Ather Rizta electric scooter : ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రిజ్టా.. వచ్చేస్తోంది!
Ather Rizta electric scooter launch date : ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. అదేంటంటే..
Ather Rizta electric scooter specifications : ఏథర్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. దీని పేరు ఏథర్ రిజ్టా. ఇదొక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్‌కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తాగాజా బయటకి వచ్చింది. 2024 ఏప్రిల్ 6న.. ఏథర్ రిజ్టాను సంస్థ రివీల్ చేయనుంది. ఏథర్ కమ్యూనిటీ డే కూడా అదే రోజున జరుగుతుండటంతో.. రిజ్టాను గ్రాండ్‌గా రివీల్ చేయాలని సంస్థ భావిస్తోంది. ఏథర్ రిజ్టా ఫొటోలు ఇప్పటివరకు అనేక సందర్భాల్లో లీక్ అయ్యాయి. సంస్థ కూడా.. ఈ ఈ-స్కూటర్ని టీజ్ చేస్తూ వచ్చింది.
ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు..
కాంపీటీటర్స్తో పోల్చితే.. ఏథర్ రిజ్టా పెద్దదిగా ఉంటుంది. సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటివరకు లీక్ అయిన ఫొటోల్లోని పెద్ద సీట్, ఫ్లోర్ బోర్డ్‌ని గమనిస్తే, ఈ విషయం అర్థమైపోతుంది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుట్‌ప్రింట్ కూడా భారీగానే ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఫీచర్స్ విషయంలోనూ ఈ మోడల్ రిచ్‌గా ఉంటుంది తెలుస్తోంది. ఏథర్ దాని మునుపటి ఆఫర్లకు అనుగుణంగా మోడల్‌కు అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను తీసుకువస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్లో.. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కనెక్టెడ్ టెక్నాలజీతో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వస్తుందని అంచనాలు ఉన్నాయి. టర్న్-బై-టర్న్ నావిగేషన్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ఫాస్ట్ ఛార్జింగ్ సహా మరెన్నో సూపర్ ఫీచర్స్ ఇందులో ఉంటాయని సమాచారం. ఏథర్ ఎనర్జీ రాబోయే ఈ-స్కూటర్ ఇంజిన్, స్పెసిఫికేషన్స్, బ్యాటరీ ప్యాక్, ఛార్జర్ వంటి వివరాలను సంస్థ ఇంకా అధికారికంగా ప్రటించలేదు. రానున్న రోజుల్లో వీటిపై పూర్తి వివరాలను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Ather Rizta electric scooter launch : అయితే.. ఏథర్ 450ఎక్స్‌తో పోల్చితే.. ఈ ఏథర్ రిజ్టాలో కొత్త మోటర్తో పాటు భారీ బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఇందులో ఉండొచ్చని సమాచారం.
ఏథర్ రిజ్టా ఈ-స్కూటర్ లోవర్ ఆప్రాన్లో ఎల్ఈడీ హెడ్‌లైట్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. ఫ్రెంట్లో భారీ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కూడా ఉంది.
Ather Rizta electric scooter price : ఈ సెగ్మెంట్లో ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వంటి మోడళ్లతో ఏథర్ రిజ్టా పోటీ పడనుంది. అయితే.. ఎలక్ట్రిక్ స్కూటర్ ధర.. అత్యంత కీలకంగా మారనుంది. ఈ మోడల్‌కు ధర రూ .1.40 లక్షలకు అటు, ఇటుగా ఉండొచ్చు. అప్పుడే, కాంపిటీటర్స్కి మంచి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఈ ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఈ ఏడాది రెండో భాగంలో జరగొచ్చు!
సంబంధిత కథనం