Happy Hormones : మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ నాలుగు కావాలి.. ఆ మార్పులు చేయాలి..-what is the way to keep good mind how to control hormones ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Hormones : మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ నాలుగు కావాలి.. ఆ మార్పులు చేయాలి..

Happy Hormones : మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ నాలుగు కావాలి.. ఆ మార్పులు చేయాలి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 23, 2022 12:03 PM IST

మనస్సును సంతోషంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే డిప్రెషన్ అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ మీరు మెంటల్ హెల్త్ మీద దృష్టి పెడితే.. ఫిజికల్ హెల్త్​ కూడా మీకు బాగా సహకరిస్తుంది. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం వల్ల.. మీరు కచ్చితంగా హ్యపీగా ఉంటారు అంటున్నారు నిపుణులు.

సంతోషంగా ఉండాలంటే.. ఇవి ఫాలో అయిపోండి..
సంతోషంగా ఉండాలంటే.. ఇవి ఫాలో అయిపోండి..

Mental Health : మనస్సును ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధానంగా నాలుగు హార్మోన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ హార్మోన్ల స్రావాన్ని సమతుల్యంగా ఉంచితే మీ మనసు హాయిగా, తేలికగా ఉంటుంది. బాగుంటుంది. డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ హార్మోన్లు మనిషి సంతోషంగా ఉండేలా.. ఒత్తిడిని, ఆందోళనను దూరం చేస్తాయి. మరి ఈ నాలుగు హార్మోన్లను బ్యాలెన్స్ చేయడం ఎలా? జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేస్తే హ్యాపీగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం.

డి విటమిన్ కావాల్సిందే..

ప్రతిరోజూ కనీసం 10 నుంచి 15 నిమిషాలు ఎండలో గడపండి. ఇది శరీరంలో విటమిన్ డి స్థాయిని సరిగ్గా ఉంచుతుంది. అంతేకాదు.. దీని ప్రభావాల వల్ల సెరోటోనిన్, ఎండార్ఫిన్స్ హార్మోన్ల సమతుల్యత సరిగ్గా ఉంటుంది. వర్షాకాలం కదా ఎండ ఎక్కడుంటుంది అనుకోవచ్చు. కానీ ఎండ వచ్చినప్పుడు మాత్రం మిస్ అవ్వకండి.

నవ్వండి..

రోజులో కొంత సమయం స్నేహితులతో నవ్వుతూ గడపడానికి ప్రయత్నించండి. ఇది ఎండార్ఫిన్ స్రావం స్థాయిని పెంచుతుంది. అంతేకాకుండా మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీ ఒత్తిడిని, ఆందోళనను కాస్త దూరం చేస్తుంది.

కొన్ని సప్లిమెంట్స్

డాక్టర్ సలహా మేరకు మీరు కొన్ని ఆహారాలు లేదా సప్లిమెంట్లను తీసుకోవచ్చు. ఇది ఈ హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. మీ డైట్​లో పెరుగు చేర్చుకోవచ్చు. దాని వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

కుక్ చేయండి..

ప్రియమైన వారితో లేదా ప్రియమైన వారికోసం వంట చేయండి. మీరు తినడానికి ఇష్టపడే ఆహారాన్ని తయారు చేయండి. వండడం, తినడం ఈ రెండూ.. మీకు మంచి ఆనందం, అనుభూతిని కలిగిస్తాయి.

మ్యూజిక్ లేకుంటే ఎలా?

రోజులోని నిర్దిష్ట సమయాల్లో సంగీతాన్ని వినండి. మనసును ప్రశాంతంగా ఉంచడంలో సంగీతం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది డోపమైన్ స్రావాన్ని చాలా పెంచుతుంది.

వ్యాయామం అవసరం

ప్రతిరోజూ 10 నుంచి 15 నిమిషాల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఇది ఎండార్ఫిన్ హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

ధ్యానం ముఖ్యం..

మనస్సును ఆరోగ్యంగా ఉంచడానికి.. వివిధ నెగిటివ్ ఆలోచనలు ధరిచేరకుండా.. మీరు వేరే ఏమీ చేయలేకపోయినా.. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానంలో గడపండి. ఇది డోపమైన్ హార్మోన్ స్రావాన్ని పెంచుతుంది. తద్వారా మనసు బాగుంటుంది.

ప్రేమించేవారు..

ప్రేమించిన వ్యక్తులకు దగ్గరగా ఉండటం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ స్రావం పెరుగుతుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది. కొన్నిసార్లు ప్రియమైన వారితో అలా వాకింగ్​కు వెళ్లినా మంచిదే. ఇది ఈ హార్మోన్ స్రావాన్ని పెంచుతుంది.

మసాజ్..

మనసు ఆరోగ్యంగా ఉండేందుకు మసాజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది నాలుగు హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. సెరోటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్. అందుకే మసాజ్​కి ప్రాధాన్యం ఇవ్వండి.

నిద్ర తప్పనిసరి..

రాత్రి బాగా నిద్రపోవాలి. కనీసం 7 గంటలు నిద్రపోతే మంచిది. ఇది మీ శరీరంలో డోపమైన్ స్రావాన్ని పెంచుతుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది.

మీ పెట్​తో..

మీ పెంపుడు కుక్కను ప్రేమించండి. దానితో సమయం గడపండి. మీ పెట్స్​తో సమయం గడపడం వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ స్రావాన్ని పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్