Bigg Boss Abhai Naveen: మోకాళ్లపై కూర్చొని వేడుకున్న అభయ్.. బయటికి వెళ్లిపోవాల్సిందే అంటూ నాగార్జున ఫైర్: వీడియో
Bigg Boss 8 Telugu - Abhai Naveen: బిగ్‍బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సిందేనని అభయ్ నవీన్‍పై ఫైర్ అయ్యారు నాగార్జున. అయితే, తనను క్షమించాలంటూ అభయ్ వేడుకున్నారు. ఇందుకు సంబంధించిన నేటి ఎపిసోడ్ ప్రోమో వచ్చింది.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో అభయ్ నవీన్ హాట్ టాపిక్ అయిపోయారు. ఏకంగా బిగ్‍బాస్‍నే అతడు నానా మాటలు అన్నారు. కోడిగుడ్ల టాస్క్ తర్వాతి నుంచి బిగ్‍బాస్‍ను దూషించారు. ఈ విషయంలో నేటి (సెప్టెంబర్ 21) వీకెండ్ శనివారం ఎపిసోడ్‍లో అభయ్‍ను రప్ఫాడించేశారు హోస్ట్ నాగార్జున. అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ నుంచి బయటికి పోవాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇంటెన్స్‌గా ఉంది. ప్రోమోలో ఏముందంటే..
బిగ్‍బాస్‍పై అభయ్ మాటలు
బిగ్‍బాస్‍ను అభయ్ ఇటీవల తిట్టిన మాటలతో ఈ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో మొదలైంది. హోస్ట్ నాగార్జున స్టిక్ పట్టుకొని వచ్చారు. “మెంటల్ గాడు.. ఆయన (బిగ్‍బాస్)కేే తెలియదు ఏమవుతుందో.. వాళ్లింట్లో ఆయన పెళ్లాం కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నట్టు ఉన్నాడు” అని అభయ్ చెప్పిన మాటలు ఉన్నాయి.
“నా వాయిస్ వేసి.. వాళ్ల ముఖాలు వేసి ఇలాంటి లఫంగి ఎడిట్‍లు చేయకండి. డైరెక్టుగా నా ముఖమే వేయండి. బిగ్‍బాస్ కాదు.. నువ్వు బయాస్ బాస్. బయటికి ఇంటర్వ్యూలకు వెళ్లినా అదే మాట చెబుతా. లిమిట్‍లెస్ బయాస్డ్ బిగ్‍బాస్” అని వివిధ సందర్భాల్లో బిగ్‍బాస్‍ను అభయ్ నవీన్ తిట్టిన వీడియోను నాగ్ చూపించారు. ఆ తర్వాత అభయ్‍కు స్ట్రాంగ్ క్లాస్ పీకారు.
నీ ఫేసే.. నీ వాయిసే
బిగ్‍బాస్‍ను అన్ని మాటలు అనడంపై అభయ్‍పై ఫైర్ అయ్యారు నాగార్జున. “నీ ఫేసే.. నీ వాయిసే. అన్నీ లఫంగి మాటలే. ఒకటి కాదు.. రెండు కాదు.. అభయ్ ఇది బిగ్‍బాస్ హౌస్. బిగ్‍బాసే రూల్ చేస్తారు” అని నాగ్ చెప్పారు. బిగ్‍బాస్‍పై గౌరవం లేకుంటే తాను భరించలేనని అన్నారు.
క్షమించాలంటూ మోకాళ్లపై..
తనను క్షమించాలంటూ మోకాళ్లపై కూర్చొని దండం పెట్టారు అభయ్ నవీన్. “చాలా సారీ. ఇదొక్కటి తప్ప నేను ఏమీ చేయలేను” అని చెప్పారు.
రెడ్‍కార్డ్.. బయటికి వెళ్లు
తాను రెడ్ కార్డ్ ఇవ్వాల్సి వస్తోందని నాగార్జున చెప్పారు. అభయ్‍కు రెడ్ కార్డ్ చూపించారు. దీంతో కంటెస్టెంట్లందరూ షాక్ అయ్యారు. బిగ్‍బాస్ తలుపులు తెరవాలని నాగార్జున చెప్పారు. దీంతో డోర్స్ ఓపెన్ అయ్యారు. హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవాలని అభయ్‍ను నాగార్జున ఆదేశించారు.
నా నిర్ణయం ఫైనల్
దీంతో అభయ్‍ను క్షమించాలని నాగార్జునను యష్మి కోరారు. అభయ్ కూడా ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ అడిగారు. అయితే, హౌస్ నుంచి గెటౌట్ అంటూ నాగార్జున చెప్పేశారు. దీంతో ప్రోమో ముగిసింది.
అభయ్ నవీన్‍ను హౌస్ నుంచి నిజంగానే పంపించేస్తారా.. క్షమించే అవకాశం ఏమైనా ఉందా అనేది నేటి ఎపిసోడ్‍లో తేలనుంది. నాగార్జున మాత్రం బిగ్‍బాస్‍ను అన్ని మాటలు అనడంపై చాలా సీరియస్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎవరూ కూడా హౌస్‍లోనే ఉంటూ బిగ్‍బాస్‍ను అభయ్ అన్నన్ని మాటలు, ఆరోపణలు చేయలేదు. దీంతో నాగ్ కూడా అదే రేంజ్‍లో ఫైర్ అయ్యారు. మరి హౌస్‍లో ఉండేందుకు అభయ్‍కు మరో ఛాన్స్ ఉంటుందో.. బయటికి పంపించేందుకే నిర్ణయం తీసుకుంటారో చూడాలి.