Telugu Cinema News Live September 29, 2024: OTT Telugu Releases: అక్టోబర్ తొలివారంలో ఒకే ఓటీటీలోకి మూడు తెలుగు సినిమాలు.. ఓ చిత్రం డైరెక్ట్‌గా స్ట్రీమింగ్
29 September 2024, 22:49 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
- OTT Telugu Releases: ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఒకే వారం మూడు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఓ ఫీల్‍గుడ్ మూవీ అడుగుపెట్టనుంది. ఓ మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. ఆ వివరాలు ఇవే..
- Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమా తొలి ఈవెంట్‍కు డేట్, టైమ్ ఫిక్స్ అయ్యాయి. రెండో పాట లాంచ్ కోసం ఇది జరగనుంది. ఈ మూవీ టీజర్ సహా తదుపరి పాట గురించి నిర్మాత దిల్‍రాజు అప్‍డేట్స్ ఇచ్చారు.
- OTT Movies: జాన్వీ కపూర్ లీడ్ రోల్ చేసిన ఉలఝ్ చిత్రం ఓటీటీలో మంచి ఆరంభం అందుకుంది. ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. సరిపోదా శనివారం చిత్రాన్ని దాటి ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్‍కు వెళ్లింది.
- OTT Survival Drama Movie: బోట్ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ తమిళ సర్వైవల్ డ్రామా మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో యోగిబాబు లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం ఎప్పుడు.. ఏ ఓటీటీలో అడుగుపెట్టనుందంటే..
- Bigg Boss Telugu 8 Manikanta: బిగ్‍బాస్ హౌస్‍లో మణికంఠను ఇతర హౌస్‍మేట్స్ టార్గెట్ చేశారు. అతడిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మణికి బిగ్‍బాస్ ఓ శిక్ష వేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- Bigg Boss 8 Telugu - Soniya Elimination Trolls: బిగ్‍బాస్ హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయ్యారని లీకులు వచ్చాయి. అప్పుడే సోషల్ మీడియాలో ఈ విషయంపై ట్రోల్స్ వస్తున్నాయి. సోనియాకు నెగెటివ్‍గానే ఎక్కువ పోస్టులు వస్తుండగా.. కొందరు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా సోనియా ఎలిమినేషన్ అంశం వైరల్‍గా మారింది.
Laggam Release Date: తెలంగాణ నేపథ్యంలో రూపొందిన లగ్గం మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. అక్టోబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాయిరోనక్, ప్రగ్యానగ్రా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
- Devara Day 2 worldwide Collections: దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. తొలి రోజు భారీ ఓపెనింగ్ అందుకున్న ఈ మూవీ.. రెండో రోజు మాత్రం భారీగా డ్రాప్ అయింది. రెండు రోజుల కలెక్షన్ల వివరాలు మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.
Bigg Boss Promo: సండే ఎపిసోడ్ ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వీక్ ఇద్దరు కంటెస్టెంట్స్‌ను హౌజ్ నుంచి పంపించే అవకాశం ఉందని అంటున్నారు. సోనియా ఆకులతో పాటు ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతోన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
OTT Horror: మలయాళం హారర్ మూవీ ఫీనిక్స్ థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మనోరమా మాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ రొమాంటిక్ హారర్ మూవీలో అజు వర్గీస్, అనూప్ మీనన్ కీలక పాత్రలు పోషించారు.
Devara: ఎన్టీఆర్ దేవర మూవీ కలెక్షన్స్ రెండో రోజు దారుణంగా పడిపోయాయి. తొలిరోజు 54 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ రెండో రోజు 16 కోట్ల వసూళ్లను మాత్రమే దక్కించుకుంది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 220 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతోన్న అనామిక సీరియల్ శనివారం నాటితో ముగిసింది. కేవలం అరవై ఎపిసోడ్స్‌తోనే ఈ హారర్ సీరియల్‌కు మేకర్స్ శుభంకార్డు వేశారు. ఈ ఏడాది జూలైలో ప్రారంభమైన అనామిక సెప్టెంబర్‌లో ముగిసింది. అనామికతో పాటు మరో మూడు సీరియల్స్‌కు జెమిని టీవీ ఎండ్ కార్డ్ వేయబోతున్నది.
Balakrishna: నందమూరి వారసుడు ఎవరనేదానిపై ఐఫా 2024 వేడుకలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. ఐఫా వేడుకలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశాడు బాలకృష్ణ. అఖండ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు.
Brahmamudi Promo: బ్రహ్మముడి ప్రోమోలో కావ్య, రాజ్ గుడిలో ఒకరికొకరు ఎదురుపడతారు. తనను ఫాలో అవుతూ కావ్య గుడికి వచ్చిందని అపార్థం చేసుకున్న రాజ్ ఆమెతో గొడవపతాడు. రాజ్‌కు మాటకు మాట సమాధానమిస్తుంది కావ్య. రాజ్‌ను రావణాసురుడితో పోలుస్తుంది.
Malayalam OTT: మీరా జాస్మిన్ మలయాళం కామెడీ డ్రామా మూవీ పాలుమ్ పాలవుమ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. రెండు ఓటీటీలలో ఈ మూవీ రిలీజ్‌కానుంది. అక్టోబర్ సెకండ్ వీక్‌లో అమెజాన్ ప్రైమ్‌తో పాటు మనోరమా మాక్స్ ఓటీటీలలో పాలుమ్ పాళవుమ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.