Citroen Basalt Vision : సిట్రోయెన్ బసాల్ట్ విజన్ ఎస్యూవీ.. త్వరలోనే లాంచ్!
Citroen Basalt Vision SUV : సిట్రోయెన్ బసాల్ట్ విజన్ కూపే ఎస్‌యూవీని రివీల్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుందో సంస్థ. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
Citroen Basalt Vision : ఇండియాలో ఎస్యూవీ సెగ్మెంట్‌కి ఉన్న డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు పోటీపడుతున్నాయి. సిట్రోయెన్ సంస్థ కూడా ఈ జాబితాలోకి చేరింది. ఇండియా, సౌత్ అమెరికా మార్కెట్ల కోసం ఓ కొత్త కూపే ఎస్‌యూవీని రూపొందించింది. దాని పేరు సిట్రోయెన్ బసాల్ట్ విజన్. ఈ వెహికిల్‌ని.. మార్చ్ 27న రివీల్ చేయనుంది సంస్థ. ఈ నేపథ్యంలో.. తాజాగా ఓ టీజర్‌ని విడుదల చేసింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సిట్రోయెన్ బసాల్ట్ విజన్ కూపే ఎస్యూవీ..
ఈ సిట్రోయెన్ బసాల్ట్ విజన్.. ఒక కాంపాక్ట్ కూపే ఎస్యూవీ. దీనిని సీ- క్యూబ్డ్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తోంది సిట్రోయెన్ సంస్థ. సీ3, ఈసీ3, సీ3 ఎయిర్క్రాస్లని కూడా ఈ ప్లాట్‌ఫామ్‌పైనే తయారు చేసింది.
ఇక తాజాగా బయటకు వచ్చిన టీజర్లో.. బసాల్ట్ విజన్ కాంపాక్ట్ కూపే ఎస్యూవీ రూఫ్‌లైన్, సరికొత్త ఎల్ఈడీ టెయిల్‌లైట్ డిజైన్ రివీల్ అయ్యాయి. రేక్డ్ రేర్ విండ్‌స్క్రీన్.. బూట్లోకి మర్జ్ అవుతోంది. ఫలితంగా.. ఈ ఎస్యూవీ లుక్స్ మరింత షార్ప్‌గా, బోల్డ్‌గా అయ్యాయి. మార్కెట్లో కూపై స్టైల్ ఎస్‌యూవీలకు రానున్న రోజుల్లో క్రేజీ డిమాండ్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే బసాల్ట్ విజన్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది సిట్రోయెన్. అయితే.. త్వరలో లాంచ్‌కానున్న టాటా కర్వ్ ఐసీఈతో ఈ మోడల్ పోటీ ఎదుర్కొంటుంది.
Citroen Basalt Vision launch date in India : సిట్రోయెన్ బసాల్ట్ విజన్ సైజు.. సీ3 ఎయిర్‌క్రాస్‌తో పోలి ఉండొచ్చు. కానీ ఇదొక 5 సీటర్ అవ్వొచ్చు. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌లో 7 సీటర్ ఉంటుంది. కొత్త వెహికిల్ ఫ్రెంట్, రేర్ డిజైన్‌లో స్వల్ప మార్పులు కనిపించొచ్చు. సాధారణంగా.. సీ- క్యూబ్ మోడల్స్‌లో ప్రీమియం డిజైన్ కనిపిస్తుంది. అయితే.. సిట్రోయెన్ సిగ్నేచర్ గ్రిల్, డీఆర్ఎల్స్.. కొత్త మోడల్లో కూడా ఉంటాయని అంచనాలు ఉన్నాయి.
ఇక.. కేబిన్ విషయానికొస్తే.. సీ3 ఎయిర్‌క్రాస్‌లోని చాలా ఫీచర్స్.. ఈ సిట్రోయెన్ బసాల్ట్ విజన్ కూపే ఎస్‌యూవీల్లో ఉండొచ్చు. 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, యాపిల్ కార్ప్లే- ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ ఓఆర్వీఎంలు, క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, స్టార్ట్- స్టాప్ బటన్‌తో పాటు అనేక ఫీచర్స్ ఇందులో ఉండొచ్చు.
ఇక ఇంజిన్ విషయానికొస్తే.. సిట్రోయెన్ బసాల్ట్ విజన్ కూపే ఎస్‌యూవీలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండొచ్చు.
Citroen Basalt Vision price in India : మార్చ్ 27న ఈ మోడల్ని సంస్థ రివీల్ చేస్తుంది. ఆ తర్వాత లాంచ్ ఈవెంట్ ఉండొచ్చు. ఈ మోడల్ ధరకు సంబంధించిన వివరాలపై సంస్థ స్పందించాల్సి ఉంది. లాంచ్ టైమ్ నాటికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌పై సిట్రోయెన్ సంస్థ గట్టిగానే ఫోకస్ చేసినట్టు కనిపస్తోంది. ఇప్పటికే సాలిడ్ లైనప్‌ని సిద్ధం చేసింది. రానున్న నెలల్లో మరికొన్ని మోడల్స్‌ని ఇండియాలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. వాటిల్లో ఒకటి.. సీ3ఎక్స్ క్రాస్- సెడాన్.
సంబంధిత కథనం