OTT Survival Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న సర్వైవల్ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-yogi babu tamil survival drama movie boat to stream on amazon prime video this date check release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Survival Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న సర్వైవల్ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Survival Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న సర్వైవల్ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 29, 2024 06:00 PM IST

OTT Survival Drama Movie: బోట్ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ తమిళ సర్వైవల్ డ్రామా మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో యోగిబాబు లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం ఎప్పుడు.. ఏ ఓటీటీలో అడుగుపెట్టనుందంటే..

OTT Survival Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న సర్వైవల్ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Survival Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న సర్వైవల్ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో బోట్ చిత్రం వచ్చింది. సర్వైవల్ డ్రామా మూవీగా ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. 1943 బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీకి చెంబు దేవర దర్శకత్వం వహించారు. బోట్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

బోట్ చిత్రం అక్టోబర్ 1వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఈ మూవీ తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. తమిళంలో ఒక్కటే వస్తుందా.. తెలుగు వెర్షన్ కూడా రానుందా అనేది చూడాలి.

థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలలకు బోట్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆగస్టు 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు అక్టోబర్ 1న ఓటీటీలోకి అడుగుపెడుతోంది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ.. ఓటీటీ రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందోననే ఆసక్తి ఉంది.

బోట్ చిత్రం బ్రిటీష్ పాలన కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో సాగుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ చింబు దేవన్ తెరకెక్కించారు. ముంబై నగరంపై బాంబులు పడుతుండటంతో తప్పించుకునేందుకు ఓ పది మంది కలిసి చేసే పడవ ప్రయాణం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.

బోట్ మూవీలో యోగిబాబుతో పాటు గౌరీ కిషన్, చామ్స్, ఎంఎస్ భాస్కర్, చిన్ని జయంత్, జెస్సీ ఫాక్స్ అలెన్, జంగిరి మధుమిత, షారా కులప్పుల్లి లీల, ఆక్షత్ దాస్, పాండీ రవి కీలకపాత్రలు పోషించారు. యోగిబాబు మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు.

ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. మాల్వీ అండ్ మాన్వీ మూవీ మేకర్స్, చెంబన్‍దేవ్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లపై ప్రభ ప్రేమ్‍కుమార్, కళావాణి, చింబు దేవన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మాదేశ్ మాణిక్యం సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించగా.. దినేశ్ పొన్‍రాజ్ ఎడిటింగ్ చేశారు.

బోట్ స్టోరీలైన్

భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలన కాలం 1943లో బోట్ మూవీ స్టోరీ సాగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగా.. ముంబై నగరంపై బాంబులు పడతాయి. దీంతో ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు సముద్రం ద్వారా వేరే ప్రాంతానికి వెళ్లేందుకు బోట్‍లో పది మంది ప్రయాణిస్తారు. మత్య్సకారుడు కుమరన్ (యోగిబాబు) కూడా ఉంటారు. ఆ బోట్‍లో ఉన్న వారు ఒకరితో పోలిస్తే మరొకరి పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. ఓ తండ్రీ కూతురు, ఓ గర్భిణి, అతడి కుమారుడు, బ్రిటీషర్లు తీవ్రవాదిగా గుర్తించిన ఓ వ్యక్తి.. ఇలా పది మంది డిఫరెంట్‍గా ఉంటారు.

సముద్రంలో బోటు ప్రయాణంలో వారు సవాళ్లను ఎదుర్కొంటారు. బోట్ మునిగే ప్రమాదం, సొరచేపల దాడి ఇలా చాలా సమస్యలు వస్తాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు కష్టాలు పడతారు. మొత్తంగా వారు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారా అనేది బోట్ చిత్రం ప్రధాన అంశంగా ఉంటుంది.