Citroen C3 Aircross automatic : సీ3 ఎయిర్​క్రాస్​ ‘ఆటోమెటిక్’​ మోడల్​ని లాంచ్​..-automobile news citroen c3 aircross automatic launched in india check price and features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen C3 Aircross Automatic : సీ3 ఎయిర్​క్రాస్​ ‘ఆటోమెటిక్’​ మోడల్​ని లాంచ్​..

Citroen C3 Aircross automatic : సీ3 ఎయిర్​క్రాస్​ ‘ఆటోమెటిక్’​ మోడల్​ని లాంచ్​..

Sharath Chitturi HT Telugu
Jan 29, 2024 06:18 PM IST

Citroen C3 Aircross automatic launch : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ కొనాలని చూస్తున్నారా? ఇందులో.. ఆటోమెటిక్​ మోడల్​ తాజాగా లాంచ్​ అయ్యింది. చెక్​ చేయండి..

సీ3 ఎయిర్​క్రాస్​ ‘ఆటోమెటిక్’​ మోడల్​ని లాంచ్​..
సీ3 ఎయిర్​క్రాస్​ ‘ఆటోమెటిక్’​ మోడల్​ని లాంచ్​..

Citroen C3 Aircross automatic price in India : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో.. సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. సీ3 ఎయిర్​క్రాస్​ ఆటోమెటిక్​ మోడల్​ని తాజాగా లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొల్​ సంస్థ. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ ఆటోమెటిక్​..

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ ఆటోమెటిక్​లో సరికొత్త 6 స్పీడ్​ టార్క్​ కన్వర్టర్​ ఏటీ గేర్​బాక్స్​ ఉంటుంది. దీనిని జపాన్​కు చెందిన ఐసిన్​ అనే సంస్థ రూపొందించింది. ఈ ఎస్​యూవీలో 1.2 లీటర్​, 3 సిలిండర్​, టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 110 హెచ్​పీ పవర్​ని, 205 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

Citroen C3 Aircross automatic price Hyerabad : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ మేన్యువల్​- ఆటోమెటిక్​ మోడల్స్​ డిజైన్​లో మార్పులు కనిపించడం లేదు. కానీ.. ఈ ఎస్​యూవీకి ఓ స్పెషాలిటీ ఉంది. ఈ సెగ్మెంట్​లో 7 సీటర్​ కాన్ఫిగరేషన్​ కలిగి ఉన్న ఏకైక వాహనం ఇదే!

ఇక ఈ కారులో కొన్ని ఫీచర్స్​ యాడ్​ అయ్యాయి. అవి.. రిమోట్​ ఇంజిన్​ స్టార్ట్​, ఏసీ ప్రీకండీషనింగ్​. ఈ కారులో 10.2 ఇంచ్​ టచ్​స్క్రీన్​, వయర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో కనెక్టివిటీ ఫీచర్స్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​లు వస్తున్నాయి.

Citroen C3 Aircross automatic review : కానీ.. ఈ ఎస్​యూవీలో సన్​రూఫ్​, వెంటిలేటెడ్​ సీట్స్​, వయర్​లెస్​ ఛార్జింగ్​, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్​ ఓఆర్​వీఎం, ఆటో క్లైమేట్​ కంట్రోల్​ వంటి ఇతర ఎస్​యూవీల్లోని ఫీచర్స్​ రావడం లేదు!

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ ఆటోమెటిక్​- ధర ఎంతంటే..

ఇండియాలో.. ఈ సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ ఆటోమెటిక్​ ప్లస్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 12.85లక్షలు. మ్యాక్స్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 13.50లక్షలు. 7 సీటర్​ మ్యాక్స్​ ఎక్స్​షోరూం ధర రూ. 13.85లక్షలు.

Citroen C3 Aircross automatic : ఈ మోడల్​కి సంబంధించిన బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 25వేల టోకెన్​ అమౌంట్​తో.. సంస్థ అధికారిక వెబ్​సైట్​ లేదా డీలర్​షిప్​షోరూమ్​లో దీనిని కొనుగోలు చేసుకోవచ్చు.

సంబంధిత కథనం