Malayalam OTT: వ‌య‌సులో ప‌దేళ్లు చిన్న‌వాడితో మీరా జాస్మిన్ పెళ్లి - రెండు ఓటీటీల్లోకి మ‌ల‌యాళం కామెడీ డ్రామా మూవీ-meera jasmine malayalam comedy drama movie palum pazhavum ott release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Ott: వ‌య‌సులో ప‌దేళ్లు చిన్న‌వాడితో మీరా జాస్మిన్ పెళ్లి - రెండు ఓటీటీల్లోకి మ‌ల‌యాళం కామెడీ డ్రామా మూవీ

Malayalam OTT: వ‌య‌సులో ప‌దేళ్లు చిన్న‌వాడితో మీరా జాస్మిన్ పెళ్లి - రెండు ఓటీటీల్లోకి మ‌ల‌యాళం కామెడీ డ్రామా మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Sep 29, 2024 06:12 AM IST

Malayalam OTT: మీరా జాస్మిన్ మ‌ల‌యాళం కామెడీ డ్రామా మూవీ పాలుమ్ పాల‌వుమ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. రెండు ఓటీటీల‌లో ఈ మూవీ రిలీజ్‌కానుంది. అక్టోబ‌ర్ సెకండ్ వీక్‌లో అమెజాన్ ప్రైమ్‌తో పాటు మ‌నోర‌మా మాక్స్ ఓటీటీల‌లో పాలుమ్ పాళ‌వుమ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

మలయాళం ఓటీటీ
మలయాళం ఓటీటీ

Malayalam OTT: మీరా జాస్మిన్...తెలుగులో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ వంటి అగ్ర హీరోల‌తో సినిమాలు చేసింది. భ‌ద్ర‌, గుడుంబాశంక‌ర్‌, అమ్మాయి బాగుంది లాంటి సినిమాల‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు చాలా ఏళ్ల పాటు దూరంగా ఉన్న మీరాజాస్మిన్ ఇటీవ‌లే సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టింది. మ‌ల‌యాళంతో పాటు మ‌ళ్లీ తెలుగులోనూ సినిమాలు చేస్తోంది.

మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ...

ఇటీవ‌లే మ‌ల‌యాళంలో పాలుమ్ పాళ‌వుమ్ పేరుతో మెసేజ్ ఓరియెంటెడ్ కామెడీ డ్రామా మూవీ చేసింది మీరా జాస్మిన్. ఆగ‌స్ట్ నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈమూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది. ఈ మూవీలో మీరా జాస్మిన్ యాక్టింగ్‌కు మంచి పేరొచ్చింది.

రెండు ఓటీటీల‌లో...

థియేట‌ర్ల‌లో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచిన పాళుమ్ పాళ‌వుమ్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. కామెడీ డ్రామా మూవీ రెండు ఓటీటీల‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. పాళుమ్ పాళ‌వుమ్ డిజిట‌ల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మ‌నోర‌మా మాక్స్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. అక్టోబ‌ర్ 11న రెండు ఓటీటీల‌లో మీరా జాస్మిన్ మూవీ రిలీజ్‌కానున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌...

పాలుమ్ పాళ‌వుమ్ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ వీకే ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌న కంటే వ‌య‌సులో ప‌దేళ్లు చిన్న‌వాడైన ఓ యువ‌కుడిని పెళ్లిచేసుకునే మ‌హిళ క‌థ‌తో ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు. వ‌యోభేదాల ప‌రంగా పెళ్లి విష‌యంలో సొసైటీలో ఉన్న మూఢ‌న‌మ్మ‌కాలు, అపోహ‌ల‌ను ఫ‌న్నీగా ఈ సినిమాలో చూపించారు. కామెడీని. మెసేజ్‌ను రెండింటిని చ‌క్క‌గా ఈ సినిమాలో బ్యాలెన్స్ చేశారు.

23 ఏళ్ల పెళ్లికొడుకు...33 ఏళ్ల పెళ్లికూతురు..

సుమికి (మీరా జాస్మిన్‌) కుటుంబ బాధ్య‌త‌ల కార‌ణంగా 33 ఏళ్లు వ‌చ్చినా పెళ్లికాదు. జీవితం ప‌ట్ల ఉన్న క‌ల‌లు, ఆశ‌యాలు అన్నింటిని కుటుంబం కోసం ప‌క్క‌న‌పెడుతుంది. సునీల్ (అశ్విన్ జోస్‌) ఇంజినీరింగ్ చ‌దువును మ‌ధ్య‌లోనే ప‌క్క‌న‌పెడ‌తాడు. హార్ట్‌వ‌ర్క్‌తో రాకుండా షార్ట్‌క‌ట్‌లో జీవితంలో పైకి రావాల‌న్న‌ది సునీల్ క‌ల‌. అందుకోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తాడు. అవేవీ స‌క్సెస్ కావు.

సునీల్‌, సుమికి సోష‌ల్ మీడియాలో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఒక‌రి ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు మ‌రొక‌రికి న‌చ్చ‌డంతో పెళ్లికి సిద్ధ‌ప‌డ‌తారు. కానీ సుమి కంటే సునీల్ ప‌దేళ్లు చిన్న‌వాడు కావ‌డంతో వారి పెళ్లికి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు సొసైటీ అంగీక‌రించ‌దు. ఆ అడ్డంకుల‌ను దాటి సుమి, సునీల్ ఎలా ఒక్క‌ట‌య్యారు? పెళ్లి త‌ర్వాత వారి లైఫ్ ఎలా సాగింది అన్న‌దే పాలుమ్ పాళ‌వుమ్ మూవీ క‌థ‌.

గీత‌గోవిందం మ్యూజిక్ డైరెక్ట‌ర్‌...

పాలుమ్ పాళ‌వుమ్ మూవీలో అశ్విన్ జోష్ హీరోగా న‌టించాడు. శాంతికృష్ణ‌, అశోక‌న్ కీల‌క పాత్ర‌లు చేశారు.ఈ సినిమాకు గీత గోవిందం ఫేమ్ గోపీసుంద‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు. మార్చిలో పాలుమ్ పాళ‌వుమ్ సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్టి ఆగ‌స్ట్‌లో రిలీజ్ చేశారు.

స్వాగ్ మూవీలో...

ప్ర‌స్తుతం తెలుగులో స్వాగ్ మూవీలో మీరా జాస్మిన్ ఓ కీల‌క పాత్ర చేస్తోంది. శ్రీవిష్ణు హీరోగా న‌టిస్తోన్న ఈ కామెడీ మూవీ అక్టోబ‌ర్ 4న రిలీజ్ కాబోతోంది. స్వాగ్ మూవీలో రీతూవ‌ర్మ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది.

టాపిక్