తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Thyroid| థైరాయిడ్‌తో అనేక చిక్కులు, అదుపులో ఉంచుకోవాలంటే ఈ ఫుడ్స్ తీసుకోవాలి

Thyroid| థైరాయిడ్‌తో అనేక చిక్కులు, అదుపులో ఉంచుకోవాలంటే ఈ ఫుడ్స్ తీసుకోవాలి

29 January 2022, 9:59 IST

థైరాయిడ్ పనితీరు ఎక్కువైనా, తక్కువైనా అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆడవారిలో గర్భం ఆలస్యం అవుతుంది. తల్లికి హైపో థైరాయిడిజం ఉంటే పుట్టే పిల్లల్లో పెరుగుదల నిలిచిపోయి మరుగుజ్జులు అవుతారు. బుద్ధి మాంద్యం, వంధ్యత్వానికి కూడా దారితీయొచ్చు. కాబట్టి ఈ గ్రంథి ఆరోగ్యం ఎంతో కీలకం. 

  • థైరాయిడ్ పనితీరు ఎక్కువైనా, తక్కువైనా అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆడవారిలో గర్భం ఆలస్యం అవుతుంది. తల్లికి హైపో థైరాయిడిజం ఉంటే పుట్టే పిల్లల్లో పెరుగుదల నిలిచిపోయి మరుగుజ్జులు అవుతారు. బుద్ధి మాంద్యం, వంధ్యత్వానికి కూడా దారితీయొచ్చు. కాబట్టి ఈ గ్రంథి ఆరోగ్యం ఎంతో కీలకం. 
థైరాయిడ్ (Thyroid Gland) అనేది మన మెడ ముందు వైపు మధ్య భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. వినాళ గ్రంథులన్నింటిలో ఇదే పెద్దది. శరీరంలోని అతి ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ ఒకటి. ఈ గ్రంథి అయోడిన్ సమ్మేళనం కలిగిన థైరాక్సిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. ఈ హర్మోన్ ప్రభావం మొత్తం ఆరోగ్యాన్ని నిర్ధేశిస్తుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ గ్రంథి పనితీరును సమతుల్యంగా ఉంచుకోవాలి. థైరాయిడ్‌ని నియంత్రణలో ఉంచే కొన్ని అద్భుతమైన ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకోండి..
(1 / 7)
థైరాయిడ్ (Thyroid Gland) అనేది మన మెడ ముందు వైపు మధ్య భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. వినాళ గ్రంథులన్నింటిలో ఇదే పెద్దది. శరీరంలోని అతి ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ ఒకటి. ఈ గ్రంథి అయోడిన్ సమ్మేళనం కలిగిన థైరాక్సిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. ఈ హర్మోన్ ప్రభావం మొత్తం ఆరోగ్యాన్ని నిర్ధేశిస్తుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ గ్రంథి పనితీరును సమతుల్యంగా ఉంచుకోవాలి. థైరాయిడ్‌ని నియంత్రణలో ఉంచే కొన్ని అద్భుతమైన ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకోండి..(Shutterstock)
Amla: ఇండియన్ గూస్బెర్రీగా పిలిచే ఉసిరికాయలో ఎన్నో పోషకాలతో పాటు ఔషధ గుణాలు ఉన్నాయి. నారింజ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ, దానిమ్మపండు కంటే 17 రేట్లు అధికంగా విటమిన్ సి ఉసిరికాయలో లభిస్తుంది. కాబట్టి ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచడంలో, వ్యాధులతో పోరాడడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఉసిరిలో ఉండే జింక్, సెలీనియం లాంటి పోషకాలు థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి. మరోవైపు బరువును నియంత్రించడంలో, హృదయనాళ ఆరోగ్యానికి ఉసిరి ఎంతగానో తోడ్పడుతుంది.
(2 / 7)
Amla: ఇండియన్ గూస్బెర్రీగా పిలిచే ఉసిరికాయలో ఎన్నో పోషకాలతో పాటు ఔషధ గుణాలు ఉన్నాయి. నారింజ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ, దానిమ్మపండు కంటే 17 రేట్లు అధికంగా విటమిన్ సి ఉసిరికాయలో లభిస్తుంది. కాబట్టి ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచడంలో, వ్యాధులతో పోరాడడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఉసిరిలో ఉండే జింక్, సెలీనియం లాంటి పోషకాలు థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి. మరోవైపు బరువును నియంత్రించడంలో, హృదయనాళ ఆరోగ్యానికి ఉసిరి ఎంతగానో తోడ్పడుతుంది.(Pixabay)
Coconut: థైరాయిడ్ రోగులకు పచ్చి కొబ్బరి, శుద్ధమైన కొబ్బరి నూనెతో చేసే వంటలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. కొబ్బరిలో MCFAలు అంటే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్‌లు, అలాగే MTCలు అంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్‌లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి జీవక్రియను నెమ్మదిగా, నిదానంగా మెరుగుపరచడంలో సహాయపడతాయి.
(3 / 7)
Coconut: థైరాయిడ్ రోగులకు పచ్చి కొబ్బరి, శుద్ధమైన కొబ్బరి నూనెతో చేసే వంటలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. కొబ్బరిలో MCFAలు అంటే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్‌లు, అలాగే MTCలు అంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్‌లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి జీవక్రియను నెమ్మదిగా, నిదానంగా మెరుగుపరచడంలో సహాయపడతాయి.(Pixabay)
Green gram: పెసర్లలో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లతో పాటు విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. మీరు థైరాయిడ్ హెచ్చుతగ్గులతో బాధపడుతుంటే పెసర్లు తినండి. అన్ని గింజధాన్యాలలో అయోడిన్ లభిస్తుంది, అయితే పెసర్లలో ఫైబర్ కూడా ఉండటం చేత ఇవి తేలికగా జీర్ణం అవుతాయి. థైరాయిడ్ అసమతుల్యత కారణంగా కలిగే మలబద్ధకాన్ని కూడా నివారించుకోవచ్చు.
(4 / 7)
Green gram: పెసర్లలో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లతో పాటు విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. మీరు థైరాయిడ్ హెచ్చుతగ్గులతో బాధపడుతుంటే పెసర్లు తినండి. అన్ని గింజధాన్యాలలో అయోడిన్ లభిస్తుంది, అయితే పెసర్లలో ఫైబర్ కూడా ఉండటం చేత ఇవి తేలికగా జీర్ణం అవుతాయి. థైరాయిడ్ అసమతుల్యత కారణంగా కలిగే మలబద్ధకాన్ని కూడా నివారించుకోవచ్చు.(Pixabay)
Pumpkin Seeds:  గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలోని ఇతర విటమిన్లు, ఖనిజాలను గ్రహించడంలో తోడ్పడుతుంది. శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణ, సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. సంతానోత్పత్తికి సంబంధించి ఆడవారికి, మగవారికి గుమ్మడిగింజలు తీసుకోవడం వలన మంచి ప్రయోజనం లభిస్తుంది.
(5 / 7)
Pumpkin Seeds:  గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలోని ఇతర విటమిన్లు, ఖనిజాలను గ్రహించడంలో తోడ్పడుతుంది. శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణ, సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. సంతానోత్పత్తికి సంబంధించి ఆడవారికి, మగవారికి గుమ్మడిగింజలు తీసుకోవడం వలన మంచి ప్రయోజనం లభిస్తుంది.(Pixabay)
Brazil Nuts: బ్రెజిల్ నట్స్ సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. ఇందులో సెలీనియం పుష్కలంగా లభిస్తుంది. సెలీనియం అనేది థైరాయిడ్ హార్మోన్ల జీవక్రియ కోసం శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన సూక్ష్మపోషకం. T4ని T3గా మార్చడానికి సెలీనియం అవసరం. కేవలం ఒక రోజులో రెండు నుంచి మూడు బ్రిజిల్ నట్స్ తీసుకుంటే చాలు. థైరాయిడ్ పనితీరులో శక్తివంతంగా పనిచేసే సెలీనియం శరీరానికి సహజసిద్ధంగా బ్రెజిల్ నట్స్ ద్వారా లభిస్తుంది.
(6 / 7)
Brazil Nuts: బ్రెజిల్ నట్స్ సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. ఇందులో సెలీనియం పుష్కలంగా లభిస్తుంది. సెలీనియం అనేది థైరాయిడ్ హార్మోన్ల జీవక్రియ కోసం శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన సూక్ష్మపోషకం. T4ని T3గా మార్చడానికి సెలీనియం అవసరం. కేవలం ఒక రోజులో రెండు నుంచి మూడు బ్రిజిల్ నట్స్ తీసుకుంటే చాలు. థైరాయిడ్ పనితీరులో శక్తివంతంగా పనిచేసే సెలీనియం శరీరానికి సహజసిద్ధంగా బ్రెజిల్ నట్స్ ద్వారా లభిస్తుంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి