తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thyroid: ఈ రెండు ఆసనాలతో థైరాయిడ్ సమస్య దూరం!

Thyroid: ఈ రెండు ఆసనాలతో థైరాయిడ్ సమస్య దూరం!

16 December 2021, 15:54 IST

    • ఈ మధ్య తరచూ వినిపిస్తున్నదే ఈ థైరాయిడ్ సమస్య. బరువు పెరగడం, తగ్గడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంతమందిలో జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. ఇలాంటి లక్షణాలు మీలోనూ ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ మీకు థైరాయిడ్ సమస్య ఉందని తేలితే.. కంగారు పడకుండా ఇప్పుడు చెప్పబోయే యోగాసనాలు వేయండి.
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా?
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? (pexel)

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా?

జీవక్రియలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషించే థైరాయిడ్ గ్రంథి దారి తప్పితే అనేక సమస్యలు వస్తాయి. అయితే ఈ థైరాయిడ్ సమస్యలను ఇప్పుడు చెప్పబోయే రెండు ఆసనాలను ప్రతిరోజూ వేయడం ద్వారా తగ్గించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

హలాసనం

యోగాసనాలకు ఎన్నో రోగాలను నియంత్రించే శక్తి ఉంది. ఒక్కో ఆసనం శరీరంలో  ఒక్కో భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే థైరాయిడ్ కోసం కూడా ప్రత్యేకంగా రెండు ఆసనాలు ఉన్నాయి. అందులో ఒకటి హలాసనం. హలం అంటే తెలుసు కదా.. నాగలి. ఆ నాగలి రూపంలో వేసే ఆసనమే ఈ హలాసనం. కింది ఫొటోలో చూపించినట్లు వెల్లికలా పడుకొని, రెండు చేతులను నేలపైనే ఉంచి, కాళ్లను మాత్రం పూర్తిగా వెనక్కి వంచాలి. మీ గడ్డం.. గొంతుకు తగిలేలా శరీరాన్ని వంచాలి. మీ కాళ్లు తల వెనుక నేలను తగిలేలా చేయాలి. కొత్తగా యోగా చేస్తున్న వారికి ఇది అంత సులువు కాదు.  

<p>హలాసనం ఇలా వేయాలి</p>

ముఖ్యంగా నడుము నొప్పి, స్పాండిలైటిస్, హైబీపీ ఉన్న వాళ్లు ఈ ఆసనం వేయకూడదు. అలా చేస్తే ఆ నొప్పులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ ఆసనంతో థైరాయిడ్ సమస్యే కాదు.. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి పొట్ట సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి. కాళ్లు, భుజాలు బలోపేతమవడంతోపాటు శ్వాస సంబంధ సమస్యలు దూరమవుతాయి.

మత్స్యాసనం

<p>మత్స్యాసనం ఇలా వేయాలి</p>

ఇక థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టగలిగే మరో ఆసనం మత్స్యాసనం. పైన ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఈ మత్స్యాసనం వేయాల్సి ఉంటుంది. ముందుగా పద్మాసనంలో కూర్చొని అలాగే వెనక్కి పడుకోవాలి. మీ రెండు చేతులను తల కింద పెట్టుకోవాలి. ఈ ఆసనాన్ని కనీసం 30 సెకన్ల పాటు వేయాలి. ఇలా చేస్తే థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. రుతుక్రమ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ముఖం, వెన్నెముక, ఊపిరితిత్తుల సమస్యలు దూరమవుతాయి. 

టాపిక్

తదుపరి వ్యాసం