారణంగా ఉంటుంది. ఇది రక్తంలోని ద్రవాల సమతుల్యతపై ప్రభావితం చూపుతుంది. అధిక సోడియం తీసుకునే మహిళల్లో ఏర్పడే రక్తపోటును పొటాషియం నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. రోజువారీగా గ్రాము పొటాషియాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అది 2.4 mmHg సిస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుందని తెలింది. మొత్తం మీద, పొటాషియం కలిగిన అత్యధిక టెర్టైల్ ఉన్న వ్యక్తులను తక్కువ టెర్టిల్ ఉన్నవారితో పోలిస్తే హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం 13 శాతం తక్కువ ఉంటుందని అధ్యయనం తెలిపింది.

ఫలితాలు పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయని సూచిస్తున్నాయి. ఇది పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉప్పు తీసుకోవడం వల్ల ఏర్పడే హృదయనాళ సమస్యలలో అధిక ప్రభావం చూపకుండా పొటాషియం ఒకే విధంగా ప్రభావితం చేస్తుందని తెలింది. సోడియం వల్ల కలిగే ప్రమాదాన్ని, గుండెను రక్షించే విధానంలో పొటాషియం ఇతర మార్గాలను కలిగి ఉందని సర్వే సూచిస్తుంది.

నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్స్‌కు చెందిన ప్రొఫెసర్ లిఫర్ట్ వోగ్ట్ మాట్లాడుతూ, "అధిక ఉప్పు వినియోగం అధిక రక్తపోటుతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని పెంచుతుందని అందరికీ తెలుసు" అన్నారు. ఆరోగ్య నిపుణులు కూడా ఆహారంలోఉప్పు పరిమితం చేయడంపై దృష్టి సారించాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరుగుతాయని.. ఇది ఎక్కువ మూత్ర విసర్జణకు కారణమవుతుందని తెలుస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం