Bigg Boss Promo: ఎలిమినేష‌న్‌లో ట్విస్ట్ - హౌజ్ నుంచి ఇద్ద‌రు కంటెస్టెంట్స్ ఔట్ - డేంజ‌ర్ జోన్‌లో నాగ మ‌ణికంఠ‌-bigg boss 8 telugu sunday episode promo double elimination this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Promo: ఎలిమినేష‌న్‌లో ట్విస్ట్ - హౌజ్ నుంచి ఇద్ద‌రు కంటెస్టెంట్స్ ఔట్ - డేంజ‌ర్ జోన్‌లో నాగ మ‌ణికంఠ‌

Bigg Boss Promo: ఎలిమినేష‌న్‌లో ట్విస్ట్ - హౌజ్ నుంచి ఇద్ద‌రు కంటెస్టెంట్స్ ఔట్ - డేంజ‌ర్ జోన్‌లో నాగ మ‌ణికంఠ‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 29, 2024 01:21 PM IST

Bigg Boss Promo: సండే ఎపిసోడ్ ఎలిమినేష‌న్‌లో ఊహించ‌ని ట్విస్ట్ ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వీక్ ఇద్ద‌రు కంటెస్టెంట్స్‌ను హౌజ్ నుంచి పంపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. సోనియా ఆకుల‌తో పాటు ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతోన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

బిగ్‌బాస్  ప్రోమో
బిగ్‌బాస్ ప్రోమో

Bigg Boss Promo: బిగ్‌బాస్ 8 తెలుగు నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. సోనియా ఆకుల ఎలిమినేట్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సండే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్‌మా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ప్రోమోలో స్టైలిష్ గెట‌ప్‌లో సండే ఎపిసోడ్‌లోకి నాగ్ ఎంట్రీ ఇచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

మీకే అంకితం...

సండే రోజు కంటెస్టెంట్స్‌తో మీకే అంకితం పేరుతో గేమ్ ఆడించాడు నాగార్జున‌. కంటెస్టెంట్స్ ముందు ఉన్న బౌల్‌లోని ఓ చీటీ తీసి అందులో ఉన్న ట్యాంగ్‌ను ఇత‌ర‌ కంటెస్టెంట్స్‌కు అంకితం ఇవ్వాల‌ని నాగార్జున అన్నాడు. అంతే కాకుండా కంటెస్టెంట్‌ను ఓ చెంప‌దెబ్బ కొట్టాలంటూ ఓ హ్యాండ్ సింబ‌ల్‌తోకూడిన పెద్ద గ్లోవ్స్ చూపించాడు. తొలుత నైనిక చీటీ తీసింది.

అందులో లౌడ్ స్పీక‌ర్ అని రాగానే...ఎవ‌రో చెప్ప‌వ‌స‌రం లేద‌ని నాగార్జున అన‌డం న‌వ్వుల‌ను పూయించింది. ఆ ట్యాగ్‌ను విష్ణుప్రియ‌కు ఇచ్చింది నైనిక‌. న‌బీల్ చీటీలో సేఫ్ ప్లేయ‌ర్ అని వ‌చ్చింది. ఆ టైమ్‌లో ఆదిత్య‌ను ఇమిటేట్ చేశాడు న‌బీల్‌. ఆ త‌ర్వాత అటెన్ష‌న్ సీక‌ర్ అనే చీటీని తీసిన య‌ష్మి గౌడ ఆ ట్యాగ్‌ను పృథ్వీకి ఇచ్చింది. పృథ్వీని గ‌ట్టిగా కొట్టింది.

ఎయిమ్‌లెస్‌...

ఆ త‌ర్వాత నిఖిల్‌కు వ‌చ్చిన చీటీలో ఎయిమ్‌లెస్ అని వ‌చ్చింది. అంద‌రికి తెలుసు ఎవ‌రో అని నిఖిల్ అన‌గానే...నిన్ను ఊరికే అన‌లేదు సేఫ్ ప్లేయ‌ర్ అని నాగార్జున అన్నాడు. మ‌రో చీటీ తీస్తాన‌ని నాగార్జున రిక్వెస్ట్ చేశాడు నిఖిల్‌. మ‌రో చీటీ తీసిన నిఖిల్ నేను ఎయిమ్‌లెస్‌కే వెళ‌తానంటూ సిగ్గుప‌డ్డాడు. నీ మ‌న‌సులో ఎవ‌రూ లేర‌ని చెప్ప‌కు అని నిఖిల్‌ను నాగార్జున నిల‌దీయ‌డం న‌వ్వుల‌ను పంచింది. ఫ‌న్నీ గేమ్స్‌తో కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియెన్స్‌ను అల‌రిస్తూనే చివ‌ర‌లో నాగార్జున ఓ పెద్ద స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

ఎలిమినేష‌న్‌లో ట్విస్ట్‌...

సండే ఎలిమినేష‌న్‌లో ఓ ట్విస్ట్ ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ ఓటింగ్‌లో నాగ‌మ‌ణికంఠ‌కు జీరో వ‌చ్చాయి. దాంతో అత‌డు డైరెక్ట్‌గా డేంజ‌ర్ జోన్‌లోకి వెళ్లిన‌ట్లు నాగార్జున పేర్కొన్నాడు.

శేఖ‌ర్‌బాషా బాషా టైప్‌లోనే నాగ‌మ‌ణికంఠ‌ను హౌజ్ నుంచి పంపించే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నామినేష‌న్స్‌లో చివ‌ర‌గా సోనియా ఆకుల‌తో పాటు నాగ‌మ‌ణికంఠ ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ నిర్ణ‌యం ఆధారంగానే సోనియా, నాగ‌మ‌ణికంఠ‌ల‌లో ఒక‌రిని హౌజ్ నుంచి పంపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

డ‌బుల్ ఎలిమినేష‌న్‌...

నాగ‌మ‌ణికంఠ ప‌ట్ల‌ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంద‌రిలో వ్య‌తిరేక‌త ఉన్న నేప‌థ్యంలో ఎలిమినేష‌న్‌లో ఊహించ‌ని ట్విస్ట్ ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు నాగ‌మ‌ణికంఠ‌, సోనియా ఆకుల‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపించి ఆ త‌ర్వాత ఎలిమినేష‌న్‌పై నిర్ణ‌యం తీసుకోనున్నారు.

మ‌రోవైపు ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ కూడా ఉంటుంద‌ని అంటున్నారు. సోనియాతో పాటు ఆదిత్య ఓం కూడా హౌజ్ నుంచి వెళ్ల‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. లేదంటే సోనియాను సేఫ్ చేసి ఆదిత్య‌ను హౌజ్‌నుంచి పంపిస్తారా అన్న‌ది నేటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీల‌పై నేటి ఎపిసోడ్‌లో ఎలాంటి అనౌన్స్‌మెంట్ ఉండ‌బోద‌ని అంటున్నారు.