IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. గుజరాత్ టైటన్స్ ఔట్.. ఇక రేసులో ఆరు టీమ్స్-ipl 2024 points table gujarat titans out of playoffs race 6 teams in contention for 3 berths latest points table ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. గుజరాత్ టైటన్స్ ఔట్.. ఇక రేసులో ఆరు టీమ్స్

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. గుజరాత్ టైటన్స్ ఔట్.. ఇక రేసులో ఆరు టీమ్స్

Published May 14, 2024 07:31 AM IST Hari Prasad S
Published May 14, 2024 07:31 AM IST

  • IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. గుజరాత్ టైటన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్ల టేబుల్లో మరోసారి మార్పులు చేసుకున్నాయి. కేకేఆర్ ఇప్పటికే ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కాగా.. గుజరాత్ టైటన్స్ లీగ్ నుంచి వెళ్లిపోయిన మూడో జట్టుగా నిలిచింది.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాప్ లోనే కొనసాగుతోంది. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ రద్దవడంతో ఒక పాయింట్ వచ్చింది. దీంతో 13 మ్యాచ్ లలో 19 పాయింట్లు, 1.428 నెట్ రన్ రేట్ తో తొలి స్థానంలో ఉంది. అంతేకాదు కేకేఆర్ కచ్చితంగా టాప్ 2లోనే లీగ్ స్టేజ్ ముగించడం ఖాయంగా కనిపిస్తోంది.

(1 / 8)

IPL 2024 Points Table: గత రెండు సీజన్లలో ఫైనల్ చేరిన గుజరాత్ టైటన్స్ ఈసారి లీగ్ స్టేజ్ లోనే ఇంటికెళ్లిపోయింది. కేకేఆర్ తో మ్యాచ్ రద్దవడంతో ఆ టీమ్ కు ఒకే పాయింట్ వచ్చింది. దీంతో 13 మ్యాచ్ లలో 5 విజయాలతో 11 పాయింట్లు మాత్రమే వచ్చాయి. చివరి మ్యాచ్ గెలిచినా గరిష్ఠంగా 13 పాయింట్లకే చేరుకుంటుంది. దీంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ టీమ్ తప్పుకుంది.

(2 / 8)

IPL 2024 Points Table: రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఆ టీమ్ 12 మ్యాచ్ లలో 8 విజయాలు, 16 పాయింట్లు, 0.349 నెట్ రన్ రేట్ తో ఉంది. మిగిలిన రెండింట్లో ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుంది.

(3 / 8)

IPL 2024 Points Table: చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానంలో ఉంది. ఆ టీమ్ 13 మ్యాచ్ లలో 14 పాయింట్లు సాధించింది. ఇప్పుడు ఆర్సీబీతో ఎలిమినేటర్ లాంటి చివరి లీగ్ మ్యాచ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సీఎస్కే ప్లేఆఫ్స్ చేరుతుంది.

(4 / 8)

IPL 2024 Points Table: సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆ టీమ్ 12 మ్యాచ్ లలో 7 విజయాలు, 14 పాయింట్లు, 0.406 నెట్ రన్ రేట్ తో ఉంది. గురువారం (మే 16) గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది.

(5 / 8)

IPL 2024 Points Table: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐదో స్థానంలో ఉంది. ఆ టీమ్ 13 మ్యాచ్ లలో 6 విజయాలు, 12 పాయింట్లు, 0.387 నెట్ రన్ రేట్ తో ఉంది. చివరి మ్యాచ్ లో కచ్చితంగా సీఎస్కేను ఓడించడంతోపాటు వాళ్ల నెట్ రన్ రేట్ కంటే మెరుగైన విజయం సాధిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది.

(6 / 8)

IPL 2024 Points Table: ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 13 మ్యాచ్ లలో 12 పాయింట్లు, -0.482 నెట్ రన్ రేట్ తో ఆరో స్థానంలో ఉంది. ఆ టీమ్ నెట్ రన్ రేట్ నెగటివ్ గా ఉండటంతో చివరి మ్యాచ్ గెలిచినా ప్లేఆఫ్స్ బెర్తు అంత సులువు కాకపోవచ్చు.

(7 / 8)

IPL 2024 Points Table: లక్నో సూపర్ జెయింట్స్ 12 మ్యాచ్ లలో 12 పాయింట్లు, -0.769 నెట్ రన్ రేట్ తో ఏడో స్థానంలో ఉంది. ఆ టీమ్ చివరి రెండు మ్యాచ్ లలో కచ్చితంగా గెలిస్తే ప్లేఆఫ్స్ పై ఆశలు పెట్టుకోవచ్చు. అదే సమయంలో ఆర్సీబీ చేతుల్లో సీఎస్కే ఓడిపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ చివరి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

(8 / 8)

ఇతర గ్యాలరీలు