Thyroid Diet | థైరాయిడ్‌తో బాధపడుతున్నారా? అయితే వీటిని ఫాలో అయిపోండి..
30 April 2022, 12:36 IST
- థైరాయిడ్ అనేది అధిక బరువు, ఒత్తిడి వల్ల రావొచ్చు. ఒక్కసారి థైరాయిడ్ కన్ఫార్మ్ అయ్యాక మీరు కచ్చితంగా మందులు వాడాల్సిందే. మందులు తీసుకోవడంలో జాప్యం జరిగితే.. మీలో థైరాయిడ్ మరింత పెరిగే అవకాశముంటుంది. అంతే కాదు కొన్ని ఆహారాపదార్థాల వల్ల థైరాయిడ్ మరింత పెరగవచ్చు. మీరు కూడా థైరాయిడ్‌తో బాధపడుతుంటే మెరుగైన ఆరోగ్యం వీటిని ట్రై చేయండి.
థైరాయిడ్
Diet For Thyroid Dieses | థైరాయిడ్ హార్మోన్ పునఃస్థాపన చికిత్స అనేది హైపోథైరాయిడిజంకు అత్యంత సాధారణ చికిత్స. వాస్తవానికి మందులు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. టాబ్లెట్ తీసుకోవడంలో మీరు విఫలమైతే థైరాయిడ్ లక్షణాల పెరుగుదలకు దారితీయవచ్చు. సహజ నివారణలు తక్కువ ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండవచ్చు. కొన్ని పరిస్థితులలో మీ సాధారణ జీవనశైలికి కూడా బాగా సరిపోతాయి. కాబట్టి మందులు తీసుకోవడంతో పాటు.. మీ జీవనశైలిని మెరుగుపరచడానికి వీటిని ఫాలో అయిపోండి.
షుగర్ ఫ్రీ ఆహారం
చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాల వల్ల శరీరంలో మంట తీవ్రమవుతుంది. ఈ క్రమంలో థైరాయిడ్ హార్మోన్‌కు చెందిన ట్రైయోడోథైరోనిన్‌గా టీ4 మార్పిడి వాపు ద్వారా మందగించవచ్చు. దీని ఫలితంగా మీ లక్షణాలు, థైరాయిడ్ వ్యాధి మరింత తీవ్రమవుతుంది. చక్కెర కూడా మీకు తాత్కాలిక శక్తిని మాత్రమే ఇస్తుంది. మీ ఆహారం నుంచి దానిని తొలగించడం వలన.. మీ శక్తి స్థాయిలను నియంత్రించవచ్చు. అంతేకాకుండా ఇది మీ ఒత్తిడి స్థాయిలతో పాటు మీ చర్మానికి కూడా ప్రయోజనం చేకూర్చుతుంది.
విటమిన్ బి
కొన్ని విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా.. థైరాయిడ్‌ను తగ్గించుకోవచ్చు. విటమిన్ B-12 స్థాయిలు.. తక్కువ థైరాయిడ్ హార్మోన్ల ద్వారా ప్రభావితమవుతాయి. విటమిన్ B-12 సప్లిమెంట్ తీసుకోవడం వల్ల హైపో థైరాయిడిజం వల్ల కలిగే నష్టాన్ని తిరిగి పొందడంలో సహాయపడవచ్చు.
గ్లూటెన్ రహిత ఆహారం
గ్లూటెన్ చిన్న పేగులలో.. రోగనిరోధక ప్రతిచర్యను కలిగిస్తుంది. ఇది సెలియక్ వ్యాధికి కారణమవుతుంది. మరోవైపు హషిమోటోస్ థైరాయిడిటిస్, హైపోథైరాయిడిజం ఉన్న చాలా మంది వ్యక్తులు తమ ఆహారం నుంచి గోధుమలు, ఇతర గ్లూటెన్-కలిగిన ఆహార పదార్థాలను మానేయడం వల్ల మంచి ఫలితాలు పొందినట్లు గుర్తించారు. అయితే గ్లూటెన్-ఫ్రీకి వెళ్లడానికి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. స్టార్టర్స్ కోసం, గోధుమ ఆధారిత వస్తువుల కంటే.. గ్లూటెన్ రహిత భోజనం కాస్త ఎక్కువ ఖరీదు ఉంటుంది. కొన్ని గ్లూటెన్ రహిత ప్రీప్యాకేజ్డ్ వస్తువులు అనారోగ్యకరమైనవి. ఎందుకంటే ఈ ఆహారాలలో గోధుమ ఆధారిత వస్తువుల కంటే ఎక్కువ కొవ్వు, తక్కువ ఫైబర్ ఉండవచ్చు.
ప్రోబయోటిక్స్
ప్రోబయోటిక్ మాత్రలలో ఉండే ప్రత్యక్ష ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మీ కడుపు, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పులియబెట్టిన ఆహారాలు, పానీయాలు, కొన్ని చీజ్‌లు, ముఖ్యంగా పెరుగు వంటివి ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి. కానీ ఎఫ్‌డీఏ ఏదైనా వ్యాధి నివారణ లేదా చికిత్స కోసం ప్రోబయోటిక్స్ వాడకాన్ని ఆమోదించలేదు. ఈ సప్లిమెంట్లు మీకు సహాయపడతాయో లేదో తెలుసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించండి.
వీటి వల్ల మీకు థైరాయిడ్ మొత్తం క్యూర్ అవుతుందని మాత్రం అనుకోకండి. ఇవి మీకు థైరాయిడ్‌ను అదుపులో ఉంచేందుకు సహాయం చేస్తాయి. మీకు థైరాయిడ్ వ్యాధి ఉన్నా లేకున్నా.. మెరుగైన ఆరోగ్యం కోసం వీటిని మీ డైట్లో చేర్చుకోవచ్చు.
టాపిక్