Comedy Movie: తెలుగులో రిలీజైన యోగిబాబు తమిళ్ సూపర్ హిట్ కామెడీ మూవీ - ఫ్రీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Comedy Movie: కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు తెలుగు మూవీ గుడ్‌లక్ గణేషా యూట్యూబ్‌లో శనివారం రిలీజైంది. ఈ ఫాంటసీ కామెడీ మూవీలో యోగిబాబుతో పాటు రమేష్ తిలక్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించాలు. తమిళంలో యానై ముగతాన్ పేరుతో గత ఏడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
Comedy Movie: కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు హీరోగా నటించిన తెలుగు మూవీ గుడ్ లక్ గణేషా యూట్యూబ్‌లో శనివారం రిలీజైంది. యానై ముగతాన్ పేరుతో గత ఏడాది తమిళంలో థియేటర్లలో రిలీజైన ఈ ఫాంటసీ కామెడీ మూవీ హిట్టు టాక్ తెచ్చుకున్నది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
మలయాళం రీమేక్...
గుడ్‌లక్ గణేషా మూవీలో యోగిబాబుతో పాటు రమేష్ తిలక్, ఊర్వశి, కరుణాకరన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రాజేష్ మిథిలా దర్శకత్వం వహించాడు. మలయాళం మూవీ ఇన్ను మిథల్‌కు రీమేక్‌గా యానై ముగతాన్ సినిమా రూపొందింది. మలయాళ వెర్షన్‌కు రాజేష్ మిథిలా దర్శకత్వం వహించాడు.
వినాయకుడి భక్తుడి కథ...
ఈ మూవీలో వినాయకుడిగా యోగిబాబు నటించాడు. గణేష్ (రమేష్ తిలక్) ఓ ఆటో డ్రైవర్. ఇంటి ఓనర్ మల్లిక (ఊర్వశి) ఇచ్చిన ఆటోను నడుపుకుంటూ బతుకుతుంటాడు. తెలిసినవాళ్లందరి దగ్గర అప్పులు చేస్తాడు. అబద్దాలు, చెబుతూ అందరిని మోసం చేస్తుంటాడు. అప్పుల వాళ్లు తనను వేధించకుండా ఉండాలని ప్రతిరోజు వినాయకుడిని ప్రార్ధిస్తుంటాడు.
ఓ రోజు గణేష్ పూజించే వినాయకుడు మాయమవుతాడు. గుడిలో, ఫొటోల్లో గణేష్‌కు వినాయకుడు కనిపించడు. మరోవైపు అప్పుల వాళ్ల బాధ ఎక్కవుతుంది. సాధారణ మనిషి రూపంలో గణేష్ ముందుకు వచ్చిన వినాయకుడు (యోగిబాబు)..అబద్దాలు చెప్పకుండా ఒక్కరోజు నీతిగా, నిజాయితీతో బతికితే నేను నీకు మళ్లీ కనిపిస్తానని కండీషన్ పెడతాడు.
దేవుడు పెట్టిన కండీషన్‌కు గణేష్ ఒప్పుకున్నాడా? అన్ని నిజాలే చెప్పిన గణేష్‌కు ఆ ఒక్కరోజులో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? గణేష్‌లో ఎలా మార్పు వచ్చింది అన్నదే గుడ్ లక్ గణేషా మూవీ కథ. గుడ్‌లక్ గణేషా మూవీకి సీక్వెల్ చేయబోతున్నట్లు దర్శకుడు ప్రకటించాడు.
ప్రభాస్ రాజాసాబ్‌తో...
ప్రస్తుతం తమిళంలో టాప్ కమెడియన్‌గా కొనసాగుతోన్నాడు యోగిబాబు. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే తమిళంలో 20కిపైగా సినిమాలు చేశాడు. ప్రభాస్ ది రాజాసాబ్ మూవీతో యోగిబాబు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది.