Karthikeya 3 Update: కార్తికేయ 3పై అప్‍డేట్ ఇచ్చిన హీరో నిఖిల్
Karthikeya 3 Update: కార్తికేయ 3 సినిమా అప్‍డేట్ ఇచ్చారు యంగ్ హీరో నిఖిల్. ఈ విషయంపై నేడు ఓ ట్వీట్ చేశారు. ఆ వివరాలివే..
Karthikeya 3: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ - దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‍లో వచ్చిన కార్తికేయ, కార్తికేయ 2 చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మైథాలజీతో మిస్టరీ థ్రిల్లర్లుగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రం ‘సుబ్రమణ్యపురం’ గ్రామం మిస్టరీ కథతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. ఇక 2022లో వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్‍లో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగుతో పాటు హిందీలోనూ భారీ వసూళ్లను కైవసం చేసుకుంది. శ్రీకృష్ణుడి అంశంతో మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన కార్తీకేయ 2 సూపర్ హిట్ అయింది.
కార్తికేయ 3 సినిమా ఉంటుందని రెండో పార్ట్ క్లైమాక్స్‌లోనే మూవీ టీమ్ సంకేతాలు ఇచ్చింది. అయితే, అప్పటి నుంచి ఈ చిత్రంపై పెద్దగా అప్‍డేట్స్ రాలేదు. దీంతో కార్తికేయ 3 ఎప్పుడు ఉంటుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నేడు (మార్చి 17) ఈ చిత్రంపై అప్‍డేట్ ఇచ్చారు హీరో నిఖిల్.
త్వరలో..
డాక్టర్ కార్తికేయ.. సరికొత్త అడ్వెంచర్ సెర్చ్‌లో ఉన్నారని నిఖిల్ నేడు ట్వీట్ చేశారు. త్వరలో అంటూ పేర్కొన్నారు. అలాగే, మూవీ స్టిల్స్‌కు సంబంధించి రెండో ఫొటోలను పోస్ట్ చేశారు. దర్శకుడు చందూ మొండేటికి ట్యాగ్ చేయడంతో పాటు కార్తికేయ 3 హ్యాష్‍ట్యాగ్‍ను జతచేశారు.
ప్రస్తుతం కార్తికేయ 3 చిత్రానికి స్క్రిప్ట్ పనుల్లో చందూ మొండేటి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‍గా, ఎక్కువ బడ్జెట్‍తో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. రెండో భాగం పాన్ ఇండియా రేంజ్‍లో హిట్ అవడంతో కార్తికేయ 3 మూవీని భారీగానే తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా తండేల్ చిత్రాన్ని ప్రస్తుతం రూపొందిస్తున్నారు చందూ మొండేటి.
స్వయంభూ మూవీ గురించి..
స్వయంభూ సినిమాలో ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ అంచనాలను భారీగా పెంచేసింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాజుల కాలం నాటి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాదే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు.
స్వయంభూ చిత్రం కూడా పాన్ ఇండియా రేంజ్‍లో విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమింళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు.
కాగా, హీరో నిఖిల్ సిద్ధార్థ ఇటీవలే తండ్రి అయ్యారు. నిఖిల్ భార్య పల్లవి గత నెల మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆ దంపతులు తొలిసారి తల్లిదండ్రులయ్యారు. 2020లో మేలో నిఖిల్, పల్లవి వివాహం జరిగింది. వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సుమారు నాలుగేళ్ల తర్వాత నిఖిల్, పల్లవి పేరెంట్స్ అయ్యారు. ఇటీవలే తమ కుమారుడికి బారసాల వేడుక కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి.