తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Natural Ways To Treat Thyroid | థైరాయిడ్ సమస్యను ఈ 5 మార్గాలలో నయం చేసుకోండి!

Natural Ways to Treat Thyroid | థైరాయిడ్ సమస్యను ఈ 5 మార్గాలలో నయం చేసుకోండి!

HT Telugu Desk HT Telugu

04 September 2022, 14:13 IST

    •  Thyroid Issue:  థైరాయిడ్ పనితీరు దెబ్బతింటే శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది పలురకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సులభంగా తగ్గించుకునేందుకు ఆరోగ్య నిపుణులు 5 మార్గాలు సూచించారు.
Natural Ways to Treat Thyroid
Natural Ways to Treat Thyroid (Unsplash)

Natural Ways to Treat Thyroid

మన శరీరంలో కంఠం వద్ద సీతాకోకచిలుక ఆకారంలో ఒక ముఖ్యమైన అవయవం ఉంటుంది. దీనిని థైరాయిడ్ గ్రంథి అంటారు. శారీరక ఎదుగుదలలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లు ప్రతికణం పైనా ప్రభావం చూపిస్తాయి. థైరాయిడ్ సమస్య ఉంటే అది శరీరంలో ఇతర సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటారని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

థైరాయిడ్ లక్షణాలు చాలా విలక్షణమైనవి. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ కారకాల వల్ల ఈ గ్రంథిలో సమస్యలు ఏర్పడుతాయి. ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా థైరాయిడ్ సమస్యలు సంభవిస్తాయి. ఫలితంగా శరీరంంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ హార్మోన్ల హెచ్చుతగ్గుల వలన మలబద్ధకం, బరువు పెరగడం లేదా వేగంగా బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవటం, విపరీతమైన అలసట వంటి లక్షణాలు ఉంటాయి. థైరాయిడ్ అసమతుల్యత వల్ల కలిగే అతి పెద్ద సమస్య ఆర్థరైటిస్. ఎన్ని మందులు వాడిన తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు.

ఈ థైరాయిడ్ సమస్య స్త్రీలలో నెలసరి క్రమాన్ని కూడా అస్తవ్యస్తం చేస్తుంది. అయితే రోజువారీ అలవాట్లలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవటం ద్వారా థైరాయిడ్ పనితీరును మెరుగుపరచవచ్చు.

Natural Ways to Treat Thyroid

మెన్‌స్ట్రువల్ సైకిల్ కోచ్ అయినటువంటి జమా లీ ఈ థైరాయిడ్‌ సమస్య నుంచి బయటపడేందుకు ఐదు మార్గాలను సూచించారు. అవేంటో ఈ కింద చూడండి.

1. ఆదర్శవంతమైన దినచర్య

జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఒక ఆదర్శవంతమైన దినచర్యను అనుసరించాలి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆరోగ్యకరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రతిరోజు ఇదే అలవాటును కొనసాగించాలి.

2. పేగు ఆరోగ్యం

పేగుకు హాని కలిగించే పదార్థాలను తినకూడదు. పేగును శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచే ఆహారాన్నే స్వీకరిచాలి. పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడే పెరుగు ఇతర ప్రోబయోటిక్స్ ఆహారంగా తీసుకోవాలి. అతిగా తినడాన్ని తగ్గించుకోవాలి. తేలికగా జీర్ణం అయ్యే, జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడే ఆహారాన్ని భుజించాలి.

3. మంచి రాత్రి నిద్ర

సర్వ రోగాలు నిద్రతో నయం అవుతాయి. మన శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర ఎంతో ప్రధానం. కాబట్టి మంచి రాత్రి నిద్రను కలిగి ఉండాలి. ఇందుకోసం కచ్చితమైన నిద్ర దినచర్యను అనుసరించాలి. నిద్రలేవటానికే కాదు, నిద్రపోవటానికి కూడా అలారం సెట్ చేసుకోండి. ప్రతీరోజు నిర్ధిష్ట సమయానికి అలారం మోగిందంటే మీ ఫోన్‌ని వాడకం ఆపి వెంటనే నిద్రపోవాలి.

4. మంట కలిగించే ఆహారం వద్దు

శరీరంలో వేడి, మంట కలిగించే ఆహారం తినడం తగ్గించాలి. గ్లూటెన్, డైరీ, సోయా కలిగిన ఆహారాలు. బాగా శుద్ధి చేసిన ఆహారాలు తీసుకోకపోవటమే మంచిది. అలాగే, వైట్ బ్రెడ్ , బేకరీ పేస్ట్రీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉండేవి తీసుకోకుండా ఉండండి.

5. మనసును నియంత్రణలో ఉంచండి

ఒత్తిడి, ఆందోళనలు ఏ రకంగానూ వద్దు. మనసులో ప్రతికూల ఆలోచనలకు తావివ్వకండి. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం ధ్యానం చేయండి. 5 నిమిషాల పాటు నడకకు వెళ్లండి. తేలికపాటి వ్యాయామాలు చేయండి. వీటితో శరీరంలో మీకు మంచి అనుభూతిని కలిగించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. మీ మానసిక స్థితి, ఏకాగ్రత మెరుగుపడతాయి. హాయిగా నిద్ర కలుగేందుకు సహాయపడతాయి.