తెలుగు న్యూస్  /  Business  /  What To Do With Your First Salary, Know Meaningful Tips To Spend Money

How to spend first salary : మొదటి జీతం అందుకున్నారా? ఇలా చేస్తే లైఫ్​ సెటిల్​..!

29 January 2023, 10:42 IST

    • How to spend first salary : మీకు మొదటి జీతం రాబోతోందా? ఎలా ఖర్చు చేయాలో ప్లాన్​ చేశారా? ఒక్క నిమిషం ఆగండి. మీ మొదటి జీతాన్ని.. మీ భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తే.. లైఫ్​ సెటిల్​ అవుతుంది. మొదటి జీతాన్ని ఎలా ఖర్చు చేయాలి? అన్న టిప్స్​ ఇక్కడ తెలుసుకోండి.
మొదటి జీతం అందుకున్నారా? ఇలా చేస్తే లైఫ్​ సెటిల్​..!
మొదటి జీతం అందుకున్నారా? ఇలా చేస్తే లైఫ్​ సెటిల్​..! (HT_PRINT)

మొదటి జీతం అందుకున్నారా? ఇలా చేస్తే లైఫ్​ సెటిల్​..!

What to do with first salary : మొదటి జీతం ఎంతో ప్రత్యేకం! చాలా కష్టపడి.. ఉద్యోగం సంపాదించి, మొదటి వేతనం అందుకుంటే వచ్చే ఫీలే వేరు. “మొదటి జీతాన్ని ఎలా ఖర్చు చేయాలి?” అని.. అది రాక ముందు నుంచే ఎన్నో విధాలు ప్లాన్​ చేస్తుంటారు. మొదటి జీతంతో.. ఇష్టమైన వాళ్లకి, తల్లిదండ్రులకు గిఫ్ట్​లు ఇస్తుంటారు. ఇది మంచి విషయమే. వాటితో పాటు.. 'ఫైనాన్షియల్​ ప్లానింగ్​' కోసం మొదటి జీతాన్ని ఖర్చు చేస్తే.. జీవితం మరింత మెరుగవుతుంది. దీర్ఘకాలంలో మీకు ఉపయోగపడుతుంది. మరి.. మొదటి జీతంతో ఏం చేయాలి? ఎలా ఖర్చు చేయాలి? అన్న వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.

అప్పులు తీర్చేయడంలో ఉంది ప్రశాంతత..

'అప్పుల' భారం మన మీద ఉంటే చాలా ఒత్తిడిగా ఉంటుంది. జీవితంలో ప్రశాంతత కావాలంటే అప్పుల భారాన్ని తీర్చుకోవడం మంచిది. కొంతకాలం.. ఇష్టాల కోసం ఖర్చు పెట్టడం ఆపేసి.. అప్పులను తగ్గించుకుంటూ వెళ్లాలి. ఈ విధంగా.. మీరు తల్లిదండ్రుల కష్టాలను తీర్చినట్టు అవుతుంది.

ఒక్క జీతంతో మొత్తం అప్పులు తీర్చడం కష్టమే. కానీ వచ్చిన జీతాన్ని సరిగ్గా బడ్జెట్​ చేసుకుంటే.. క్రమంగా అప్పుల భారం తగ్గుతుంది.

మనీ మేనేజ్​మెంట్​ స్కిల్స్​..

Tips to spend money wisely : ఈ కాలంలో చాలా మంది యువతకు డబ్బు విలువ తెలియడం లేదు! ఇక సొంతంగా సంపాదించిన డబ్బును ఎక్కడ పడితే అక్కడ ఖర్చు చేసేస్తుంటారు. మొదట్లో.. డబ్బు ద్వారా ఎంజయ్​మెంట్​ లభిస్తోంది కదా అని ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేస్తే.. సరైన సమయంలో అది మన దగ్గర ఉండకపోవచ్చు. అందుకే.. మనీ మేనేజ్​మెంట్​ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎలా ఖర్చు పెడుతున్నాము? అన్న విషయాలపై పట్టు ఉండాలి. వీలైతే.. విద్యార్థి దశ లేదా మొదటి జీతం వచ్చే ముందే తెలుసుకుంటే మంచిది.

How to save money with low income : తక్కువ జీతంతోనూ డబ్బును ఎలా పొదుపు చేయాలి? అని ఆలోచిస్తున్నారా. టిప్స్​ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇన్​వెస్ట్​మెంట్​కు ఇదే సరైన సమయం..

మనిషి జీవితంలో 'ఇన్​వెస్ట్​మెంట్​' అన్నది చాలా అవసరం. ముఖ్యంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందాలంటే.. ఇన్​వెస్ట్​ చేయాల్సిందే! కానీ చాలా మందికి పెట్టుబడులపై అవగాహన ఉండదు. ఇంకొంత మంది.. ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం అంటూ ప్రతి నెలా దాటవేస్తారు. ఇది చాలా తప్పు. మనకి ఎంత జీతం వస్తోంది? అందులో మనం ఎంత సేవ్​ చేయగలము? ఎంత ఇన్​వెస్ట్​ చేయగలము? అన్న విషయాలపై క్లారిటీతో ఉండాలి. ఇందుకు సంబంధించిన వివరాలను సేకరించాలి. సిప్​ ద్వారా ప్రతి నెలా ఇన్​వెస్ట్​ చేస్తుంటే.. మీ లైఫ్​ సెటిల్​!

Investment tip with first salary : ఇన్​వెస్ట్​మెంట్​ కోసం 'గోల్స్​' పెట్టుకోవడం ఉత్తమం. పిల్లల చదువుకనో, కారు కొనుగోలుకనో, పెళ్లికనో, రిటైర్​మెంట్​కనో ఇన్​వెస్ట్​ చేయాలి అనుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడు మన గోల్​ మనకి గుర్తు వచ్చి.. ఇన్​వెస్ట్​మెంట్స్​ని మధ్యలో ఆపకుండా కొనసాగిస్తాము.

ఆరోగ్య బీమాతో జీవితం పదిలం..!

ఈ కాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు! అందుకే ఆరోగ్య బీమా అన్నది అత్యావశ్యకం. మొదటి జీతంతో ఆరోగ్య బీమా తీసుకోవడం.. 'ది బెస్ట్​ అండ్​ మీనింగ్​ఫుల్​ బై' అవుతుంది. మీతో పాటు మీ కుటుంబసభ్యలకు భద్రతగా ఉంటుంది.

How to become rich : కోటీశ్వరులు అవ్వాలన్న మీ కలలను నెరవేర్చుకోవడం కోసం పాటించాల్సిన టిప్స్​ను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎమర్జెన్సీ ఫండ్​.. ఉంటుందిగా అండగా!

How to start investing with first salary : ఇప్పుడున్న ఉద్యోగం రేపు ఉండకపోవచ్చు! ఇప్పుడు వస్తున్న జీతం రేపు రాకపోవచ్చు! 'లేఆఫ్​' వార్తలను మనం నిత్యం వింటూనే ఉంటున్నాము. 'నా ఉద్యోగం ఎందుకు పోతుంది లే..' అని అనుకోకుండా.. అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందు నుంచి సిద్ధమైతే మనకే మంచిది కదా..! అందుకే ఎమర్జెన్సీ ఫండ్​ ఎంతో కీలక. కనీసం ఆరు నెలల పాటు మిమ్మల్ని, మీ నెలవారీ ఖర్చులను పోషించే విధంగా ఎమర్జెన్సీ ఫండ్​ను సిద్ధం చేసుకోవడం మంచిది. దానిని చూసి.. కష్టకాలంలో మీకు భరోసా లభిస్తుంది.