తెలుగు న్యూస్ / ఫోటో /
Foods for Gut Health | పేగు ఆరోగ్యానికి ఈ 5 ఆహార పదార్థాలు తీసుకోవాలి!
- Foods for Gut Health- జీర్ణాశయాంతర సమస్యలు, పేగు పూతల కారణంగా బ్యాక్టీరియాలు, టాక్సిన్లు పేగు గోడలపై చేరతాయి. మీ పేగు గోడలు బలహీనంగా ఉంటే, అది మీ రక్తంలోకి ఈ మలినాలను పంపవచ్చు. తద్వారా అనేక సమస్యలు వస్తాయి. ఈ సమస్యకు డైటీషియన్ మన్‌ప్రీత్ 5 రకాల ఆహార మార్పులను సూచించారు.

(1 / 7)
లీకీ గట్ సిండ్రోమ్ లేదా పేగు పూతల కారణంగా కడుపులోని బాక్టీరియా, టాక్సిన్స్ పేగు గోడ ద్వారా కదులుతాయి. ఇది తర్వాత పేగు వాపుకు దారితీయవచ్చు, ఇతర సమస్యలను కలిగించవచ్చు. లీకీ గట్ సమస్య ఉన్నప్పుడు పేగులో మంట, అతిసారం, గ్యాస్ , ఉబ్బరం, బాధాకరమైన అజీర్ణం వంటి లక్షణాలు ఉంటాయి. పాలు ఎక్కువగా తాగటం, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం, గ్లూటెన్, చక్కెర లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల ఈ గట్ లీకేజీకి కారణమవుతుంది.(Twitter/mymycolab_llc)
(2 / 7)
పొటాషియం సమృద్ధిగా ఉండే అరటిపండు, ఇతర ఆహారాలను తీసుకోండి. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడటంతో పాటు ప్రేగుల సంకోచాన్ని ప్రేరేపిస్తుంది.(Pixabay)
(3 / 7)
పేగు ఆరోగ్యం మెరుగుపరచడానికి మజ్జిగ లాంటి ప్రోబయోటిక్స్ , ప్రీ-బయోటిక్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.(Unsplash)
(4 / 7)
జింక్ పుష్కలంగా లభించే గుమ్మడికాయ గింజలు, సబ్జా గింజలు మొదలైన ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. పేగు లీకేజీ సమస్య ఉన్నప్పుడు అది పేగును మరింత దగ్గరగా, బిగుతుగా చేస్తుంది.(Pixabay)
(5 / 7)
అలాగే జీడిపప్పు, బాదం వంటి నట్స్ కూడా తీసుకోవచ్చు. వీటిల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది పేగు వాపును తగ్గిస్తుంది.(Unsplash)
(6 / 7)
అవిసె గింజల్లో ఒమేగా 3లు పుష్కలంగా ఉంటాయి. ఇది లీకీ గట్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గిస్తుంది.(Pixabay)
ఇతర గ్యాలరీలు