OTT Horror: ఏడాది తర్వాత ఓటీటీలోకి మలయాళం ట్రెండ్ సెట్టర్ హారర్ మూవీ - ట్విస్ట్‌లతో వణికిస్తుంది!
OTT Horror: మలయాళం హారర్ మూవీ ఫీనిక్స్ థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మనోరమా మాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ రొమాంటిక్ హారర్ మూవీలో అజు వర్గీస్, అనూప్ మీనన్ కీలక పాత్రలు పోషించారు.
OTT Horror: మలయాళం మూవీ ఫీనిక్స్ థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. రొమాంటిక్ హారర్ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో అజు వర్గీస్, చందునాధ్, అనూప్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. విష్ణు భరతన్ దర్శకత్వం వహించాడు.
మనోరమా మాక్స్...
ఫీనిక్స్ మూవీ మనోరమా మాక్స్ ద్వారా త్వరలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 4న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఫీనిక్స్ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ కూడా కొనుగోలు చేసింది. రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఫ్రీ స్ట్రీమింగ్‌కు మాత్రం అందుబాటులోకి రాలేదు.
ట్రెండ్ సెట్టింగ్...
గత ఏడాది నవంబర్‌లో థియేటర్లలో రిలీజైన ఫీనిక్స్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. కాన్సెప్ట్, ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను థ్రిల్‌కు గురిచేశాయి. మలయాళం హారర్ మూవీస్‌లో ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఇదంటూ క్రిటిక్స్ పేర్కొన్నారు.
రెండు టైమ్ పీరియడ్స్‌లో...
లవ్, హారర్ అంశాలను మిక్స్ చేస్తూ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు ఫీనిక్స్ మూవీని తెరకెక్కించాడు. 1970, 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఫీనిక్స్ మూవీ కథ సాగుతుంది. జాన్ (అజూ వర్గీస్) ఓ లాయర్ ఎవరితో అంతగా కలవడు. ఊరికి దూరంగా సముద్రం దగ్గరంలో ఉన్న ఓ పాతకాలం నాటి ఇంట్లోకి భార్య, ముగ్గురు పిలల్లతో కలిసి అద్దెకు దిగుతాడు. అక్కడికి వచ్చిన కొద్ది రోజులకు జాన్‌కు ఉత్తరాలు రావడం మొదలువుతాయి.
ఫ్రెడ్డీ అనే వ్యక్తి ఫ్రమ్ అడ్రస్ లేకుండా జాన్‌కు ఉత్తరాలు పంపిస్తుంటాడు. ఫ్రెడ్డీతో జాన్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఆ ఇంట్లో 1970 దశకంలో ఉన్న ప్రేమజంట ఫ్రెడ్డీ, అన్నా రోజ్ కథేమిటి? అన్నా రోజ్ ఏలా చనిపోయింది. ఆమె ఆత్మ జాన్ కుటుంబసభ్యులను ఎందుకు ఆవహించింది? ఆ ఇంటి మిస్టరీని జాన్ ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ఈ మూవీ కథ.
సామ్ సీఎస్ బీజీఎమ్...
గతంలో మలయాళంలో వచ్చిన హారర్ సినిమాలకు భిన్నమైన బ్యాక్‌డ్రాప్, విజువల్స్, కలర్ టోనింగ్‌తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు సామ్ సీఎస్ బ్యాక్‌డ్రాప్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. రెండు గంటల పన్నెండు నిమిషాల నిడివితో ఈ మూవీ రిలీజైంది.
పది సినిమాలు...
అజు వర్గీస్ మలయాళంలో బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోన్నాడు. 2024లో అజు వర్గీస్ నటించిన పది సినిమాలు రిలీజయ్యాయి. ఈ ఏడాది మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన వర్షంగుల్కు శేషం డ్యూయల్ ఓల్‌లో నటించాడు. గురువాయూర్ అంబాలనాదయాల్, నునాక్కుజితో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు.