OTT Trending Movies: ఓటీటీలో నాని సూపర్ హిట్ మూవీని దాటేసిన జాన్వీ కపూర్ థ్రిల్లర్ చిత్రం.. టాప్‍లో ట్రెండింగ్
OTT Movies: జాన్వీ కపూర్ లీడ్ రోల్ చేసిన ఉలఝ్ చిత్రం ఓటీటీలో మంచి ఆరంభం అందుకుంది. ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. సరిపోదా శనివారం చిత్రాన్ని దాటి ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్‍కు వెళ్లింది.
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలు పోషించిన ఉలఝ్ మూవీ ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ట్రైలర్‌తో ఈ మూవీకి మంచి క్రేజ్ వచ్చింది. అయితే, థియేటర్లలో ఈ స్పై థ్రిల్లర్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ ఉలఝ్ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
టాప్‍లోకి వచ్చిన మూవీ
ఉలఝ్ చిత్రం గత శుక్రవారం (సెప్టెంబర్ 27) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. దీంతో నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‍లో అప్పుడే టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చేసింది.
‘సరిపోదా శనివారం’ను క్రాస్ చేసి..
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సెప్టెంబర్ 27నే అడుగుపెట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో ఈ మూవీ బ్లాక్‍బస్టర్ అయింది. ఇదే రీతిలో ఒక్క రోజులోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చింది సరిపోదా శనివారం. భారీ వ్యూస్ సాధించింది.
అయితే, ప్రస్తుతం (సెప్టెంబర్ 29) సరిపోదా శనివారం చిత్రాన్ని ఉలఝ్ మూవీ దాటేసింది. జాన్వీ కపూర్ మూవీ టాప్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. అయితే, సరిపోదా శనివారం మళ్లీ ఫస్ట్ ప్లేస్‍కు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు చిత్రాల మధ్య ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో పోటీ నెలకొంది.
ఉలఝ్ గురించి..
ఉలఝ్ మూవీకి సుదాన్షు సారియా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుహనా భాటియా పాత్ర పోషించారు జాన్వీ కపూర్. రోషన్ మాథ్యూ కూడా లీడ్ రోల్ చేశారు. గుల్షన్ దేవయా, ఆదిల్ హుసేన్, మెయాంగ్ చాంగ్, రాజేశ్ తైలాంగ్, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి కీలకపాత్రలు పోషించారు.
ఉలఝ్ మూవీని జంగిల్ పిక్చర్స్ పతాకంపై వినీత్ జైన్ నిర్మించగా.. శశ్వాంత్ సచ్‍దేవ్ సంగీతం అందించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. మిశ్రమ స్పందన రావటంతో బోల్తా కొట్టింది.
నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సూపర్ హిట్ కొట్టింది. ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూ.100కోట్ల కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించారు. ఎస్‍జే సూర్య నెగెటివ్ రోల్ చేశారు. జేక్స్ బెజోయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ ఈ చిత్రం జోరు చూపిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
సరిపోదా శనివారం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది నెట్‍ఫ్లిక్స్. ఒప్పందం ప్రకారం ఈ మూవీ బ్లాక్‍బస్టర్ అయినా నెలలోగానే స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. సెప్టెంబర్ 27వ తేదీనే అడుగుపెట్టింది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రొడ్యూజ్ చేశారు.