తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These Are The Food To Take To Get Rid Of Thyroid Problems

Food For Thyroid | ఈ 5 ఆహార పదార్థాలతో థైరాయిడ్‌కు చెక్‌!

13 January 2022, 16:29 IST

మంచి ఆహారం, ప్రతిరోజూ కసరత్తులతో థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మీ థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి ఆయుర్వేద నిపుణురాలైన డాక్టర్ దీక్షా భవ్సార్ 5 ఆహార పదార్థాలను సూచించారు.

  • మంచి ఆహారం, ప్రతిరోజూ కసరత్తులతో థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మీ థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి ఆయుర్వేద నిపుణురాలైన డాక్టర్ దీక్షా భవ్సార్ 5 ఆహార పదార్థాలను సూచించారు.
జనవరిని థైరాయిడ్‌పై అవగాహన నెలగా ప్రకటించారు. ఈ నెల రోజులు థైరాయిడ్‌ సంబంధిత ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించనున్నారు. మన గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి.. మన ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది సరిగా పనిచేయకపోతే.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే థైరాయిడ్‌ ఆరోగ్యంగా ఉండటానికి 5 రకాల సూపర్‌ఫుడ్స్‌ను డాక్టర్‌ దీక్షా భవ్సార్‌ సూచిస్తున్నారు.
(1 / 6)
జనవరిని థైరాయిడ్‌పై అవగాహన నెలగా ప్రకటించారు. ఈ నెల రోజులు థైరాయిడ్‌ సంబంధిత ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించనున్నారు. మన గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి.. మన ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది సరిగా పనిచేయకపోతే.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే థైరాయిడ్‌ ఆరోగ్యంగా ఉండటానికి 5 రకాల సూపర్‌ఫుడ్స్‌ను డాక్టర్‌ దీక్షా భవ్సార్‌ సూచిస్తున్నారు.(Pixabay)
1. ఉసిరి: మన ఉసిరిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. రోగాలకు అడ్డుకట్ట వేస్తాయి. దానిమ్మ పండులో ఉండే విటమిన్‌ సి కంటే 17 రెట్లు, కమలా లేదా సంత్ర పండులో ఉండే విటమిన్‌ సి కంటే 7 రెట్లు ఎక్కువ ఉసిరిలో ఉంటుంది. ముఖ్యంగా తల వెంట్రుకలకు ఇది దివ్యౌషధం. ఉసిరిని రెగ్యులర్‌గా తీసుకుంటే.. రక్తప్రసరణ మెరుగ్గా జరిగి జుట్టు బాగా పెరుగుతుంది.
(2 / 6)
1. ఉసిరి: మన ఉసిరిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. రోగాలకు అడ్డుకట్ట వేస్తాయి. దానిమ్మ పండులో ఉండే విటమిన్‌ సి కంటే 17 రెట్లు, కమలా లేదా సంత్ర పండులో ఉండే విటమిన్‌ సి కంటే 7 రెట్లు ఎక్కువ ఉసిరిలో ఉంటుంది. ముఖ్యంగా తల వెంట్రుకలకు ఇది దివ్యౌషధం. ఉసిరిని రెగ్యులర్‌గా తీసుకుంటే.. రక్తప్రసరణ మెరుగ్గా జరిగి జుట్టు బాగా పెరుగుతుంది.(Pixabay)
2. కొబ్బరి: థైరాయిడ్‌ పేషెంట్లకు కొబ్బరి చాలా బాగా పని చేస్తుంది. పచ్చి కొబ్బరి అయినా, కొబ్బరి నూనె అయినా శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కొబ్బరిలో మీడియం చెయిన్‌ ఫ్యాటీ యాసిడ్స్‌, మీడియం చెయిన్‌ ట్రైగ్లిజరైడ్స్‌ ఉంటాయి. ఇవి కూడా జీవక్రియను మెరుగుపరుస్తాయి.
(3 / 6)
2. కొబ్బరి: థైరాయిడ్‌ పేషెంట్లకు కొబ్బరి చాలా బాగా పని చేస్తుంది. పచ్చి కొబ్బరి అయినా, కొబ్బరి నూనె అయినా శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కొబ్బరిలో మీడియం చెయిన్‌ ఫ్యాటీ యాసిడ్స్‌, మీడియం చెయిన్‌ ట్రైగ్లిజరైడ్స్‌ ఉంటాయి. ఇవి కూడా జీవక్రియను మెరుగుపరుస్తాయి.(Pixabay)
3. గుమ్మడికాయ గింజలు: శరీరం ఇతర విటమిన్లు, ఖనిజాలను శోషణ చేసుకోవడానికి ఎంతో అవసరమైన జింక్‌ ఈ గుమ్మడికాయ గింజల్లో ఉంటుంది. థైరాయిడ్‌ హార్మోన్లను బ్యాలెన్స్‌ చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.
(4 / 6)
3. గుమ్మడికాయ గింజలు: శరీరం ఇతర విటమిన్లు, ఖనిజాలను శోషణ చేసుకోవడానికి ఎంతో అవసరమైన జింక్‌ ఈ గుమ్మడికాయ గింజల్లో ఉంటుంది. థైరాయిడ్‌ హార్మోన్లను బ్యాలెన్స్‌ చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.(Pixabay)
4. బ్రెజిల్‌ గింజలు: థైరాయిడ్‌ హార్మోన్ల జీవక్రియ సరిగా జరగడానికి సెలీనియం అనే సూక్ష్మపోషక పదార్థం శరీరానికి అవసరం. ఇది బ్రెజిల్‌ నట్స్‌లో పుష్కలంగా ఉంటుంది. రోజూ మూడు గింజలు తింటే చాలు.. థైరాయిడ్‌ గ్రంథికి అవసరమైన ఖనిజాలు లభిస్తాయి.
(5 / 6)
4. బ్రెజిల్‌ గింజలు: థైరాయిడ్‌ హార్మోన్ల జీవక్రియ సరిగా జరగడానికి సెలీనియం అనే సూక్ష్మపోషక పదార్థం శరీరానికి అవసరం. ఇది బ్రెజిల్‌ నట్స్‌లో పుష్కలంగా ఉంటుంది. రోజూ మూడు గింజలు తింటే చాలు.. థైరాయిడ్‌ గ్రంథికి అవసరమైన ఖనిజాలు లభిస్తాయి.(Pixabay)
5. పెసర్లు: వీటిలో ప్రొటీన్‌, యాంటీఆక్సిడెంట్స్‌, కార్బొహైడ్రేట్స్‌, విటమిన్లు, ఖనిజాలు అధిక సంఖ్యలో ఉంటాయి. అంతేకాకుండా థైరాయిడ్‌తో ప్రధానంగా ఎదురయ్యే మలబద్ధకం సమస్యకు చెక్‌ పెట్టే ఫైబర్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది సులువుగా అరుగుతాయి కూడా. థైరాయిడ్‌ సమస్యలు ఉన్న వాళ్లు పెసళ్లను రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.
(6 / 6)
5. పెసర్లు: వీటిలో ప్రొటీన్‌, యాంటీఆక్సిడెంట్స్‌, కార్బొహైడ్రేట్స్‌, విటమిన్లు, ఖనిజాలు అధిక సంఖ్యలో ఉంటాయి. అంతేకాకుండా థైరాయిడ్‌తో ప్రధానంగా ఎదురయ్యే మలబద్ధకం సమస్యకు చెక్‌ పెట్టే ఫైబర్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది సులువుగా అరుగుతాయి కూడా. థైరాయిడ్‌ సమస్యలు ఉన్న వాళ్లు పెసళ్లను రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి