Mahesh Babu: యంగ్ హీరోకు మహేష్ బాబు సపోర్ట్.. సోషల్ మీడియాలో పోస్ట్-mahesh babu released karthikeya baje vayu vegam first look motion poster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: యంగ్ హీరోకు మహేష్ బాబు సపోర్ట్.. సోషల్ మీడియాలో పోస్ట్

Mahesh Babu: యంగ్ హీరోకు మహేష్ బాబు సపోర్ట్.. సోషల్ మీడియాలో పోస్ట్

Sanjiv Kumar HT Telugu
Apr 13, 2024 10:33 AM IST

Mahesh Babu Karthikeya Baje Vayu Vegam: సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ హీరోకు సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న భజే వాయు వేగం సినిమా టైటిల్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసి పోస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

యంగ్ హీరోకు మహేష్ బాబు సపోర్ట్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
యంగ్ హీరోకు మహేష్ బాబు సపోర్ట్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

Mahesh Babu Baje Vayu Vegam First Look: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో యావరేజ్ టాక్ అందుకున్నాడు. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్‌లో మూడో సినిమాగా వచ్చిన గుంటూరు కారం అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ దర్శక దిగ్గజం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

yearly horoscope entry point

ఇదిలా ఉంటే, తాజాగా మహేష్ బాబు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండకు మద్దతుగా నిలిచారు. అతను నటిస్తున్న లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం సినిమా మోషన్ మోస్టర్, ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. "ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలి. కార్తికేయ, డైరెక్టర్ ప్రశాంత్, మూవీ యూనిట్ ఆల్ ది బెస్ట్" అని మహేష్ బాబు ట్విటర్‌లో రాసుకొచ్చారు.

దాంతో మహేష్ బాబు లేటెస్ట్ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అలా కార్తికేయ కొత్త సినిమాకు మంచి ప్రచారం లభించినట్లు అయింది. కాగా యూవీ క్రియేషన్స్ సమర్పణలో హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమానే "భజే వాయు వేగం". ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా కార్తికేయకు జోడీగా నటిస్తోంది. హ్యాపీ డేస్ సినిమాలో టైసన్‌గా చాలా పాపులర్ అయిన రాహుల్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.

భజే వాయు వేగం మూవీకి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక భజే వాయు వేగం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో క్రికెట్ బ్యాట్‌తో హీరో కార్తికేయ పరుగులు పెడుతుండటం, మరోవైపు పెద్ద మొత్తంలో డబ్బు ఎగరడం కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ భజే వాయు వేగం సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

ఫ్రెష్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

బ్యూటిఫుల్ ఐశ్వర్య మీనన్ ఇటీవల నిఖిల్ స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. అలాగే తమిళ్ రాకర్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య మీనన్. ఇక కార్తికేయ ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రెండో సినిమాగా చేసిన ఆర్ఎక్స్ 100తో ఊహించని క్రేజ్ దక్కించుకున్నాడు.

అయితే, ఆ సినిమా తర్వాత కార్తికేయ గుమ్మకొండకు అంతగా మంచి హిట్ పడలేదు. హిప్పీ, గుణ 369, 90 ఎంఎల్, చావు కబురు చల్లగా సినిమాలు అంతగా ఆడలేదు. హీరోగా చేస్తూనే నాని గ్యాంగ్ లీడర్, తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వళిమై సినిమాల్లో విలన్‌గా నటించాడు. ఇటీవల బెదురులంక 2012 సినిమాతో యావరేజ్ హిట్ టాక్ తెచ్చుకున్నాడు కార్తికేయ.

Whats_app_banner