Thangalaan Twitter Review: తంగలాన్ ట్విట్టర్ రివ్యూ - విక్రమ్‌కు నేషనల్ అవార్డ్ గ్యారెంటీ - పా రంజిత్ దెబ్బేశాడు
Thangalaan Twitter Review: విక్రమ్, డైరెక్టర్ పా రంజిత్ కలయికలో వచ్చిన తంగలాన్ టీజర్స్, ట్రైలర్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో పార్వతి, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. గురువారం తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ మూవీ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
Thangalaan Twitter Review: విక్రమ్ హిట్ అందుకొని చాలా కాలమైంది. అపరిచితుడు లాంటి బ్లాక్‌బస్టర్‌తో మళ్లీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాలని పట్టువదలని విక్రమార్కుడిలా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తంగలాన్‌తో ఈ శుక్రవారం తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చాడు విక్రమ్.
పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పోస్టర్స్, ట్రైలర్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రెకెత్తించింది. పార్వతి, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
నేషనల్ అవార్డు పక్కా...
తంగలాన్‌లో విక్రమ్ యాక్టింగ్, అతడు లుక్, మ్యానరిజమ్స్‌పై ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తోన్నారు. తంగలాన్ పాత్రలో జీవించేశాడని, అతడికి నేషనల్ అవార్డు రావడం గ్యారెంటీ అని అంటున్నారు. పా రంజిత్ పేలవలమైన కథ, కథనాల కారణంగా విక్రమ్ కష్టం మొత్తం వృథాగా మారిందని ఓ నెటిజన్ చెప్పాడు.
ఓపికకు పరీక్ష...
తంగలాన్ తో పా రంజిత్... విక్రమ్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్‌ను పూర్తిగా డిసపాయింట్ చేశాడని చెబుతోన్నారు. తంగలాన్ కథలో ఎమోషనల్ కనెక్టివిటీ అన్నది కనిపించదని ట్వీట్స్ చేస్తున్నారు. కథ ఎంతకు ముందుకు కధలక నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తుందని చెబుతోన్నారు.
లెంగ్తీ డైలాగ్స్ ఆడియెన్స్ ఓపికకు పరీక్షగా పెడతాయని కామెంట్స్ చేస్తున్నారు. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో దర్శకుడు పా రంజిత్ రాసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా...తెరపై ప్రజెంట్ చేయడంలో మాత్రం తడబడిపోయాడని ఓ నెటిజన్ అన్నాడు.
బ్రిటీషర్ల కాలం నాటి కథతో పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ సాగుతుందని అంటున్నారు. తమ జాతి స్వేచ్చ స్వాతంత్య్రాల ఓ గిరిజన తెగ నాయకుడు ఎలాంటి పోరాటం సాగించాడనే పాయింట్‌తో పా రంజిత్ ఈ మూవీని తెరకెక్కించినట్లు నెటిజన్లు చెబుతోన్నారు.
పోటాపోటీ యాక్టింగ్...
విక్రమ్‌తో పోటీపడి పార్వతి యాక్టింగ్‌ను కనబరిచిందని ఓ నెటిజన్ చెప్పాడు. మాళవికా మోహనన్ రోల్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని ఓ నెటిజన్ అన్నాడు. , మేకింగ్ హాలీవుడ్ స్టాండర్స్‌లో ఉన్నాయని పేర్కొంటున్నారు. తంగలాన్ పాత్ర కోసం విక్రమ్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుందని అంటున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని కామెంట్స్ చేస్తోన్నారు. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు.
వంద కోట్ల బడ్జెట్…
తంగలాన్ మూవీని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశాడు. విక్రమ్ మూవీని సపోర్ట్ చేస్తూ సూర్య, ధనుష్‌తో పాలు పలువురు స్టార్ హీరోలు ట్వీట్లు చేస్తోన్నారు.