Mahindra EV's : మూడేళ్లు.. 5 ఈవీలు- మహీంద్రా అండ్ మహీంద్రా క్రేజీ ప్లాన్!
Mahindra EV's : భారీ ఈవీ లైనప్‌ను సిద్ధం చేసుకుంటోంది మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ. 2026 నాటికి 5 ఈవీలను లాంచ్ చేయాలని ఫిక్స్ అయ్యింది!
Mahindra EV's : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌పై దండయాత్ర చేసేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సిద్ధమవుతోంది! మూడేళ్లల్లో 5 ఈవీలను లాంచ్ చేసే విధంగా ప్రణాళికలు రచిస్తోంది ఈ సంస్థ. పూర్తి వివరాల్లోకి వెళితే..
మూడేళ్లు.. 5 మోడల్స్..!
ఈవీ సెగ్మెంట్‌పై మహీంద్రా అండ్ మహీంద్రా ఫోకస్ పెంచింది. ప్రస్తుతం ఆ సంస్థ నుంచి ఒక్కటే మోడల్ (మహీంద్రా ఎక్స్‌యూవీ400) మార్కెట్లో ఉంది. ఈ నెంబర్‌ను పెంచుకునే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. రూ.10వేల కోట్లు విలువ చేసే పెట్టుబడులు పెట్టింది.
Mahindra and Mahindra EV lineup : ఇక ఇప్పుడు 2026 అక్టోబర్ నాటికి 5 ఈవీలను ఇండియాలో లాంచ్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. మొదటి లాంచ్ 2024 డిసెంబర్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఈ-ఎస్యూవీలన్నింటీనీ ఐఎన్జీఎల్ఓ ప్లాట్ఫార్మ్పై రూపొందిస్తోంది. ఈ ప్లాట్ఫార్మ్పై సింగిల్- డ్యూయెల్ మోటార్, ఫ్రెంట్ వీల్ డ్రైవ్, రేర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ వంటి మోడల్స్‌ను తయారు చేసే వెసులుబాటు ఉండం విశేషం.
ఇదీ చూడండి:- 5 డోర్ మహీంద్రా థార్ లాంచ్ డేట్ ఫిక్స్..!
ఇప్పటికే పలు ఈవీలకు చెందిన ఫ్యూచరిస్టిక్ డిజైన్స్‌ను ప్రదర్శించింది. అవన్నీ కస్టమర్లను ఆకర్షించే విధంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. 2024 డిసెంబర్లో ఎక్స్‌యూవీ.ఈ8 లాంచ్ అవుతుందని తెలుస్తోంది. 2025 ఏప్రిల్‌లో ఎక్స్‌యూవీ.ఈ9 వస్తుంది, ఆ తర్వాత అక్టోబర్ నాటికి బీఈ.05 రాల్-ఈ కూడా మార్కెట్లో అడుగుపెడుతుందని సమాచారం. ఇక 2026 అక్టోబర్ నాటికి బీఈ.07 మోడల్ కూడా రిలీజ్ అవుతుంది!
మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఆధారంగా ఎక్స్‌యూవీ.ఈ8ను రూపొందిస్తోంది ఆటోమొబైల్ సంస్థ. ఇందులో 80కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉండొచ్చు.
మహీంద్రా థార్ కూడా..!
Mahindra Thar EV latest news : మహీంద్రా అండ్ మహీంద్రా ఈవీ లైనప్‌లో థార్ కూడా ఉంది! ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించింది సంస్థ. మహీంద్రా థార్ ఈవీకి సంబంధించిన కాన్సెప్ట్‌ను ఈ నెల 15న ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది.
Mahindra Thar EV concept : ఆటోమొబైల్ మార్కెట్లో మహీంద్రా థార్‌కు ప్రత్యేక ఫాన్ బ్యేస్ ఉంటుంది. ఏ వేరియంట్ లాంచ్ చేసినా, ఈ ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీకి మంచి డిమాండ్ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు థార్ ఈవీ వస్తోందంటే కస్టమర్లలు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. దీనికి 'థార్.ఈ'అని పేరు పెట్టింది సంస్థ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం