Bigg Boss Manikanta: హౌస్‍మేట్స్ అసంతృప్తి.. మణికంఠకు ఆ శిక్ష వేసిన బిగ్‍బాస్!-naga manikanta to get first jail punishment in bigg boss 8 telugu after majority housemates calls him zero ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Manikanta: హౌస్‍మేట్స్ అసంతృప్తి.. మణికంఠకు ఆ శిక్ష వేసిన బిగ్‍బాస్!

Bigg Boss Manikanta: హౌస్‍మేట్స్ అసంతృప్తి.. మణికంఠకు ఆ శిక్ష వేసిన బిగ్‍బాస్!

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 29, 2024 04:26 PM IST

Bigg Boss Telugu 8 Manikanta: బిగ్‍బాస్ హౌస్‍లో మణికంఠను ఇతర హౌస్‍మేట్స్ టార్గెట్ చేశారు. అతడిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మణికి బిగ్‍బాస్ ఓ శిక్ష వేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Bigg Boss Manikanta: హౌస్‍మేట్స్ అసంతృప్తి.. మణికంఠకు ఆ శిక్ష వేసిన బిగ్‍బాస్!
Bigg Boss Manikanta: హౌస్‍మేట్స్ అసంతృప్తి.. మణికంఠకు ఆ శిక్ష వేసిన బిగ్‍బాస్!

బిగ్‍బాస్ తెలుగు 8 సీజన్‍లో నాగ మణికంఠ మొదటి నుంచి హైలైట్ అవుతున్నారు. ఆరంభం నుంచే ఎమోషనల్ అవుతూ.. చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, సింపతీ కోసమే మణికంఠ అలా చేస్తున్నారని కొందరు కంటెస్టెంట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. టాస్కుల్లోనూ మణికంఠ పెద్దగా పర్ఫార్మ్ చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగో వారం సాగుతున్న ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ టాస్కుల్లోనూ మణికంఠ పక్కనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో నాలుగో వారం వీకెండ్‍లో మణికంఠకు శిక్ష పడినట్టు తెలుస్తోంది.

జోరో ముద్ర పడటంతో..

హౌస్‍లో జీరో ఎవరో.. హీరో ఎవరో చెప్పాలనే గేమ్‍ను శనివారం ఎపిసోడ్‍లో కంటెస్టెంట్లకు నాగార్జున ఇచ్చారు. హౌస్‍మేట్లలో ఎక్కువ మంది మణికంఠనే జీరో అంటూ ముఖంపై ముద్రలు వేశారు. ఈ క్రమంలో అతడిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మణికంఠ అబద్ధాలు ఆడుతున్నారని పృథ్వి చెప్పారు. వెంట ఉంటూనే బయటికి పంపుదామని మణి ఆలోచిస్తుంటారని నబీల్ అన్నారు. ఇలా ఎక్కువ మంది కంటెస్టెంట్లు మణికంఠనే టార్గెట్ చేశారు. జీరో అంటూ ముద్ర వేసేశారు. దీంతో బిగ్‍బాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జైలుకు మణికంఠ

మణికంఠపై ఎక్కువ మంది హౌస్‍మేట్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో అతడికి బిగ్‍బాస్ శిక్ష విధించేందుకు నిర్ణయించారని తెలుస్తోంది. మణికంఠను జైలుకు పంపేందుకు బిగ్‍బాస్ డిసైడ్ అయ్యారట. దీంతో ఈ సీజన్‍లో హౌస్‍లో జైలుకు వెళ్లబోతున్న తొలి కంటెస్టెంట్‍గా మణికంఠ ఉండనున్నారు. జైలు శిక్ష తతంగం నేటి ఆదివారం (సెప్టెంబర్ 29) ఎపిసోడ్‍లో ఉండనుంది.

మణికంఠకు బిగ్‍బాస్ పీనల్ కోడ్ (బీపీసీ) ప్రకారం శిక్ష పడనుందని తెలుస్తోంది. ఒక రోజు పాటు జైలులో ఉండేలా బిగ్‍బాస్ అతడికి శిక్ష విధించనున్నారు. దీంతో ఈ సీజన్‍‍లో ఫస్ట్ టైమ్ జైలు తలుపులు తెరుచుకోనున్నాయి. కఠిన కారాగార శిక్షతో మణి జైలులోకి వెళ్లనున్నారు. మరి బిగ్‍బాస్ అతడికి ఎలాంటి రూల్స్ పెడతారో చూడాలి.

ఈ నాలుగో వారం ఎలిమినేషన్లలో మణికంఠ కూడా ఉన్నారు. అయితే, డేంజర్ జోన్‍లో నిలిచినా చివరికి ఎలిమినేషన్ నుంచి అతడు సేవ్ కానున్నారని తెలుస్తోంది. ఓటింగ్‍లో అతడు మూడో స్థానంలో నిలిచారని అంచనాలు ఉన్నాయి. దీంతో మణి సేఫ్ అయ్యారు. అయితే, మున్ముందు అతడు గేమ్స్ ఎలా ఆడతారన్నది చూడాలి. ఇప్పటికైతే హౌస్‍మేట్స్ తమకు పోటీగా మణిని భావించడం లేదు. వీక్ కంటెస్టెంట్‍గా చూస్తున్నట్టు వారి కామెంట్లను బట్టి తెలుస్తోంది. సోషల్ మీడియాలో మణికంఠకు గట్టిగానే సపోర్ట్ దక్కుతోంది.

సోనియా ఎలిమినేట్!

బిగ్‍బాస్ 8వ సీజన్‍లో ఈ నాలుగో వారం సోనియా ఆకుల ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. ఈ విషయం లీకుల ద్వారా బయటికి వచ్చింది. ఆరంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‍గా సోనియా పేరు తెచ్చుకున్నారు. గొడవలు, రెచ్చగొట్టే మాటలు, కామెంట్లతో ఆమెపై నెగెటివిటీ క్రమంగా పెరిగింది. గ్రాఫ్ పడిపోయింది. ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్లలో ఉన్న ఆమెకు తక్కువ ఓట్లు పడినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వారం సోనియా హౌస్ నుంచి బయటికి వచ్చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ నేటి ఎపిసోడ్‍లో సాగనుంది.