Balakrishna: మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ లాంఛ్‌ మూడు నెల‌ల త‌ర్వాతే! - నంద‌మూరి వార‌స‌త్వంపై బాల‌కృష్ణ కామెంట్స్ వైర‌ల్‌-balakrishna reveals his son mokshagna teja debut movie launching details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna: మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ లాంఛ్‌ మూడు నెల‌ల త‌ర్వాతే! - నంద‌మూరి వార‌స‌త్వంపై బాల‌కృష్ణ కామెంట్స్ వైర‌ల్‌

Balakrishna: మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ లాంఛ్‌ మూడు నెల‌ల త‌ర్వాతే! - నంద‌మూరి వార‌స‌త్వంపై బాల‌కృష్ణ కామెంట్స్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 29, 2024 08:20 AM IST

Balakrishna: నంద‌మూరి వార‌సుడు ఎవ‌ర‌నేదానిపై ఐఫా 2024 వేడుక‌లో బాల‌కృష్ణ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. ఐఫా వేడుక‌లో మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశాడు బాల‌కృష్ణ‌. అఖండ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు.

బాల‌కృష్ణ , చిరంజీవి
బాల‌కృష్ణ , చిరంజీవి

Balakrishna: నంద‌మూరి వార‌సుడు ఎవ‌ర‌నేదానిపై ఐఫా వేడుక‌లో బాల‌కృష్ణ చేస‌న కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. దుబాయ్‌లోని అబుదాబీలో జ‌రుగుతోన్న ఐఫా 2024 వేడుక‌ల్లో చిరంజీవి, వెంక‌టేష్‌తో పాటు బాల‌కృష్ణ పాల్గొన్నారు. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు క‌నిపించి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు. ఐఫా వేడుక‌లో బాల‌కృష్ణ గోల్డెన్ లెగ‌సీ అవార్డు అందుకున్నారు. ఈ వేడుక‌లో నంద‌మూరి వార‌స‌త్వంపై బాల‌కృష్ణ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

మోక్ష‌జ్ఞ‌నే నా వార‌సుడు...

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎన్టీఆర్ వార‌సుడు బాల‌కృష్ణ అయితే...మ‌రి మీ వార‌సుడు ఎవ‌రు అని అడిగిన ప్ర‌శ్న‌కు బాల‌కృష్ణ చెప్పిన స‌మాధానం ఆస‌క్తిక‌రంగా మారింది. నా వార‌సుడు నా కొడుకు...ఆ త‌ర్వాత నా మ‌న‌వ‌డు అని బాల‌కృష్ణ అన్నాడు. వీళ్లు త‌ప్ప ఇంకెవ‌రున్నారు అంటూ బాల‌కృష్ణ చెప్పాడు.

కావాల‌నే జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరును బాల‌కృష్ణ చెప్ప‌లేద‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు. ఎన్టీఆర్ నంద‌మూరి వార‌సుడు కాద‌ని బాల‌కృష్ణ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడ‌ని అంటున్నారు. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మాత్రం బాల‌కృష్ణ కామెంట్స్‌లో త‌ప్పేం లేద‌ని చెబుతున్నారు.

మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ...

మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ లాంఛింగ్ ఎప్పుడ‌న్న‌ది ఐఫాలో బాల‌కృష్ణ రివీల్ చేశాడు. మోక్ష‌జ్ఞ ఫ‌స్ట్ మూవీ డిసెంబ‌ర్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అవుతుంద‌ని బాల‌కృష్ణ చెప్పాడు. తాను ఇండ‌స్ట్రీలో మ‌రో ఇర‌వై ఐదేళ్ల పాటు ఉంటాన‌ని, సినిమాల విష‌యంలో కొడుకు మోక్ష‌జ్ఞ‌తో పాటు మ‌న‌వ‌డితో పోటీప‌డ‌తాన‌ని బాల‌కృష్ణ అన్నాడు.

మోక్ష‌జ్ఞ ఫ‌స్ట్ మూవీకి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీని ఇటీవ‌లే ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. బాల‌కృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఈ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఆల‌స్యానికి కార‌ణం ఇదే...

ద‌స‌రాకే లాంఛింగ్ ఈవెంట్ ఉండ‌నున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ మ‌రో మూడు నెల‌ల త‌ర్వాతే మూవీ సెట్స్‌పైకి వ‌స్తుంద‌ని బాల‌కృష్ణ క్లారిటీ ఇచ్చాడు. డెబ్యూ మూవీ కోసం మోక్ష‌జ్ఞ స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడ‌ని అందుకే ఈ మూవీ ఆల‌స్యంగా మొద‌లుకానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అఖండ సీక్వెల్‌పై ఐఫా ఈవెంట్‌లో బాల‌కృష్ణ క్లారిటీ ఇచ్చాడు. తొంద‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని అన్నాడు.

బాల‌కృష్ణ 109

ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ ఓ మూవీ చేస్తోన్నాడు. బాల‌కృష్ణ కెరీర్‌లో 109వ మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో యానిమ‌ల్ ఫేమ్ బాబీడియోల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. దుల్క‌ర్ స‌ల్మాన్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు.

Whats_app_banner