Affordable SUVs in India : ఎస్​యూవీ కొనాలా? తక్కువ బడ్జెట్​లో ఇవి బెస్ట్​!-automobile news top 3 affordable suvs in india 2024 check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Automobile News : Top 3 Affordable Suvs In India 2024 Check Details Here

Affordable SUVs in India : ఎస్​యూవీ కొనాలా? తక్కువ బడ్జెట్​లో ఇవి బెస్ట్​!

Sharath Chitturi HT Telugu
Mar 18, 2024 10:41 AM IST

Top 3 Affordable SUVs in India : బడ్జెట్​లో మంచి ఎస్​యూవీ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. ఇండియాలో బెస్ట్​, అఫార్డిబుల్​ ఎస్​యూవీ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎస్​యూవీలు ఇవే..
బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎస్​యూవీలు ఇవే..

Budget friendly SUV cars in India under 7 lakh : ఇండియాలో ఇప్పుడు 'ఎస్​యూవీ' ట్రెండ్​ నడుస్తోంది! స్టైల్​తో పాటు స్పేషియస్​గా ఉంటున్న ఎస్​యూవీలను కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? కానీ.. మంచి ఎస్​యూవీ కొనేందుకు సరైన బడ్జెట్​ లేదని ఆగిపోతున్నారా? మరేం దిగులు లేదు! ఎస్​యూవీ సెగ్మెంట్​లో బీభత్సమైన పోటీ ఉండటంతో.. తక్కువ ధరకే మంచి వెహికిల్స్​ లభిస్తున్నాయి. ఆ లిస్ట్​ని మీకోసం మేము రూపొందించాము. లిస్ట్​ని ఇక్కడ చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు

టాటా పంచ్​ ఎస్​యూవీ..

అఫార్డిబుల్​, బెస్ట్​ ఎస్​యూవీల్లో టాటా పంచ్​ టాప్​ ప్లేస్​లో ఉంటుంది. ఫిబ్రవరి నెలలో టాప్​ 10 బెస్ట్​ ఎస్​యూవీల్లో నెంబర్​ 1 ప్లేస్​ని దక్కించుకుంది పంచ్​. స్టైలిష్​ డిజైన్​తో పాటు డ్యూయెల్​ టోన్​ పెయింట్​, ప్రొజెక్టర్​ హాలోజెన్​ హెడ్​లైట్స్​, మస్క్యూులర్​ బానెట్​, రూఫ్​ రెయిల్స్​, వైడ్​ ఎయిర్​ డ్యామ్​ వంటివి వస్తున్నాయి. ఇందులో 15 ఇంచ్​ డైమండ్​ కట్​ అలాయ్​ వీల్స్​ ఉంటాయి. ఇక 5 సీటర్​ స్పెషియస్​ కేబిన్​లో 7 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, స్టార్ట్​/ స్టాప్​ బటన్​, కూల్డ్​ గ్లోవ్​బాక్స్​, యాపిల్​ కార్​ప్లే, అండ్రాయిడ్​ కార్​ప్లే వంటివి ఫీచర్స్​గా ఉన్నాయి.

Tata Punch on road price in Hyerabad : ఈ ఎస్​యూవీలో.. 1.2 లీటర్​ రివొట్రాన్​, 3 సిలిండర్​, పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 84 బీహెచ్​పీ పవర్​ని, 113 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ టాటా పంచ్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6 లక్షలు.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ సైతం రెడీ అవుతుంది. ఇది 2025లో లాంచ్​ అవుతుందని టాక్​ నడుస్తోంది.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​:-

2023లో లాంచ్​ అయిన హ్యుందాయ్​ ఎక్స్​టర్​కి మంచి స్పందన లభిస్తోంది. తక్కువ ధరకే, ఎక్కువ ఫీచర్స్​ వస్తుండటం ఈ ఎస్​యూవీ స్పెషాలిటీ. ఇందులో.. ప్రొజెక్టర్​ హాలోజెన్​ హెడ్​ల్యాంప్స్​, హెచ్​ షేప్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, గ్లాస్​ బ్లాక్​ గ్రిల్​, రూఫ్​ రెయిల్స్​, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​ వంటివి వస్తున్నాయి. ఇందులో 15 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ అలాయ్​ వీల్స్​ ఉంటాయి.

Best SUV under 7 Lakh in India : ఇక హ్యుందాయ్​ ఎక్స్​టర్​ స్పేషియస్​ కేబిన్​లో డ్యూయెల్​ కెమెరాతో కూడిన డాష్​క్యామ్​, వాయిస్​ ఎనేబుల్డ్​ సన్​రూఫ్​, ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 8 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ ప్యానెల్​లు ఫీచర్స్​గా వస్తున్నాయి.

హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీలో 1.2 లీటర్​ ఇన్​లైన్​ 4 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 88 హెచ్​పీ పవర్​ని, 113.8 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6.13 లక్షలు

సిట్రోయెన్​ సీ3:-

Citroen C3 on road price in Hyderabad : ఇండియాలో సిట్రోయెన్​ వెహికిల్స్​కి డిమండ్​ పెరుగుతోంది. ముఖ్యంగా సిట్రోయెన్​ సీ3 ఎస్​యూవీ.. ఇక్కడ సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​గా ఉంది. ఇందులో బంపర్​ మౌంటెడ్​ హెడ్​లైట్స్​, స్ల్పిట్​ టైప్​ డీఆర్​ఎల్స్​, స్లీక్​ గ్రిల్​, సిల్వర్డ్​ రూఫ్​ రెయిల్స్​, వ్రాప్​ అరౌండ్​ టెయిల్​లైట్స్​ వస్తున్నాయి. 15 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ అలాయ్​ వీల్స్​ కూడా ఇందులో ఉన్నాయి.

ఈ ఎస్​యూవీ కేబిన్​ల టూ టోన్​ డాష్​బోర్డ్​, కీలెస్​ ఎంట్రీ, ఫ్రెంట్​/ రేర్​ యూసఎస్​బీ పోర్ట్స్​, 10 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, వయర్​లెస్​ కనెక్టివిటీ ఆప్షన్స్​ ఉన్నాయి.

సిట్రోయెన్​ సీ3 ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6.16 లక్షలు. ఇందులో 1.2 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​, పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇందులో 82 హెచ్​పీ పవర్​ని, 115 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 1.2 లీటర్​, టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. 110 హెచ్​పీ పవర్​ని, 190 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం