Brahmamudi Promo: గుడిలో భర్తతో కావ్య గొడవ - రాహుల్ లెక్కలు తేల్చనున్న రాజ్ - బయటపడ్డ అనామిక బండారం
Brahmamudi Promo: బ్రహ్మముడి ప్రోమోలో కావ్య, రాజ్ గుడిలో ఒకరికొకరు ఎదురుపడతారు. తనను ఫాలో అవుతూ కావ్య గుడికి వచ్చిందని అపార్థం చేసుకున్న రాజ్ ఆమెతో గొడవపతాడు. రాజ్‌కు మాటకు మాట సమాధానమిస్తుంది కావ్య. రాజ్‌ను రావణాసురుడితో పోలుస్తుంది.
Brahmamudi Promo: రాజ్ గుడికివస్తాడు. గంట కొట్టడానికి చెయ్యేత్తుతాడు. అప్పటికే గుడిలో ఉన్న కావ్య కూడా గంటకొట్టాలని అనుకుంటుంది. ఒకరి చేతి మరొకరికి తగులుతుంది. రాజ్‌ను చూసి కావ్య షాకవుతుంది.
ఇద్దరు గుడిలోనే గొడవపడటం మొదలుపెడతారు. ఎక్కడికి వెళితే అక్కడికి నన్నే ఫాలో అవుతున్నావా అని కావ్యను నిలదీస్తాడు రాజ్. ఎవరైనా రావణాసురుడిని, మహిషాసురుడిని ఫాలో అవుతారా అంటూ రాజ్‌పై సెటైర్లు వేస్తుంది కావ్య. ప్రశాంతంగా గుడికి వస్తే నువ్వు కనిపించావేంటి అని కావ్యపై రాజ్ సీరియస్ అవుతాడు.
గుడిలో కావ్యతో రాజ్ గొడవ…
తమకు గుడికి రావడం ఏంటి?...చేసిన పాపాలు చెప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చారా అంటూ రాజ్‌ను ఆటపట్టిస్తుంది కావ్య. కొన్ని మొహాలు జీవితంలో కనబడకూడదని మొక్కుకోవడానికి వచ్చానని కావ్యకు కోపంగా రాజ్ బదులిస్తాడు. నీతో నాకు మాటలు ఏంటి దూరంగా జరుగు..దుష్టులకు దూరంగా ఉండటం మంచిదని కావ్యను కసురుకుంటాడు.
తాను జరగనని రాజ్‌కు మాటకు మాట బదులిస్తుంది కావ్య. దుష్టులకు దూరంగా ఉండటం మంచిదని అంటాడు. మరోసారి గుడిలో గంట విషయంలో రాజ్, కావ్య గొడవపడతారు. ముందు నేనే వచ్చాను కాబట్టి నేను గంట కొడతానని రాజ్, కావ్య వాదించుకుంటారు. వారి గొడవ చూసి మీరిద్దరు భార్యాభర్తలా అని పూజారి అడుగుతాడు.
అనామిక ప్లాన్...
కావ్యను అడ్డుపెట్టుకొని దుగ్గిరాల ఫ్యామిలీని దెబ్బకొట్టేందుకు అనామిక ప్లాన్ చేస్తుంది. ఎక్స్‌పో అవార్డు వస్తేనే తమ కంపెనీ కష్టాల నుంచి బయటపడుతుందని రాజ్ భావిస్తాడు. కావ్య చేత డిజైన్స్ వేయించి వాటిని ఎక్స్‌పో అవార్డులకు పంపించి ఎక్స్‌పో అవార్డును తామే సొంతం చేసుకోవాలని అనామిక, సామంత్ అనుకుంటారు. తమ కంపెనీకి కావ్య డిజైన్స్ వేస్తుందనే విషయం ఆమెకు తెలియకుండా అనామిక జాగ్రత్తపడుతుంది.
అప్పును పోలీస్ ట్రైనింగ్‌లో జాయిన్ చేయాలని అనుకుంటాడు కళ్యాణ్. కానీ అందుకుచాలా డబ్బు అవసరం కావడంతో ఎలా అడ్జెస్ట్ చేయాలా అని ఇద్దరు ఆలోచిస్తుంటారు. డబ్బు కోసం నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేదని, నీ కోసం నా పోలీస్ కలను కూడా పక్కనపెడతానని అప్పు అంటుంది.
రుద్రాణి ఫైర్...
మన కంపెనీకి ఈ ఏడాది పన్నెండు కోట్ల నష్టం వచ్చిందని తల్లిదండ్రులతో రాజ్ చెబుతాడు. తన కొడుకు రాహుల్‌ను దోషిగా చూపించడానికే రాజ్ నష్టాల లెక్కలు చెబుతున్నాడని రుద్రాణి ఫైర్ అవుతుంది. ఇప్పటివరకు కంపెనీకి లాస్ ఎలా వచ్చిందన్నది ఆలోచించలేదని, నీ మాటలతో ఎవరు ఎంత డబ్బు మింగారో తవ్వడం మొదలుపెడతానని రాజ్ కోపంగా అంటాడు. నోటిదూళతో తనను ఇరికించిన తల్లి రుద్రాణిపై రాహుల్ ఫైర్ అవుతాడు.
కావ్యను తీసుకొచ్చేది లేదు...
ఎక్స్‌ఫోలో మన కంపెనీకి అవార్డు రావాలంటే కావ్యను ఇంటికి తీసుకురావడం ఒక్కటే మార్గమని, కావ్య డిజైన్స్ వేస్తే తప్పకుండా మన కంపెనీకి అవార్డు వస్తుందని రాజ్‌తో సుభాష్, అపర్ణ అంటారు. కావ్య డిజైన్స్ వేస్తుందంటే ఆ అవార్డ్ తనకు అవసరం లేదని, కావ్య సహాయం లేకుండా కంపెనీ టర్నోవర్ పెంచుతానని రాజ్ ఛాలెంజ్ చేస్తాడు.
రాజ్‌ను మర్చిపోలేకపోయినా కావ్య...
మరోవైపు రాజ్ ఆలోచనలతో పదే పదే గుర్తురావడంతో సరిగ్గా డిజైన్స్ గీయలేకపోతుంది కావ్య. మరోవైపు రాజ్ కూడా కావ్యను మర్చిపోలేకపోతాడు. కళాకృతి ఇండస్ట్రీస్ అనే కంపెనీకి మెయిల్ చేసేందుకు ఫైల్ తయారు చేస్తుంటాడు రాజ్. కళాకృతి బదులు కళావతి అని పేపర్‌పై రాస్తాడు. అది చూసి నువ్వు కావ్యను మర్చిపోలేకపోతున్నావని, నీ ప్రేమను మనసులోనే దాచుకోవడంలో అర్థం లేదని రాజ్‌కు క్లాస్ ఇస్తుంది ఇందిరాదేవి.
కావ్యకు దొరికిపోయినా అనామిక...
ఇంట్లో పూజ చేస్తుంటుంది అపర్ణ. అనారోగ్యం కారణంగా చాలా నీరసంగా కనిపిస్తుంది. కిందపడబోతుంటే రాజ్ వచ్చి ఆమెను పట్టుకున్నాడు. రెస్ట్ తీసుకోకుండా ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావని తల్లితో అంటాడు రాజ్. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పకు. నువ్వు చేయాల్సిన పనులు సరిగ్గా చేయి. వెళ్లి నా కోడలిని తీసుకురా అని కొడుకుతో కోపంగా అంటుంది అపర్ణ.
కావ్య డిజైన్ తీసుకురావడం ఆలస్యం కావడంతో సామంత్, అనామిక టెన్షన్ పడతారు. డైరెక్ట్‌గా ఆఫీస్‌కు వస్తారు. అనుకోకుండా అప్పుడే కావ్య మేనేజర్ క్యాబిన్‌లోకి వస్తుంది. అక్కడే ఉన్నా అనామికను చూస్తుంది. కావ్యకు తాను దొరికిపోకుండా ఉండటానికి అనామిక కొత్త ఎత్తు వేసినట్లుగా బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో చూపించారు.