Morning Routine | ఆదర్శవంతమైన దినచర్యకు ఉపాయాలు.. నిద్రలేవగానే చేయాల్సిన పనులు
రోజూ ఉదయం నిద్రలేవగానే ఎలాంటి దినచర్య కలిగి ఉండాలి? ఆరోగ్య నిపుణులు ఆదర్శమైన దినచర్య కోసం కొన్ని సులభమైన ఉపాయాలు సూచిస్తున్నారు.
ఉదయం లేవగానే ఒక ఆదర్శమైన దినచర్యను అలవాటుగా చేసుకోవాలి. ఇలా ఒక దినచర్యను ఏర్పాటు చేసుకుంటే రోజూ ఉదయం సరైన సమయానికి మేల్కొంటారు, మీ పనులపై మీకు స్పష్టత ఉంటుంది. రోజంతా మీరు మీ పనులను ఏకాగ్రతతో చేయగలుగుతారు. మీలో నెగెటివ్ ఆలోచనలను, అసంబద్ధమైన భావనలను నివారించవచ్చు.
కాబట్టి మీకు మీరుగా సరైన మార్నింగ్ రొటీన్‌ను రూపొందించుకోండి. ఈ మార్నింగ్ రొటీన్ ఐడియాలలో కొన్నింటిని ప్రయత్నించండి.
ముందుగా మేల్కొనండి
చాలా మంది అలారం పెట్టుకొని అనుకున్న సమయానికి కాకుండా ఇంకా కొంచెం అలారం స్నూజ్ చేసి 15 నిమిషాలు ఆలస్యంగా నిద్రలేవడానికి ప్రయత్నిస్తరు. అలా కాకుండా అలారం పెట్టుకుని మీరు నిద్రలేచే సమయం కంటే 15 నిమిషాలు ముందుగానే లేవడానికి ప్రయత్నించండి. ఇది మొదట్లో కష్టంగా అనిపించినా, తర్వాత అలవాటు అవుతుంది. ఇలా లేవడంతోనే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
మీ ఫోన్‌కు దూరంగా ఉండండి
మీరు మేల్కొన్న వెంటనే మీ శరీరం, మనస్సు ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది. ఆ స్థితిని అలాగే కొనసాగించేందుకు మీ ఫోన్‌కు దూరంగా ఉండాలి. చాలామంది నిద్రలేవగానే ఫో తీసుకొని చూస్తారు. ఇక అందులోనే సమయం గడిచిపోతుంది.కొన్నిసార్లు ప్రశాంతమైన మీ మనసులో అది అలజడి కూడా రేపుతుంది. కాబట్టి ఉదయం లేచిన వెంటనే మీ మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండాలని సిఫారసు చేస్తున్నారు.
ఈరోజు మీరేం చేయాలో నిర్ధారించుకోండి
రోజులో మీరు పూర్తి చేయాల్సిన పనులకు సంబంధించిన జాబితాను సెట్ చేసుకోండి. మీ రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. ఇలా సెట్ చేసుకోవడం వలన చాలా వరకు పనులు వాయిదాపడవు, అనుకున్నవి అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు.
కొంచెం శారీరక శ్రమ
ఉదయం లేవగానే ఒక 10 నిమిషాల పాటు ఆరుబయట గాలికి తిరగటం మంచిది. సూర్యోదయం ఆస్వాదించడం చేయాలి. ఉదయాన్నే ఇలా కొద్దిపాటి శారీరక శ్రమ కల్పించడం ద్వారా మీలో చురుకుదనం పెరుగుతుంది. శరీరంలో ఒత్తిడి హర్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఎండార్ఫిన్‌లను విడుదల అవుతాయి. దీంతో మీకు రోజంతా మంచి మానసిక స్థితి ఏర్పడుతుంది.
సంరక్షణ చర్యలు
మీ శరీరానికి సంబంధించిన సంరక్షణ చర్యల కోసం సమయం కేటాయిచాలి. మీ శరీరాన్ని శుభ్రపరుచుకోవడం, దంతాలను శుభపరుచుకోవడం, అల్పాహారం తీసుకోవడం మిగతా కార్యకలాపాలు చేసుకుంటూ ముందుకుసాగాలి. ఇలా రోజూ ఒక క్రమపద్ధతిలో సాగుతుంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం మెరుగుపడి పరిపూర్ణ ఆరోగ్యం సాధించగలుగుతారు.
సంబంధిత కథనం