Mahindra XUV400 : మహీంద్రా ఎక్స్​యూవీ400లో కొత్త ఫీచర్స్​..-mahindra xuv400 updated with these new features check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Xuv400 : మహీంద్రా ఎక్స్​యూవీ400లో కొత్త ఫీచర్స్​..

Mahindra XUV400 : మహీంద్రా ఎక్స్​యూవీ400లో కొత్త ఫీచర్స్​..

Sharath Chitturi HT Telugu
Aug 08, 2023 12:45 PM IST

Mahindra XUV400 new features : ఎక్స్​యూవీ400 ఈవీకి కొన్ని కీలక ఫీచర్స్​ యాడ్​ చేసింది మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ. వాటి వివరాలు..

మహీంద్రా ఎక్స్​యూవీ400లో కొత్త ఫీచర్స్​..
మహీంద్రా ఎక్స్​యూవీ400లో కొత్త ఫీచర్స్​..

Mahindra XUV400 EV new features : మహీంద్రా అండ్​ మహీంద్రాకు ఇండియా ఆటోమొబై​ల్​ మార్కెట్​లో ప్రస్తుతం ఒకటే ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఉంది. అదే ఎక్స్​యూవీ 400. ఇక ఇప్పుడు ఈ ఈవీని కొత్త ఫీచర్స్​తో అప్డేట్​ చేసింది సంస్థ. వాటిపై ఓ లుక్కేద్దాము..

కొత్త ఫీచర్స్​ ఇవే..

ఎక్స్​యూవీ400 ఈవీలో కొత్తగా ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ ప్రోగ్రామ్​, టైర్​ ప్రెజర్​ మానిటరింగ్​ సిస్టెమ్​, క్రూజ్​ కంట్రోల్​, ఆటో డిమ్మింగ్​ ఐఆర్​వీఎం, ఫాగ్​ ల్యాంప్స్​ వస్తున్నాయి. వీటికి మించి ఈ ఎలక్ట్రిక్​ వాహనంలో పెద్దగా ఎలాంటి మార్పులు జరగలేదని తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్స్​తో ఈ మోడల్​ మార్కెట్​లో మరింత అట్రాక్టివ్​గా మారింది. పోటీని కూడా పెంచింది!

Mahindra XUV400 EV : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో టాటా నెక్సాన్​ ఈవీ ప్రస్తుతం బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా కొనసాగుతోంది. ఈ వెహికిల్​కి మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ డైరక్ట్​ పోటీనిస్తోంది. ఎక్స్​యూవీ400 ఎక్స్​షోరూం ధర రూ. 15.99లక్షలు- రూ. 18.99లక్షల మధ్యలో ఉంటుంది. నెక్సాన్​ ఈవీ ఎక్స్​షోరూం ధర రూ. 14.49లక్షలు- రూ. 16.49లక్షల మధ్యలో ఉంది.

మహీంద్రా ఎలక్ట్రిక్​ వాహనంలో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఈసీ, ఈఎల్​. ఈసీ వేరియంట్​లో 34.5 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంది. దీని రేంజ్​ 375 కి.మీలు. ఈల్​ వేరియంట్​లో 39.4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రేంజ్​ 456 కి.మీలు. టాప్​ ఎండ్​ మోడల్​ ఈఎల్​లో చాలా ఫీచర్స్​, కలర్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

మహీంద్రా థార్​ ఈవీ..

Mahindra XUV400 EV on road price Hyderabad : మహీంద్రా 'థార్​' లవర్స్​కు క్రేజీ న్యూస్​! థార్​ ఎస్​యూవీకి ఈవీ టచ్​ ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా. ఈ మేరకు ఓ టీజర్​ను లాంచ్​ చేసింది.

సౌతాఫ్రికాలో ఆగస్ట్​ 15న 'ఫ్యూచర్​స్కేప్​' అనే ఈవెంట్​ను నిర్వహిస్తోంది మహీంద్రా అండ్​ మహంద్రా. ఇందులో గ్లోబల్​ ట్రాక్టర్​ ప్లాట్​ఫార్మ్​తో పాటు పలు పికప్​ ట్రక్స్​ను ప్రదర్శించనుంది. ఈ ఈవెంట్​లోనే మహీంద్రా థార్​ ఈవీ కాన్సెప్ట్​ని కూడా సంస్థ ప్రదర్శించనుంది! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మూడేళ్లు.. ఐదు ఈవీలు..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​పై దండయాత్ర చేసేందుకు మహీంద్రా అండ్​ మహీంద్రా సిద్ధమవుతోంది! మూడేళ్లల్లో 5 ఈవీలను లాంచ్​ చేసే విధంగా ప్రణాళికలు రచిస్తోంది ఈ సంస్థ.

2026 అక్టోబర్​ నాటికి 5 ఈవీలను ఇండియాలో లాంచ్​ చేయాలని టార్గెట్​ పెట్టుకుంది ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. మొదటి లాంచ్​ 2024 డిసెంబర్​లో ఉంటుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel