తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Xuv 3xo : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వేరియంట్లు- వాటి ధరలు..

Mahindra XUV 3XO : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వేరియంట్లు- వాటి ధరలు..

Sharath Chitturi HT Telugu

30 April 2024, 11:13 IST

    • Mahindra XUV 3XO launch : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ లాంచ్​ అయ్యింది. ఇందులోని వేరియంట్స్​, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇదిగో.. మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ
ఇదిగో.. మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ

ఇదిగో.. మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ

Mahindra XUV 3XO price list : మహీంద్రా ఎక్స్​యూవీ300కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​గా ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లోకి తాజాగా అడుగుపెట్టింది ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఎస్​యూవీ. సోమవారం లాంచ్​ అవ్వగా.. ఈ ఎస్​యూవీ బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. అంతేకాకుండా.. ఈ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓలోని వేరియంట్లు, వాటి ధరల వివరాలపైనా క్లారిటీ వచ్చింది. వాటిని ఇక్కడ తెలుసుకోండి..

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ..

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓలో రెండు వేరియంట్లు ఉన్నాయి. అవి.. ఎంఎక్స్​, ఏఎక్స్​. కాగా.. ఇందులో పెట్రోల్​ ఇంజిన్​తో పాటు డీజిల్​ ఇంజిన్​ కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు.. వీటికి మేన్యువల్​, ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి. డీజిల్​ వర్షెన్​లో మేన్యువల్​ గేర్​ బాక్స్​తో పాటు ఆటో షిఫ్ట్​+ గేర్​బాక్స్​ కూడా ఉంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ- పెట్రోల్​ వేరియంట్​ ధరలు..

Mahindra XUV 3XO price in Hyderabad : ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఎస్​యూవీ పెట్రోల్​ వేరియంట్​లో రెండు ఇంజిన్​లు ఉన్నాయి. అవి.. 1.2 లీటర్​ టీసీఎంపీఎఫ్​ఐ ఇంజిన్​, 1.2 లీటర్​ స్టాలియన్​ ఇంజిన్​.

1.2 లీటర్​ టీసీఎంపఎఫ్​తో వచ్చే ఎంఎక్స్​1 వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 7.49 లక్షలు. ఎంఎక్స్​2 ప్రో ఎక్స్​షోరూం ధర రూ. 8.99 లక్షలు. ఇందులోనే ఆటోమెటిక్​ వర్షెన్​ ధర రూ. 9.99 లక్షలు. ఎంఎక్స్​3, ఎంఎక్స్​3 ప్రో, ఏఎక్స్​5 ఎక్స్​షోరూం ధరలు వరుసగా రూ. 9.49 లక్షలు, రూ. 9.99 లక్షలు, రూ. 10.69 లక్షలు. వీటిల్లోనే ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ వేరియంట్​ కావానుకుంటే.. అదనంగా రూ. 1.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇక 1.2 లీటర్​ ఎంస్టాలియన్​ ఇంజిన్​ ఏఎక్స్​5 ఎల్​ ఎక్స్​షోరూం ధర రూ. 11.99 లక్షలు. ఇందులోనే ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ వర్షెన్​ ఎక్స్​షోరూం ధర రూ. 13.49 లక్షలు. ఇక మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఏఎక్స్​7 ఎక్స్​షోరూం ధర రూ. 12.49 లక్షలు. ఆటోమెటిక్​ వేరియంట్​కి అదనంగా రూ. 1.50 లక్షలు ఖర్చు చేయాలి. ఏఎక్స్​7 ఎల్​ మేన్యువల్​ వేరియంట్​ ధర ఎక్స్​షోరూం ధర రూ. 13.99 లక్షలు. ఆటోమెటిక్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 15.49 లక్షలు.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ- డీజిల్​ వేరియంట్​ ధరలు..

Mahindra XUV 3XO variants : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఎస్​యూవీ డీజిల్​ వేరియంట్​లో ఎంఎక్స్​1 ఆప్షన్​ లేదు. ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఎం2 డీజిల్​.. బేస్​ వేరియంట్​ అవుతుంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 9.99 లక్షలు. ఎంఎక్స్​2 ప్రో ఎక్స్​షోరూం ధర రూ. 10.39 లక్షలు. ఎంఎక్స్​3 ప్రో ఎక్స్​షోరూం ధర రూ. 11.39 లక్షలు. ఏఎక్స్​5 ఎక్స్​షోరూం ధర రూ. 12.09 లక్షలు. ఏఎక్స్​7 ఎక్స్​షోరూం ధర రూ. 13.69 లక్షలు. ఏఎక్స్​7 ఎల్​ ఎక్స్​షోరూం ధర రూ. 14.99 లక్షలు.

ఈ అన్ని వేరియంట్లకు ఆటోషిఫ్ట్​+ ఆప్షన్​ ఉంది. దీని కోసం అదనంగా రూ. 80వేలు యాడ్​ చేసుకోవాలి.

పైన చెప్పినవి అన్ని ఎక్స్​షోరూం ధరలు. హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు ఇంకొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. వాటిని మేము మీకు అప్డేట్​ చేస్తాము.

తదుపరి వ్యాసం