Game Changer Movie: గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ ఈవెంట్ ఇదే.. టీజర్, రిలీజ్ డేట్, మూడో పాటపై అప్‍డేట్ ఇచ్చిన దిల్‍రాజు-game changer movie first event is second song raa macha macha launch and dil raju gave teaser and third single updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Movie: గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ ఈవెంట్ ఇదే.. టీజర్, రిలీజ్ డేట్, మూడో పాటపై అప్‍డేట్ ఇచ్చిన దిల్‍రాజు

Game Changer Movie: గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ ఈవెంట్ ఇదే.. టీజర్, రిలీజ్ డేట్, మూడో పాటపై అప్‍డేట్ ఇచ్చిన దిల్‍రాజు

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 29, 2024 08:36 PM IST

Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమా తొలి ఈవెంట్‍కు డేట్, టైమ్ ఫిక్స్ అయ్యాయి. రెండో పాట లాంచ్ కోసం ఇది జరగనుంది. ఈ మూవీ టీజర్ సహా తదుపరి పాట గురించి నిర్మాత దిల్‍రాజు అప్‍డేట్స్ ఇచ్చారు.

Game Changer Movie: గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ ఈవెంట్ ఇదే.. టీజర్, రిలీజ్ డేట్, మూడో పాటపై అప్‍డేట్ ఇచ్చిన దిల్‍రాజు
Game Changer Movie: గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ ఈవెంట్ ఇదే.. టీజర్, రిలీజ్ డేట్, మూడో పాటపై అప్‍డేట్ ఇచ్చిన దిల్‍రాజు

గేమ్ ఛేంజర్ చిత్రంపై హైప్ విపరీతంగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న ఈ పొటిలికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై బోలెడు అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా కోసం ఫస్ట్ ఈవెంట్ జరగనుంది. రెండో పాట లాంచ్ చేసేందుకు మూవీ టీమ్ ఈ ఈవెంట్ నిర్వహిస్తోంది. దీనికి డేట్, టైమ్, వేదిక ఖరారయ్యాయి.

ఈవెంట్ వివరాలు

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రెండో పాట ‘రా మచ్చా.. మచ్చా’ సాంగ్ రేపు (సెప్టెంబర్ 30) రిలీజ్ కానుంది. ఈ పాట లాంచ్ కోసం ఈవెంట్ జరగనుంది.హైదరాబాద్‍లోని సెయింట్ మేరీస్ కాలేజ్‍లో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రా మచ్చా.. మచ్చా సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. గేమ్ ఛేంజర్ చిత్రం కోసం జరుగుతున్న తొలి ఈవెంట్ ఇదే. అయితే, ఈ ఈవెంట్‍కు రామ్ చరణ్ వస్తారా లేదా అనేది చూడాలి.

గేమ్ ఛేంజర్ మూవీ నుంచి రానున్న రా మచ్చా.. మచ్చా సాంగ్ పక్కా మాస్ బీట్‍తో ఉండనుంది. ఇటీవలే ప్రోమో వచ్చింది. రామ్‍చరణ్ డ్యాన్స్ అదిరిపోయింది. వేలాది మంది ఈ పాటలో కనిపించనున్నారు. డైరెక్టర్ శంకర్ మార్క్ గ్రాండ్‍నెస్‍తో ఈ సాంగ్ ఉండనుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సాంగ్‍కు మాస్ ట్యూన్ అందించారు. రేపు ఈ సాంగ్ రిలీజ్ కానుంది.

ముఖ్యమైన అప్‍డేట్స్ ఇచ్చిన దిల్‍రాజు

‘రా మచ్చా మచ్చా’ పాట రానున్న సందర్భంగా గేమ్ ఛేంజర్ మూవీని నిర్మించిన దిల్‍రాజు, ఈ పాటకు లిరిక్స్ అందించిన అనంత్ శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ మూవీపై ముఖ్యమైన అప్‍డేట్స్ ఇచ్చారు దిల్‍రాజు. రిలీజ్ డేట్, టీజర్, మూడో పాట గురించి అప్‍డేట్స్ ఇచ్చారు.

రిలీజ్ డేట్, టీజర్ గురించి..

గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్‍కు అని నమ్మవచ్చా అని దిల్‍రాజును అనంత్ శ్రీరామ్ అడిగారు. “క్రిస్మస్‍కు ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లో రావాలని అన్ని రకాలుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి” అని దిల్‍రాజు చెప్పారు.

అక్టోబర్‌లో గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ రానుందని దిల్‍రాజు వెల్లడించారు. అక్టోబర్ చివర్లో ఇంకో పాట కూడా వస్తుందని తెలిపారు. రానున్న మూడు నెలలు ప్రమోషన్లు బాగా ప్లాన్ చేశామని అన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంతా ప్యాక్డ్‌గా ప్రమోషన్లు ఉంటాయని అన్నారు. కాగా, దసరా సందర్భంగా అక్టోబర్ 12వ తేదీన గేమ్ ఛేంజర్ టీజర్ తెచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ మూవీని డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగా డిసైడ్ అయ్యారు. షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జోరుగా జరుగుతున్నాయి. డిసెంబర్ 20న ఈ చిత్రం వస్తుందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెలిపినా.. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఓ క్లారిటీ వచ్చాక డేట్ చెప్పాలని టీమ్ ఆలోచిస్తోంది. ఈ మూవీలో రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా చేశారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ కీరోల్స్ చేశారు.