Devara Day 2 WW Box Office: దేవర రెండు రోజుల కలెక్షన్ల అఫీషియల్ లెక్కలు.. తొలి రోజుతో పోలిస్తే భారీగా డ్రాప్.. ఎంతంటే!-devara day 2 worldwide box office collections jr ntr action movie drops huge ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Day 2 Ww Box Office: దేవర రెండు రోజుల కలెక్షన్ల అఫీషియల్ లెక్కలు.. తొలి రోజుతో పోలిస్తే భారీగా డ్రాప్.. ఎంతంటే!

Devara Day 2 WW Box Office: దేవర రెండు రోజుల కలెక్షన్ల అఫీషియల్ లెక్కలు.. తొలి రోజుతో పోలిస్తే భారీగా డ్రాప్.. ఎంతంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 29, 2024 02:35 PM IST

Devara Day 2 worldwide Collections: దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. తొలి రోజు భారీ ఓపెనింగ్ అందుకున్న ఈ మూవీ.. రెండో రోజు మాత్రం భారీగా డ్రాప్ అయింది. రెండు రోజుల కలెక్షన్ల వివరాలు మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

Devara Day 2 WW Box office: దేవర రెండు రోజుల కలెక్షన్ల అఫీషియల్ లెక్కలు.. తొలి రోజుతో పోలిస్తే భారీగా డ్రాప్.. ఎంతంటే!
Devara Day 2 WW Box office: దేవర రెండు రోజుల కలెక్షన్ల అఫీషియల్ లెక్కలు.. తొలి రోజుతో పోలిస్తే భారీగా డ్రాప్.. ఎంతంటే!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా విపరీతమైన హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 27) ఈ చిత్రం థియేటర్లలోకి విడుదలైంది. అంచనాలు భారీగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి. అందుకు తగ్గట్టే బంపర్ ఓపెనింగ్ అందుకుంది ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీ. అయితే, రెండో రోజు ఈ సినిమాకు వసూళ్లు ఎక్కువగా డ్రాప్ అయ్యాయి. రెండు రోజుల కలెక్షన్ల లెక్కలను మూవీ టీమ్ ప్రకటించింది.

రెండు రోజుల కలెక్షన్లు ఇలా

దేవర సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.243 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. నేడు (సెప్టెంబర్ 29) ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. కొత్త పోస్టర్ రివీల్ చేసి ఈ లెక్కలను ప్రకటించింది.

భారీగా డ్రాప్

ఈ లెక్కల ప్రకారం రెండో రోజు దేవర కలెక్షన్లు భారీగా డ్రాప్ అయినట్టే. ఈ మూవీకి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మూవీ టీమ్ వెల్లడించింది. రెండు రోజుల్లో రూ.243 కోట్లు వచ్చాయని పేర్కొంది. ఈ లెక్కలను బట్టి చూస్తే రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా దేవరకు రూ.71 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు. అంటే ఏకంగా తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రూ.101 కోట్లు తక్కువగా వచ్చాయి. భారీ చిత్రాలకు తొలి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు తగ్గడం సహజం. కానీ అధికారిక లెక్కల ప్రకారం దేవర విషయంలో ఈ తేడా ఎక్కువగా కనిపిస్తోంది.

జోరు పెరిగే ఛాన్స్!

దేవర సినిమాకు మూడో రోజైన ఆదివారం కలెక్షన్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఆదివారం బుకింగ్స్ ట్రెండ్ బాగానే కనిపిస్తోంది. తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ మూవీ పర్వాలేదనిపిస్తోంది. ముఖ్యంగా హిందీలో ఈ మూవీకి కలెక్షన్లు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దేవర చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. చాలా నచ్చిందని కొందరు అంటుంటే.. మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూవీపై మిశ్రమ స్పందన వస్తున్నా.. ఎన్టీఆర్ యాక్షన్, యాక్టింగ్‍పై అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

దేవర మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్‍తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. తన కెరీర్లో ఇప్పటి వరకు బెస్ట్ చిత్రం ఇదేనని అందరూ అంటున్నారని సక్సెస్ మీట్‍లో కొరటాల అన్నారు. ఈ మూవీ కోసం తాము మూడేళ్లు కష్టపడ్డామని, సినిమా ఇంత సక్సెస్ అవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. అయితే, సెకండాఫ్‍లో మూడు సీన్లు, ఓ పాటకే పరిమితమైన జాన్వీకి పెద్దగా స్క్రీన్‍ టైమ్ దక్కలేదు. ఈ మూవీతోనే తెలుగులోకి ఆమె అడుగుపెట్టారు. సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, కలైయారాసన్, శృతి మరాఠే, జరీనా వాహబ్ ఈ మూవీలో కీలకపాత్రలు పోషింటారు. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశాయి.