తెలుగు న్యూస్ / ఫోటో /
Digestive Problems : జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడుతుంటే.. ఈ ఫుడ్‌కి దూరంగా ఉండండి..
- Acidity Remedies : చాలా మంది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యలను ఇగ్నోర్ చేస్తే.. తెలియకుండానే ఈ సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి. అయితే దీనిలో భాగంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

(1 / 7)
జీర్ణసమస్యలు ఉన్నవారికి ఉపవాసం ఎంత ప్రమాదకరమో.. కొన్ని ఆహారాలు కూడా అంతే సమస్యలను కలిగిస్తాయి. పైగా ఒక్కోసారి గ్యాస్ సమస్యలకు దారి తీస్తాయి. వీటిని తగ్గించుకోకుంటే.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది.
(2 / 7)
మీకు తెలియకుండానే మీ కడుపు సమస్యలను పెంచే ఆహారాలు ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడమే మంచిది. మరి అవి ఏ ఆహారాలో తెలుసుకుని.. వాటికి దూరంగా ఉండండి.
(3 / 7)
స్పైసీ ఫుడ్ జీర్ణ సమస్యలకు కారణాలలో ఒకటి. మీరు ఇప్పటికే జీర్ణ సమస్యలు కలిగి ఉంటే.. అటువంటి ఆహారాలు తినడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇది అజీర్ణం, గుండెల్లో మంటను పెంచుతుంది. కాబట్టి ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
(4 / 7)
నూనె, వేయించిన ఆహారాలు యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. నూనె, వేయించిన ఆహారాలు జీర్ణం కావడం కష్టం. కాబట్టి కడుపు నెమ్మదిగా ఖాళీ అవుతుంది. ఫలితంగా గుండెల్లో మంట సమస్య పెరుగుతుంది.
(5 / 7)
మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే.. కాఫీ పానీయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. పొట్టలో కెఫీన్ ఎక్కువగా ఉంటే విరేచనాలు కావచ్చు. ఎందుకంటే ఇది అన్నవాహికలో ఆహారాన్ని వేగవంతం చేస్తుంది.
(6 / 7)
పాల ఉత్పత్తులు యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది. కాబట్టి మీరు ఇప్పటికే జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. అటువంటి ఆహారాలను తినకుండా ఉండటమే మంచిది.
ఇతర గ్యాలరీలు