Mahindra XUV700 EV : మహీంద్రా ఎక్స్​యూవీ700 కి 'ఈవీ' టచ్​- సూపర్​ ఫీచర్స్​తో లాంచ్​!-mahindra xuv700 ev spotted testing check key features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Xuv700 Ev : మహీంద్రా ఎక్స్​యూవీ700 కి 'ఈవీ' టచ్​- సూపర్​ ఫీచర్స్​తో లాంచ్​!

Mahindra XUV700 EV : మహీంద్రా ఎక్స్​యూవీ700 కి 'ఈవీ' టచ్​- సూపర్​ ఫీచర్స్​తో లాంచ్​!

Sharath Chitturi HT Telugu
Apr 01, 2024 12:45 PM IST

Mahindra XUV700 EV launch date : మహీంద్రా ఎక్స్​యూవీ700 కి 'ఈవీ' టచ్ ఇస్తోంది సంస్థ. సూపర్​ ఫీచర్స్​తో ఈ కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంచ్​కు రెడీ అవుతోంది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

మహీంద్రా ఎక్స్​యూవీ700కి ఈవీ వర్షెన్​.. వచ్చేస్తోంది!
మహీంద్రా ఎక్స్​యూవీ700కి ఈవీ వర్షెన్​.. వచ్చేస్తోంది!

Mahindra XUV700 EV price : ఇండియన్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ సెగ్మెంట్​పై ఫోకస్​ చేసిన మహీంద్రా అండ్​ మహీంద్రా.. గట్టి ప్లానే వేసింది! ఇందులో భాగంగా.. వరుస ఈవీ లాంచ్​లకు రెడీ అవుతుంది. వీటన్నింటి మధ్య.. మహీంద్రా ఎక్స్​యూవీ700 ఈవీకి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. టెస్ట్​ రన్​ దశలో ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ దర్శనమిచ్చింది. ఫలితంగా.. పలు కీలక వివరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఇక్కడ చూసేద్దాము..

మహీంద్రా ఎక్స్​యూవీ700 ఈవీ..

టాటా మోటార్స్​ ఆధిపత్యం అధికంగా ఉన్న భారత ఈవీ సెగ్మెంట్​లో మహీంద్రా అండ్​ మహీంద్రాకు ఇప్పటివరకు ఒక్కటే ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఉంది. అది.. ఎక్స్​యూవీ400 ఈవీ. అయితే.. 4,5 ఈవీలను సంస్థ సిద్ధం చేస్తోంది. వీటిల్లో ఒకటి.. ఎక్స్​యూవీ700.

Mahindra XUV.e8 : ఎక్స్​యూవీ 700 ఐసీఈ ఇంజిన్​కి ఎలక్ట్రిక్​ వర్షెన్​గా వస్తున్న ఈ కొత్త వెహికిల్​.. ఎక్స్​యూవీ.ఈ8 గా మార్కెట్​లో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.

ఆన్​లైన్​లో లీక్​ అయిన స్పై షాట్స్​ ప్రకారం.. డిజైన్​లో కూడా.. ఈ ఈవీ వర్షెన్​, ఐసీఈ మోడల్​తోనే పోలి ఉంటుంది. ఫలితంగా.. సంస్థకు డెవలప్​మెంట్​, ప్రొడక్షన్​ కాస్ట్​ తగ్గుతుంది. కానీ.. ఎక్స్​యూవీ.ఈ8 ఫ్రెంట్​లో కొన్ని మార్పులు కనిపించొచ్చు. ఫుల్​ విడ్త్​ ఎల్​ఈడీ లైట్​ బార్​ అనేది.. బంపర్​ వరకు వర్టికల్​గా ఎక్స్​టెండ్​ అవుతుంది. గ్రిల్​కి కూడా క్లోజ్​డ్​ డిజైన్​ వస్తుంది. ఇక హెడ్​ల్యాంప్​ డిజైన్​ కూడా పూర్తిగా కొత్తగా ఉండనుంది.

ఇక సైడ్​ ప్రొఫైల్​ విషయానికొస్తే.. ఎక్స్​యూవీ.ఈ8లో సరికొత్త ఎయిరోడైనమిక్​ అలాయ్​ వీల్స్​ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఫుల్​ విడ్త్​ ఎల్​ఈడీ లైట్​ స్ట్రిప్​, అప్​డేటెడ్​ బంపర్​ వంటివి రేర్​లో కొత్తగా కనిపించొచ్చు.

Mahindra XUV.e8 launch date : ఈ మహీంద్రా ఎక్స్​యూవీ700 ఈవీలో కాపర్​ కలర్డ్​ యాక్సెంట్​ స్పెషల్​ బ్యాడ్జీలు ఉండొచ్చు. ఎక్స్​యూవీ400 ఈవీలో వీటిని చూడొచ్చు. అప్డేటెడ్​ మహీంద్రా లోగో కూడా కనిపిస్తుందని సమాచారం.

మరోవైపు.. మహీంద్రా ఎక్స్​యూవీ.ఈ8 డైమెన్షన్స్​.. ఐసీఈ ఇంజిన్​తో పోల్చితే కాస్త ఎక్కువగానే ఉండొచ్చని టాక్​ నడుస్తోంది. కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ పొడవు 4740ఎంఎం, వెడల్పు 1900ఎంఎం, ఎత్తు 1760ఎంఎం ఉంటాయని సమాచారం. అంటే.. ఐసీఈ ఇంజిన్​తో పోల్చితే.. ఈవీ వర్షెన్​ పొడవు 45ఎంఎం, వెడల్పు 10ఎంఎం, ఎత్తు 5ఎంఎం ఎక్కువ!

ఈ ఎక్స్​యూవీ.ఈ8లో అనేక సెగ్మెంట్​ ఫస్ట్​ ఇన్​ ఫీచర్స్​ ఉండే అవకాశం ఉంది. ట్రిపుల్​ ఇంటిగ్రేటెడ్​ స్క్రీన్​ సెటప్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది. డాష్​బోర్డ్​ మొత్తం ఇది ఉంటుందట. ఇన్ఫోటైన్​మెంట్​ స్క్రీన్​, ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​తో పాటు ఫ్రెంట్​ ప్యాసింజర్స్​ కోసం ప్రత్యేకించి ఒక స్క్రీన్​ ఉంటుందని తెలుస్తోంది. ఇక.. ఫ్రెంట్​- రేర్​లో వెంటిలేటెడ్​ సీట్స్​, పానారోమిక్​ సన్​రూఫ్​, హై ఎండ్​ సౌండ్​ సిస్టెమ్​, అడాస్​ ఫీచర్స్​, కనెక్టెండ్​ కార్​ టెక్నాలజీ వంటి ఫీచర్స్​ ఎలాగో ఉంటాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ700 ఈవీ.. ఇంజిన్​..

Mahindra XUV.e8 images : ఈ మహీంద్రా ఎక్స్​యూవీ700 ఈవ/ ఎక్స్​యూవీ.ఈ8లో 60 కేడబ్ల్యూహెచ్​- 80 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​​ ఉండొచ్చు. వీటి రేంజ్​ 400-450 కిమీలుగా ఉండొచ్చు.

ఇక ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంచ్​తో పాటు ఇతర వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. వీటిపై మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ స్పందించాల్సి ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం