Bigg Boss Telugu 8: బిగ్ బాస్ నాగ మణికంఠ విగ్గుపై బ్రహ్మముడి కావ్య ట్రోలింగ్.. దారుణమే ఇది! వీడియో వైరల్
Brahmamudi Kavya Trolling Bigg Boss Naga Manikanta: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ నాగ మణికంఠ విగ్గు పీకేయడంపై బ్రహ్మముడి కావ్య అకా దీపికా రంగరాజు ట్రోలింగ్ చేసింది. నాగ మణికంఠ విగ్గు పీక్కున్న విధానాన్ని ఇమిటేట్ చేస్తూ కామెడీ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
Bigg Boss Telugu 8 Naga Manikanta Trolling: బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లో రెండో వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి. రెండో వారం కూడా నామినేషన్ల ప్రక్రియ రెండు రోజుల పాటు సాగింది. అయితే, మొదటి రోజు జరిగినంత వాడి వేడీగా రెండో రోజు నామినేషన్స్ జరగలేదు. రెండోవారంలో మొత్తంగా 8 మంది నామినేషన్స్‌లో ఉన్నారు.
జీవితంలో జరిగిన విషాదం
రెండో వారం నామినేషన్స్ కంటే మొదటి వారం నామినేషన్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. వాటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వాటిలో ఎక్కువగా ట్రోలింగ్‌గు గురయ్యాడు నాగ మణికంఠ. నామినేషన్స్‌లో అంతా తనను సింపథీ ట్రాక్ ప్లే చేస్తున్నావాని, ఎవరితో కలవడం లేదని అనడంతో బరస్ట్ అయ్యాడు. తన జీవితంలో జరిగిన బాధాకర విషయాలన్నింటిని నామినేషన్స్‌లో చెబుతూ ఏడ్చాడు.
చిన్నప్పుడే తండ్రి చనిపోయాడని, స్టెప్ ఫాదర్ వల్ల అనుమానాలు ఎదుర్కున్నాని, తర్వాత క్యాన్సర్‌తో తల్లి కూడా చనిపోయిందని, కట్టే కట్టే పేర్చి తల్లి శవాన్ని కాల్చాల్సి వచ్చిందని, భార్య విడాకులు ఇచ్చిందని, కూతురుకు దూరమైపోయాయని కన్నీళ్లు పెట్టుకున్నాడు నాగ మణికంఠ. నామినేషన్స్ తర్వాత అదే బాధను కంటిన్యూ చేశాడు మణికంఠ.
కావ్య ట్రోలింగ్
నావల్ల కాదు నిఖిల్.. ఇంతకన్నా ట్రాన్సపరెంట్‌గా ఉండలేను అంటూ తన విగ్గు తీసేశాడు మణికంఠ. అది చూసిన ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఏంటీ అది విగ్గా అని ఆశ్చర్యపోయారు. తర్వాత సోషల్ మీడియాలో ఈ క్లిప్ తెగ వైరల్ కావడమే కాకుండా ట్రోలింగ్ కూడా అయింది. అయితే, తాజాగా దీన్నే బ్రహ్మముడి కావ్య అకా దీపికా రంగరాజు ట్రోలింగ్ చేసింది. అది కూడా స్టార్ మా షోలో కామెడీ చేసింది.
బ్రహ్మముడి సీరియల్‌లో కావ్య పాత్రలో అదరగొట్టే దీపికా రంగరాజు రియల్ లైఫ్‌లో తన కామెడీ టైమింగ్‌తో ఆద్యంతం నవ్విస్తుంది. తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం 100వ ఎపిసోడ్ స్పెషల్ ఈవెంట్ ప్రోమోను విడుదల చేశారు. ఈ షోలో బిగ్ బాస్ తెలుగు 7 రన్నరప్ అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ, అర్జున్ అంబటితోపాటు బ్రహ్మముడి టీమ్ కూడా పాల్గొంది.
విగ్గు తీసేస్తూ..
హలో నాగార్జున గారు అని దీపికా అంటుంటే.. ఆయన నెంబర్ కూడా నీ దగ్గర ఉందా అని శ్రీముఖి అడిగింది. హా ఉంది దీపికా చెప్పడంతో అంతా నవ్వేశారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఈ అమ్మాయికి బదులు నేను ఉండి ఉంటే కంటెంట్ బాగా ఇచ్చేదాన్ని అని ఎవరిని అనుకుంటున్నావ్ అని శ్రీముఖి అడిగింది. నిఖిల్.. దీనికంటే ట్రాన్సపరెంట్‌గా ఉండలేను అంటూ మణికంఠ లాగే విగ్గు పీకేసింది దీపికా.
అది చూసి అంతా ఒక్కసారిగా నవ్వేశారు. అయితే, నాగ మణికంఠను అలా దీపికా ట్రోల్ చేయడంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కావ్య గారు మీకు ఎమోషన్స్ లేవా, ఇంత దారుణంగా కామెడీ చేస్తారా అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే, సొంత షోలోని కంటెస్టెంట్‌పై తమ షోలోనే ఇలా ట్రోల్ చేయడం విశేషంగా మారింది. అలాగే దీపికా అలా చేసినప్పటికీ అది రాసింది షో నిర్వాహకులే కదా అని మరికొందరు అంటున్నారు.