Mahindra XUV 3XO launch : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ లాంచ్.. ధర ఎంతంటే!
Mahindra XUV 3XO price : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ లాంచ్ అయ్యింది. ఈ ఎస్యూవీ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ చూసేయండి..
Mahindra XUV 3XO launch date : గత కొన్ని రోజులుగా మహీంద్రా అండ్ మహీంద్రా ఊరిస్తూ వస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ.. ఇండియా మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇది.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్స్‌యూవీ300కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ధర రూ.7.49 లక్షల వద్ద ప్రారంభమై.. రూ. 15.49 లక్షల వరకు వెళుతుంది. ఇవి ఎక్స్‌షోరూం ధరలు. లాంచ్ నేపథ్యంలో.. ఈమహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎస్యూవీ విశేషాలను ఇక్కడ చూద్దాము..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ డిజైన్- ఫీచర్స్..
మహీంద్రా ఎక్స్‌యూవీ300తో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓని పోల్చితే.. డిజైన్ పరంగా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఫ్రెంట్ ఫాసియోలో గ్లాసీ బ్లాక్ గ్రిల్ విత్ క్రోమ్ స్లాట్స్ వస్తున్నాయి. అవి మరింత అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఎక్స్‌యూవీ700 కనిపించే కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్స్ కూడా ఉన్నాయి.
మరోవైపు.. ఈ కొత్త ఎస్యూవీ రేర్ ఎండ్‌ని పూర్తిగా రీ-డిజైన్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా. ఇందులో ఇప్పుడు.. కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, బోల్డ్ ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ లెటరింగ్, రేర్ బంపర్ మీద రీపొజీషన్డ్ నెంబర్ ప్లేట్ హౌజింగ్ వంటివి వస్తున్నాయి.
Mahindra XUV 3XO price in Hyderabad : సైడ్ ప్రొఫైల్ విషయానికొస్తే.. ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలో డార్క్ క్రోమ్ ఫినిషింగ్‌తో సరికొత్త అలాయ్ వీల్స్‌ని చూడొచ్చు.
ఇక ఈ ఎస్‌యూవీలో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వయర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, స్లీక్ సెంట్రల్ ఏసీ వెంట్స్, పానారోమిక్ సన్‌రూఫ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కట్రోల్ సెట్టింగ్స్ వంటివి ఫీచర్స్‌గా వస్తున్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎస్యూవీ స్టీరింగ్ వీల్ డిజైన్ మారలేదు. కానీ ఇందులో ఇప్పుడు గ్లాసీ బ్లాక్ ఇన్సర్ట్స్ వస్తున్నాయి. వయర్లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్, 7 స్పీకర్ హర్మాన్ కార్డొన్ సౌండ్ సిస్టెమ్లు ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ- ఇంజిన్..
Mahindra XUV300 facelift : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 111 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇందులో 1.5 డీజిల్ ఇంజిన్ కూడా ఉంది.ఇది 117 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఏఎంటీ ఆప్షన్స్ ఉన్నాయి.
కొన్ని ఎంపిక చేసిన హైయ్యర్ వేరియంట్స్‌లో 1.2 లీటర్ డైరక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ యూనిట్ కూడా ఉంటుంది. ఇది 131 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఇందులో ఏఐఎస్ఐఎన్ సోర్స్డ్ 6 స్పీడ్ టార్క్ కన్వర్ట్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది.
Mahindra XUV 3XO price : ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎస్‌యూవీలో లెవల్ 2 అడాస్, క్రూజ్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఫ్రెంట్- రేర్ పార్కింగ్ సెన్సార్లు సేఫ్టీ ఫీచర్లుగా వస్తున్నాయి.
సంబంధిత కథనం