Thyroid Symptoms: థైరాయిడ్ ప్రారంభ లక్షణాలు ఇవే-early signs of hypothyroidism and hyperthyroidism symptoms ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thyroid Symptoms: థైరాయిడ్ ప్రారంభ లక్షణాలు ఇవే

Thyroid Symptoms: థైరాయిడ్ ప్రారంభ లక్షణాలు ఇవే

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 11, 2022 12:14 PM IST

Thyroid Symptoms: థైరాయిడ్ లక్షణాలు ప్రారంభంలోనే గుర్తిస్తే సత్వరం చికిత్స ప్రారంభించవచ్చు. థైరాయిడ్ హార్మోన్ తగినంత మొత్తంలో లేనప్పుడు హైపోథైరాయిడిజం, అధికంగా థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తే హైపర్ థైరాయిడిజం వస్తుంది.

థైరాయిడ్ లక్షణాలు
థైరాయిడ్ లక్షణాలు

Signs of Thyroid: థైరాయిడ్ గ్రంధి అందరికీ ఉటుంది. అది సరైన స్థాయిలో ఉంటే ఆరోగ్యానికి మంచిది. కానీ అది ఎక్కువైనా.. తక్కువైనా మాత్రం ఇబ్బందులు చాలా కష్టం. ఈ మధ్యకాలంలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. పేద పోషకాహారం నుంచి ఒత్తిడి వరకు.. అనేక అంశాలు దీనికి కారణమవుతున్నాయి. థైరాయిడ్ అనేది సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఓ గ్రంధి. ఇది మెడ భాగంలో ఉంటుంది. ఇది మానవ శరీరం జీవక్రియ చర్యలలో ముఖ్యమైన భాగం. అందుకే మన థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మన మొత్తం శ్రేయస్సుకు బాధ్యత వహిస్తుంది కాబట్టి.

అయితే కొన్ని ప్రారంభ సంకేతాలు థైరాయిడ్​కు దారి తీస్తాయి అంటున్నారు నిపుణులు. మీరు వీటిలో దేనిని ఎదుర్కున్నా.. ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోవడం మంచిది. మరి సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

థైరాయిడ్ ప్రారంభ లక్షణాలు

  1. అతిసారం (హైపర్ థైరాయిడిజం), మలబద్ధకం (హైపోథైరాయిడిజం) వంటి జీర్ణశయాంతర సమస్యలు
  2. కోపం (హైపర్ థైరాయిడిజం), డిప్రెషన్ (హైపోథైరాయిడిజం) వంటి మూడ్ మార్పులు. 
  3. బరువు తగ్గడం (హైపర్ థైరాయిడిజం), బరువు పెరగడం (హైపోథైరాయిడిజం) వంటి బరువు మార్పులు 
  4. జిడ్డు చర్మం (హైపర్ థైరాయిడిజం), పొడి చర్మం (హైపోథైరాయిడిజం) వంటి చర్మ సమస్యలు 
  5. వేడి వాతావరణంలో ఇబ్బంది, చెమటలు పట్టడం, వేడి ఆవిర్లు (హైపర్ థైరాయిడిజం) & చల్లని వాతావరణం, చల్లని పాదాలు, చేతుల్లో ఇబ్బంది (హైపోథైరాయిడిజం) వంటి ఉష్ణోగ్రత మార్పులకు సున్నితత్వం
  6. దృష్టి మార్పులలో (హైపర్ థైరాయిడిజం) కళ్లలో నీరు కారడం, ఎరుపు లేదా పొడిబారడం, కనురెప్పలు మూసుకుపోవడం, కళ్లు వాపు వంటివి ఉంటాయి.
  7. జుట్టు రాలడం, సన్నబడటం (హైపర్ థైరాయిడిజం)
  8. జ్ఞాపకశక్తి సమస్యలు (హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం)
  9. మెడలో గడ్డలు లేదా నోడ్యూల్స్ థైరాయిడ్ క్యాన్సర్ సంకేతం కావచ్చు. మీరు గడ్డను గమనించినట్లయితే.. దయచేసి వైద్యుడిని సంప్రదించండి.

WhatsApp channel