Bigg Boss Sonia Love: నిఖిల్‌ లవ్ ట్రాక్‌పై బాంబ్ పేల్చిన సోనియా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రేంజ్‌లో ఎమోషన్-bigg boss telugu 8 sonia akula about love connection with nikhil and prithviraj in bigg boss 8 telugu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Sonia Love: నిఖిల్‌ లవ్ ట్రాక్‌పై బాంబ్ పేల్చిన సోనియా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రేంజ్‌లో ఎమోషన్

Bigg Boss Sonia Love: నిఖిల్‌ లవ్ ట్రాక్‌పై బాంబ్ పేల్చిన సోనియా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రేంజ్‌లో ఎమోషన్

Sanjiv Kumar HT Telugu
Sep 11, 2024 03:24 PM IST

Bigg Boss Telugu 8 Sonia Akula Love Track: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో వస్తున్న నిఖిల్ లవ్ ట్రాక్‌పై పెద్ద బాంబ్ పేల్చేసింది సోనియా ఆకుల. ఇన్నిరోజులు ప్రేమికులుగా కనిపించిన నిఖిల్ సోనియా ఒక్కసారిగా అన్నా చెల్లెళ్లు అయిపోయారు. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రేంజ్‌లో ఎమోషన్ పలికించింది సోనియా.

నిఖిల్‌ లవ్ ట్రాక్‌పై బాంబ్ పేల్చిన సోనియా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రేంజ్‌లో ఎమోషన్
నిఖిల్‌ లవ్ ట్రాక్‌పై బాంబ్ పేల్చిన సోనియా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రేంజ్‌లో ఎమోషన్

Bigg Boss Telugu 8 Sonia Nikhil Prithvi: ఎలాంటి విచిత్రమైన సంఘటనలు జరిగే ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. దీనికి బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మరోసారి నిదర్శనంగా మారింది. బిగ్ బాస్ 8 తెలుగులోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్‌లో నిఖిల్ మలియక్కల్, సోనియా ఆకుల, పృథ్వీరాజ్ ఉన్న విషయం తెలిసిందే.

లవ్ ట్రాక్స్‌పైనే

అయితే, బిగ్ బాస్ హౌజ్‌లో లవ్ ట్రాక్‌లు, రొమాన్స్, రొమాంటిక్ ముచ్చట్లు, ఎమోషన్స్, ఫైట్స్ సర్వసాధారణమే. కానీ, బిగ్ బాస్ కెమెరాలు మాత్రం ఎక్కువగా లవ్ ట్రాక్స్ నడిపేవారిపైనే ఫోకస్ పెడతాయి. అలా బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లో లవ్ ట్రాక్‌తో ఫోకస్ అయ్యారు నిఖిల్, సోనియా ఆకుల. మొదట గొడవ పడిన వీరిద్దరు ఊహించనివిధంగా కలిసిపోయారు.

అప్పటి నుంచి ఇద్దరు కలిసే ఉండటం, ఎక్కడినై కలిసే వెళ్లడం వంటివి చేశారు. అందరిపై అరిచే సోనియా కూడా నిఖిల్‌తో క్లోజ్‌గా ఉండేసరికి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందా అనే అనుమానం హౌజ్‌లో ఉన్నవాళ్లతోపాటు ఆడియెన్స్‌కు వచ్చింది. ఈ క్రమంలోనే "నన్ను దత్తత తీసుకోవచ్చుగా.. నాకు తల్లిగా ఉండొచ్చుగా" అని నిఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

తల్లికొడుకుల బాండింగ్

అయితే, ఇది ఎపిసోడ్‌లో రాలేదు కానీ లైవ్‌లో చూసినవాళ్లు మాత్రం షాక్ అయ్యారు. ప్రేమికులుగా అనుకున్నవాళ్లు ఒక్కసారిగా తల్లికొడుకుల వంటి బాండింగ్ వాళ్లది అన్నట్లుగా చూపించుకున్నారు. కట్ చేస్తే పృథ్వీతో కూడా సోనియా క్లోజ్‌గా మూవ్ అవడం ప్రారంభించింది. దీంతో ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నడుస్తుందేమో అని అంతా భావించారు.

కానీ, ఈలోపే ఆర్జీవీ నిర్మించిన సినిమాల హీరోయిన్ అయినా సోనియా ఆకుల పెద్ద బాంబ్ పేల్చింది. సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌లోని రెండోవారం నామినేషన్స్ తర్వాత పృథ్వీరాజ్‌తో మాట్లాడుతూ పెద్దోడు ఎక్కడ అని నిఖిల్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడింది. నిఖిల్ పెద్దోడు.. పృథ్వీ చిన్నోడు అని సరదాగా చెప్పింది. దానికి పృథ్వీ కూడా నవ్వాడు.

నేటి ఎపిసోడ్‌లో

ఇదిలా ఉంటే, తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుంటే అది లైవ్‌ వీడియోలా ఉంది. అందులోని సీన్‌ను ఇవాళ్టీ (సెప్టెంబర్ 11) ఎపిసోడ్‌లో టెలీకాస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో హౌజ్‌మేట్స్‌తో ఉన్న బాండింగ్ గురించి అందరిముందు చెప్పింది సోనియా ఆకుల.

"నాకు ఎక్కువ కనెక్షన్ అయితే ఫుడ్‌తో వచ్చింది. నాకు మా పెద్దన్నయ్య యష్ వండినట్లు వండుతావ్. చాలా ప్యాషనేట్‌గా ఎంతో ఇష్టంతోని, ప్రేమతోని ఫుడ్ వండిపెడతావ్. సో నాకు ఆ కనెక్షన్.. నాకు కూడా అంతే ఫ్యామిలీ కనెక్షన్ లాగానే వీళ్లిద్దరు పెద్దోడు చిన్నోడు.. వాడు చిన్నోడు.. వీడు పెద్దోడు అన్నట్లుగా ఉంటది" అని నిఖిల్‌తోపాటు అందరితో చెప్పింది సోనియా.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రేంజ్‌లో

సోనియా మాటలకు నిఖిల్ ఏడవలేక ఏదో నవ్వుతూ మొహం పెట్టుకున్నాడు. పృథ్వీ అయితే పట్టనట్లు కూర్చున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పెద్దోడు చిన్నోడు అన్న రేంజ్‌లో నిఖిల్, పృథ్వీతో బ్రదర్ కనెక్షన్ ఉందన్నట్లుగా సోనియా చెప్పి షాక్ ఇచ్చింది. సోనియా మాట్లాడిన వీడియోకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు క్లిప్ యాడ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.