Devara Collections Day 2: తెలుగు రాష్ట్రాల్లో సగానికి పడిపోయిన దేవర కలెక్షన్స్ - రెండు రోజుల్లో వచ్చింది ఎంతంటే?
Devara: ఎన్టీఆర్ దేవర మూవీ కలెక్షన్స్ రెండో రోజు దారుణంగా పడిపోయాయి. తొలిరోజు 54 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ రెండో రోజు 16 కోట్ల వసూళ్లను మాత్రమే దక్కించుకుంది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 220 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Devara Collections Day 2: ఎన్టీఆర్ దేవర మూవీ రెండో రోజు బాక్సాఫీస్ వద్ద డిసపాయింట్ చేసింది. శనివారం రోజు తెలుగు రాష్ట్రాల్లో దేవర కలెక్షన్స్ సగానికిపైగా తగ్గుముఖం పట్టాయి. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో దేవర 54 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు సినిమా యూనిట్ వర్గాలు ప్రకటించారు. రెండో రోజు 16 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చినట్లు వెల్లడించారు.
కోటిలోపే...
రెండో రోజు దేవర మూవీ నైజాం ఏరియాలో 6.94 కోట్ల వసూళ్లు రాగా...సీడెడ్‌లో 3.77 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరుతో పాటు పలు ఏరియాల్లో కోటి కూడా వసూళ్లను కూడా ఈ మూవీ సొంతం చేసుకోలేకపోయింది. రెండు రోజు సగానికి పైగా కలెక్షన్స్ పడిపోవడం డిస్ట్రిబ్యూటర్లతో పాటు ట్రేడ్ వర్గాలను షాకింగ్‌కు గురిచేస్తోంది. రెండు రోజుల్లో విత్ ఔట్ జీఎస్టీతో తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీకి 70.33 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
220 కోట్ల కలెక్షన్స్...
రెండో రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా నలభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిసింది. మొత్తంగా రెండు రోజుల్లో 220 కోట్ల వరకు కలెక్షన్స్ దక్కించుకున్నట్లు చెబుతోన్నారు. ఈ ఏడాది కల్కి తర్వాత హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన తెలుగు మూవీగా దేవర రికార్డ్ క్రియేట్ చేసింది.
పెరిగిన హిందీ కలెక్షన్స్...
తొలిరోజుతో పోలిస్తే హిందీలో దేవర కలెక్షన్స్ పెరగడం గమనార్హం. శుక్రవారం రోజు దేవర హిందీ వెర్షన్ 7 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా...శనివారం రోజు తొమ్మిది కోట్లు వచ్చాయి. తమిళ వెర్షన్ రెండోరోజు కూడా కోటికిపైనే కలెక్షన్స్ సొంతం చేసుకున్నది.
దేవర...వర...
దేవర మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో దేవర, వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించాడు. ఎన్టీఆర్ ఎలివేషన్స్, హీరోయిజంతో పాటు అతడిపై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి. కథ ప్రెడిక్టబుల్‌గా ఉండటం, ఎమోషనల్ కంటెంట్ మిస్ కావడంతో సినిమాపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెకండ్ పార్ట్‌కు లీడ్ ఇస్తూ డైరెక్టర్ కొరటాల శివ డిజైన్ చేసిన క్లైమాక్స్‌పై దారుణంగా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి.
దేవర పార్ట్ 2...
దేవర మూవీతో జాన్వీకపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించగా...శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్, శృతి మరాఠే, షైన్ టామ్ చాకో కీలక పాత్రల్లో కనిపించారు. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కినట్లు సమాచారం. ఈ ఏడాదే దేవర పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలుకాబోతున్నట్లు తెలిసింది. దేవర మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.
దేవర కథ ఇదే...
ఎర్ర సముద్రంం ప్రాంతానికి చెందిన దేవర (ఎన్టీఆర్) తన స్నేహితుడు రాయప్ప(శ్రీకాంత్), మరో ఊరి పెద్ద భైరతో (సైఫ్ అలీఖాన్) కలిసి నౌకల్లో మురుగ దిగుమతి చేసుకుంటున్న అక్రమ ఆయుధాల్ని అధికారుల కంటపడకుండా ఒడ్డుకు చేరుస్తుంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా మురుగ కోసం పనిచేయకూడదని దేవర నిర్ణయించుకుంటాడు. తనతో పాటు ఎర్రసముద్రం ప్రాంతం ప్రజలు కూడా మురుగ కోసం పనిచేయకుండా చేస్తాడు దేవర.
దేవరకు స్నేహితుడిగా ఉన్నట్లు నటిస్తూ అతడికి చంపడానికి భైర ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో దేవర కనిపించకుండాపోతాడు. దేవర ఏమయ్యాడు? అతడి కొడుకు వర కథమేటి? దేవరకు భైర ఎలాంటి ఆపద తలపెట్టాడు అన్నదే ఈ మూవీ కథ.