Soniya Elimination Trolls: బిగ్‍బాస్: సోనియా ఎలిమినేషన్‍పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్
Bigg Boss 8 Telugu - Soniya Elimination Trolls: బిగ్‍బాస్ హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ కానున్నారని లీకులు వచ్చాయి. అప్పుడే సోషల్ మీడియాలో ఈ విషయంపై ట్రోల్స్ వస్తున్నాయి. సోనియాకు నెగెటివ్‍గానే ఎక్కువ పోస్టులు వస్తుండగా.. కొందరు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా సోనియా ఎలిమినేషన్ అంశం వైరల్‍గా మారింది.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ నుంచి సినీ నటి సోనియా ఆకుల ఎలిమినేట్ అవుతారంటూ లీక్‍లు వచ్చేశాయి. ఈ నాలుగో వారంలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉండగా.. సోనియా హౌస్ నుంచి ఔట్ కానున్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఎలిమినేషన్ ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 29) ఆదివారం ఎపిసోడ్‍లో ఉండనుంది. అయితే, సోనియా ఎలిమినేట్ అవటం ఖాయంగా తెలుస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి.
నెగెటివిటీ వల్ల..
సోనియాపై నెగెటివిటీ బాగా పెరిగిపోయింది. ఎక్కువ మంది ప్రేక్షకులు ఆమెపై అసంతృప్తితోనే ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులతోనే అర్థమవుతోంది. హౌస్‍లో గొడవలకు కారణం అవుతున్నారని, అనవసరంగా నోరూ పారేసుకుంటున్నారంటూ నెటిజన్లు సోనియాపై కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిఖిల్, పృథ్విరాజ్ ఆటను కూడా సోనియా చెడగొడుతున్నారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. హౌస్‍లోని ఎక్కువ మందితో సోనియా గొడవలు పడ్డారు. ముఖ్యంగా రెచ్చగొట్టి సోనియా గొడవలు పెంచారనే అభిప్రాయాలు ఉన్నాయి. నిఖిల్, పృథ్విని మచ్చిక చేసుకొని గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే విషయం కూడా బలపడింది. మొత్తంగా ఎక్కువ శాతం సోనియాపై నెగెటివిటీ పెరిగింది.
సోషల్ మీడియాలో ట్రోల్స్
సోనియాకు ఓట్లు తక్కువగా వచ్చిన కారణంగా ఈ వారం ఆమెనే ఎలిమినేట్ కానున్నారని సమాచారం బయటికి వచ్చేసింది. సోనియా ఎలిమినేషన్ గురించి అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చేస్తున్నాయి. సోనియా హౌస్ నుంచి బయటికి రావడంపై ఎక్కువ మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హౌస్‍లో ఇప్పటి నుంచి గేమ్స్ బాగా సాగుతాయని కొందరు పోస్టులు చేస్తున్నారు. నిఖిల్ గేమ్ ఇప్పటి నుంచి బాగుంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
సోనియా ఎలిమినేటెడ్ అని నాగార్జున అంటున్నట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనియా వెళ్లిపోతే హౌస్‍మేట్స్ సంతోషంతో డ్యాన్స్ చేస్తారన్నట్టుగా ఈ ఎడిటెడ్ వీడియో ఉంది. బిగ్‍బాస్‍పై రివ్యూలు చెప్పే మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి కూడా విపరీతంగా డ్యాన్స్ చేసినట్టు ఓ వీడియో వైరల్ అవుతోంది. సోనియా ఏం తప్పు చేసిందంటూ వెటకారంగా కూడా కొందరు పోస్టులు చేస్తున్నారు. మొత్తంగా సోనియా ఎలిమినేషన్‍పై ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి.
బిగ్‍బాస్ తెలుగు 8 నాలుగో వారం సోనియా ఎలిమినేట్ అవుతారా అనే విషయంపై నేడు క్లారిటీ రానుంది. ఓటింగ్ ప్రకారం చూస్తే ఆమెనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రీఎంట్రీ ఉంటుందా!
సోనియా ఇప్పుడు బిగ్‍బాస్ నుంచి ఎలిమినేట్ అయినా మళ్లీ రీఎంట్రీ ఇస్తారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని వారాల తర్వాత మళ్లీ తీసుకొచ్చేలా బిగ్‍బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని కూడా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సోనియాను సీక్రెట్ రూమ్‍కు పంపుతారనే పుకార్లు కూడా వస్తున్నాయి. మొత్తంగా సోనియా విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‍గా మారింది.
ఈ నాలుగో వారం నామినేషన్లలో సోనియా, ఆదిత్య ఓం, ప్రేరణ, పృథ్విరాజ్, నబీల్ ఆఫ్రిది, మణికంఠ ఉన్నారు. నేటి ఆదివారం ఎపిసోడ్‍లో ఫన్ గేమ్‍లతో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతుంది. మిగిలిన ఐదుగురు సేఫ్ కానుండగా.. సోనియా ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.