తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Thyroid Day 2022 | థైరాయిడ్ ఉన్నవారు వీటిని అస్సలు తినకూడదు..

World Thyroid day 2022 | థైరాయిడ్ ఉన్నవారు వీటిని అస్సలు తినకూడదు..

HT Telugu Desk HT Telugu

25 May 2022, 11:15 IST

google News
    • థైరాయిడ్ అనేది మన మెడ ముందు భాగంలో ఉండే గ్రంథి. ఇది టెట్రాయోడోథైరోనిన్, ట్రైఅయోడోథైరోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల ఉత్పత్తి అవసరానికి మించి పెరిగినప్పుడు.. హైపర్ థైరాయిడిజం ఏర్పడుతుంది. వరల్డ్ థైరాయిడ్ డే సందర్భంగా దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
థైరాయిడ్ పేషెంట్లకు డైట్
థైరాయిడ్ పేషెంట్లకు డైట్

థైరాయిడ్ పేషెంట్లకు డైట్

World Thyroid day 2022 | థైరాయిడ్ వ్యాధి ప్రతి పది మంది భారతీయులలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో సుమారు 42 మిలియన్ల మంది ప్రజలు దీనితో బాధపడుతున్నారు. థైరాయిడ్ అనేది మన మెడ ముందు భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది మన శరీరంలోని ప్రతి కణం, కణజాలం, అవయవాన్ని ప్రభావితం చేసే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

థైరాయిడ్ గ్రంధి కణాల మరమ్మత్తు, జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది మన శక్తి స్థాయిలు, మానసిక స్థితిని నియంత్రిస్తుంది. కాబట్టి శరీరం సరిగ్గా పనిచేయాలంటే.. ఈ గ్రంథి పనిచేయడం చాలా ముఖ్యం. ఈ హార్మోన్లు లేని హైపోథైరాయిడిజం రోగులు ప్రమాదకరమైన లక్షణాలు, సంక్లిష్టతలను ఎదుర్కొంటారు.

థైరాయిడ్ లక్షణాలు

అలసట, మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం, జుట్టు రాలడం, కండరాల బలహీనత, ముఖం ఉబ్బినట్లు కనిపించడం, మలబద్ధకం, పొడిబారిన చర్మం, కీళ్ళ నొప్పులు.. హైపోథైరాయిడిజానికి సంకేతాలు.

ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి..

థైరాయిడ్ జీవక్రియ, జీర్ణక్రియ, దాని పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి తినే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఇది కడుపును ఖాళీ చేసేందుకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా కడుపులోని మలినాలను బయటకు పంపుతుంది. మెటబాలిక్ రేటును మెరుగుపరచడం కోసం ప్రోటీన్లను తగినంత మొత్తంలో ఆహారంలో చేర్చాలి.

హైపోథైరాయిడిజం ఉన్నవారు తమ ఆహారంలో కొబ్బరి నూనెను ప్రధాన పోషకాలలో ఒకటిగా చేర్చుకోవాలి. ఇది యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. అవిసె, చియా గింజలు ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్ (ALA)తో నిండి ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును నియంత్రిస్తాయి. నట్స్, గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు డైట్​లో చేర్చుకోవాలి. సెలీనియం సప్లిమెంట్లను చేర్చడం కూడా మంచిదే. 

శుద్ధి చేసిన పిండి, రొట్టెలు, మొక్కజొన్న, మఫిన్లు, కేకులు వంటి ఆహారాలు బరువు పెరగటానికి కారణమవుతాయి. 

సరైన నిద్ర అవసరం..

సాధారణ నిద్ర షెడ్యూల్​, ఆరోగ్యకరమైన సిర్కాడియన్ రిథమ్‌ను ఫాలో అవ్వండి. రాత్రిపూట బ్లూ లైట్, ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండండి.

స్వీయ సంరక్షణ

ధ్యానం, లోతైన శ్వాస వంటి ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాలలో పాల్గొనండి.

టాపిక్

తదుపరి వ్యాసం