Anamika Telugu Serial: 60 ఎపిసోడ్స్‌తోనే అనామిక సీరియల్‌కు ప్యాకప్ - మరో మూడు సీరియల్స్‌కు జెమిని టీవీ శుభం కార్డ్!
జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతోన్న అనామిక సీరియల్ శనివారం నాటితో ముగిసింది. కేవలం అరవై ఎపిసోడ్స్‌తోనే ఈ హారర్ సీరియల్‌కు మేకర్స్ శుభంకార్డు వేశారు. ఈ ఏడాది జూలైలో ప్రారంభమైన అనామిక సెప్టెంబర్‌లో ముగిసింది. అనామికతో పాటు మరో మూడు సీరియల్స్‌కు జెమిని టీవీ ఎండ్ కార్డ్ వేయబోతున్నది.
Anamika Telugu Serial: టీవీ సీరియల్ అంటే మినిమం ఐదు వందల ఎపిసోడ్స్ టెలికాస్ట్ కావడం కామన్ అనే మాట వినిపిస్తుంది. సీరియల్స్‌కు స్టార్టింగ్ కానీ ఎండింగ్ ఉండదని ఫన్నీగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. ఏళ్లకుఏళ్లు సీరియల్స్ టెలికాస్ట్ అవుతూనే ఉంటాయి.
మూడు నెలల్లోనే ఎండ్ కార్డ్...
అనామిక సీరియల్ మాత్రం ప్రారంభమైన మూడు నెలల్లోనే ముగిసింది. జెమినిటీవీలో టెలికాస్ట్ అవుతోన్న ఈ సీరియల్‌కు శనివారం నాటితో మేకర్స్ ప్యాకప్ చెప్పారు. కేవలం 60 ఎపిసోడ్స్‌తోనే ఈ సీరియల్‌కు శుభంకార్డు వేయడం ఆసక్తికరంగా మారింది. జూలై నెలలో ఈ సీరియల్ జెమినిటీవీలో మొదలైంది.
సెప్టెంబర్‌లో ముగించారు. టీఆర్‌పీ రేటింగ్‌లో సీరియల్ వెనకబడటంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అనామిక సీరియల్‌లో ఆకాష్ ప్రేమ్‌కుమార్, అక్షతా దేశ్‌పాండే, దర్శక్ కీలక పాత్రల్లో నటించారు. హారర్, ఫాంటసీ అంశాలకు ప్రేమకథను జోడించి ఈ సీరియల్ తెరకెక్కింది.
మరో మూడు సీరియల్స్ కూడా...
ఒకప్పుడు జెమిని సీరియల్స్‌కు చాలా పాపులారిటీ ఉండేది. రానురాను సీరియల్స్ క్రేజ్ పడిపోతుండటంతో తిరిగి పూర్వ వైభవం దిశగా జెమిని టీవీ ప్రయత్నాలు చేస్తోంది. అనామికతో పాటు టీఆర్‌పీ రేటింగ్స్‌లో వెనుకబడిపోయిన మరో మూడు సీరియల్స్‌ను కూడా ముగించబోతున్నట్లు ప్రకటించింది.
ఆ ఒక్కటీ అడక్కు, శ్రావణ సంధ్య, ఒంటరిగులాబీ సీరియల్స్‌కు త్వరలోనే ఎండ్‌కార్డ్ పడనుంది. ఇప్పటికే ఈ సీరియల్స్‌కు సంబంధించి క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. ఈ మూడు సీరియల్స్‌తో పాటు ఇటీవలే అర్ధాంగి సీరియల్‌కు అర్థాంతరంగా ముగించేశారు.
కొత్త సీరియల్స్...
పాత సీరియల్స్‌తో స్థానంలో వరుసగా కొత్త సీరియల్స్‌ను అనౌన్స్ చేసింది జెమిని టీవీ. ఇటీవలే నువ్వే కావాలి సీరియల్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్ 23నుంచి ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది. నువ్వే కావాలి సీరియల్‌లో బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ కీలక పాత్రలో నటిస్తోంది. సెప్టెంబర్ 30 నుంచి మరో రెండు కొత్త సీరియల్స్ జెమిని టీవీలో మొదలుకాబోతున్నాయి.
మూడుముళ్లు...రాధ సీరియల్స్...
మూడుముళ్లు, రాధ సీరియల్స్ ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నాయి. రాధ సీరియల్ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టెలికాస్ట్ కానుండగా... మూడుముళ్లుసీరియల్ తొమ్మిదిగంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ప్రసారం కాబోతోంది. ఈ రెండు సీరియల్స్ ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సీరియల్స్‌తో మళ్లీ కమ్‌బ్యాక్ అవ్వాలని జెమిని భావిస్తోంది. వీటితో పాటు మరో రెండు కొత్త సీరియల్స్‌ను జెమిని టీవీ త్వరలోనే లాంఛ్ చేయనున్నట్లు సమాచారం.