Laggam Release Date: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో లగ్గం మూవీ - రిలీజ్ డేట్ రివీల్ చేసిన సుధీర్ బాబు
Laggam Release Date: తెలంగాణ నేపథ్యంలో రూపొందిన లగ్గం మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. అక్టోబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాయిరోనక్, ప్రగ్యానగ్రా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Laggam Release Date: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోన్నాయి. బలగం, దసరా, ఫిదా, అర్జున్‌రెడ్డితో పాటు పలు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించాయి. తాజాగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మరో మూవీ లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ లాంఛింగ్ పోస్టర్‌ను హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశాడు. క్టోబర్ 25న లగ్గం థియేటర్లలో విడుదలకానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
రాజేంద్రప్రసాద్...రోహిణి...
లగ్గం మూవీలో సాయిరోనక్, ప్రగ్యా నగ్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, రోహిణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నాడు. వేణుగోపాల్ రెడ్డి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నారు.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో...
తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ యాసభాషలతో లగ్గం మూవీ తెరకెక్కుతోంది. చైతన్య, మానస అనే జంట పెళ్లి వేడుక చుట్టూ లగ్గం మూవీ కథ సాగనున్నట్లు సమాచారం. చిన్ననాటి నుంచే ప్రేమలో ఉన్న ఆ జంటను విడదీయాలని ఊరివాళ్లు ఎందుకు అనుకున్నారు? వారి పెళ్లి జరగకుండా ఎలాంటి అడ్డంకులు సృష్టించారు? చైతన్య, మానసల పెళ్లి అందరూ గుర్తుంచుకునేలా ఎలా జరిగింది అన్నదే ఈ మూవీ కథ.
ఏషియన్ సురేష్ ద్వారా...
ఇటీవల విడుదలైన టీజర్ కు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండుగా విడుదల కాబోతున్నట్లు తెలిపారు. కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా లగ్గంప్రతి ఆడపిల్ల తండ్రి కూతురికి పెళ్లి చేసేముందు ఈ సినిమా చూడాలని రాజేంద్రప్రసాద్ చెప్పారు.
మణిశర్మ మ్యూజిక్…
లగ్గం మూవీకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తోన్నారు. మణిశర్మ నేపథ్య సంగీతాన్ని సమకూర్చుతుండగా, చరణ్ అర్జున్ పాటలను కంపోజ్ చేశారు. మణిశర్మ బీజీఎమ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతోన్నారు. ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చరవి, కనకవ్వ,చమ్మక్ చంద్ర ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పదిహేను సినిమాలు...
లగ్గం కంటే ముందు సాయిరోనక్ తెలుగులో పదిహేనుకుపైగా సినిమాలు చేశాడు. ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లోనే కనిపించాడు. పాఠశాల మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాదలి, లంక, ప్రెషర్ కుక్కర్, పాప్ కార్న్, ఓదెల రైల్వేస్టేషన్ సినిమాల్లో హీరోగా కనిపించాడు. ఇవన్నీ అతడికి మంచి పేరు తెచ్చిపెట్టిన సక్సెస్ మాత్రం అందివ్వలేకపోయాయి.
టాపిక్