Ather Rizta electric scooter : ఏథర్ ఎనర్జీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌కు రెడీ అవుతోంది. దీని పేరు ఏథర్ రిజ్టా. ఇదొక ఫ్యామిలీ ఈ-స్కూటర్. ఏప్రిల్ 5న.. ఈ స్కూటర్ని లాంచ్ చేయనుంది ఏథర్ సంస్థ. ఇక ఈ వెహికిల్ ప్రీ-బుకింగ్స్‌ని ఇటీవలే ప్రారంభించింది సంస్థ. రూ. 999 టోకెన్ అమౌంట్‌తో సంస్థ అధికారిక వెబ్సైట్లో ఈ వెహికిల్‌ని బుక్ చేసుకోవచ్చు.
ఏథర్ రిజ్టా గురించి ఇప్పటికే కొన్ని విషయాలను టీజ్ చేసింది సంస్థ. ఇది.. సెగ్మెంట్లోనే అతిపెద్ద సీటుతో వస్తుంది. డ్రైవర్‌కు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌గా ఉపయోగపడే టచ్‌స్క్రీన్‌ని ఇందులో అందిస్తోంది సంస్థ. ఇది గూగుల్ మ్యాప్స్, బ్రాండ్, యూజర్ ఇంటర్ఫేస్ అయిన ఏథర్ స్టాక్‌కి సంబంధించిన సరికొత్త వెర్షన్‌తో వస్తుంది. వీటితో పాటు ఓటీఏ అప్డేట్స్ కూడా ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ఏథర్ రిజ్టా కోసం ఆల్-ఎల్ఈడి లైటింగ్‌ని సంస్థ అందిస్తుంది. వరద ప్రాంతాల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సమర్థవంతంగా, సురక్షితంగా ప్రయాణిస్తుందని ఇటీవలే సంస్థ చెప్పుకొచ్చింది.
ఏథర్ రిజ్టా టెస్ట్ మ్యూల్‌ని చూస్తే.. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వైడ్ ఫ్రంట్ టైర్, వెడల్పాటి రియర్ వ్యూ మిర్రర్లు వంటి కీలక ఫీచర్స్ కనిపిస్తున్నాయి. గతంలో విడుదలైన టీజర్ ద్వారా.. బ్యాటరీ స్ట్రెన్త్ని ప్రదర్శించింది ఏథర్ సంస్థ. బ్యాటరీని 40 అడుగుల ఎత్తు నుంచి డ్రాప్ చేసింది. కానీ ఏం అవ్వలేదు! ఇది దాని మన్నికను హైలైట్ చేస్తుంది. రిజ్టా అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను ప్రవేశపెడుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Ather Rizta price : ఏథర్ 450 సిరీస్ కంటే పెద్దదైన సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై ఏథర్ రిజ్టాను నిర్మిస్తోంది సంస్థ. రిజ్టా సైజ్ కూడా పెద్దగానే ఉండనుంది. ఈ స్కూటర్లో ట్రెడీషనల్ కీ కూడా ఉంటుంది.
ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా గతంలో చేసిని ఓ పోస్ట్‌లో.. “రిజ్టాతో మేము సౌకర్యం, భద్రతలో ముందడుగు వేస్తాము. మా టీమ్స్ కొంతకాలంగా దీనిపై పనిచేస్తున్నాయి (ఇది 2019 నుంచి ఈ స్కూటర్ గురించి ప్లాన్ చేస్తున్నాము.) పరిశ్రమ-మొదటి, మీ రైడ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా చేసే కొన్ని అద్భుతమైన ఇంటిగ్రేషన్లను రూపొందించాము. ఎథర్ ఇతర ఉత్పత్తులు ప్రసిద్ధి చెందిన అదే నాణ్యత, విశ్వసనీయతను రిజ్టా కూడా కొనసాగిస్తున్నాము,” అని చెప్పుకొచ్చారు.
Ather Rizta electric scooter launch : ఈ ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మోడల్ ధరతో పాటు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లాంచ్ టైమ్‌కి వీటిపై ఓ క్లారిటీ వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.