Tata Punch SUV : టాటా పంచ్​ @3,00,000- బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీకి క్రేజీ డిమాండ్​!-tata punch suv hits major production milestone 3 lakh units rolled out ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch Suv : టాటా పంచ్​ @3,00,000- బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీకి క్రేజీ డిమాండ్​!

Tata Punch SUV : టాటా పంచ్​ @3,00,000- బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీకి క్రేజీ డిమాండ్​!

Sharath Chitturi HT Telugu
Jan 04, 2024 12:45 PM IST

Tata Punch SUV : టాటా పంచ్​ ఎస్​యూవీ సరికొత్త మైలురాయిని తాకింది. 3లక్షల సేల్​ మార్క్​ని హిట్​ చేసింది.

 టాటా పంచ్​ @3,00,000- బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీకి క్రేజీ డిమాండ్​!
టాటా పంచ్​ @3,00,000- బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీకి క్రేజీ డిమాండ్​!

Tata Punch SUV : టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటైన టాటా పంచ్​.. సరికొత్త మైలురాయిని హిట్​ చేసింది! 3లక్షలకుపైగా టాటా పంచ్​ యూనిట్​లను విక్రయించినట్టు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఒక ఫొటోను విడుదల చేసింది.

టాటా పంచ్​ ఎస్​యూవీకి క్రేజీ డిమాండ్​..!

2021 అక్టోబర్​లో టాటా పంచ్​ని లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. అప్పటి నుంచి ఈ మోడల్​కి క్రేజీ డిమాండ్​ కనిపిస్తోంది. లాంచ్​ అయిన 9 నెలల్లోనే ఒక లక్ష మైలురాయిని తాకింది. ఆ తర్వాత 5 నెలలకు, అంటే 2023 జనవరిలో మరో 50వేల యూనిట్​లను విక్రయించింది సంస్థ. ఇక 2లక్షల సేల్స్​ మైలురాయిని 2023 మే నాటికి రీచ్​ అయ్యింది. ఇక తాజాగా.. జనవరిలో, అంటే 2ఏళ్ల మూడు నెలలకు 3 లక్షల మైల్​స్టోన్​ని హిట్​ చేసింది.

Tata Punch on road price in Hyderabad : నెక్సాన్​ ఎస్​యూవీ తర్వాత.. టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది ఈ టాటా పంచ్​. సగటున 10వేల యూనిట్​లు అమ్ముడుపోతుండటం విశేషం. ఇక ఇండియాలో టాప్​ 10 బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో స్థానం సంపాదించుకుంది.

ఈ టాటా పంచ్​ ఎస్​యూవీలో 1.2 లీటర్​, 3 సిలిండర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 85 హెచ్​పీ పవర్​ని, 113 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ మేన్యువల్​, ఏఎంటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ వస్తున్నాయి. అంతేకాకుండా.. టాటా పంచ్​ సీఎన్​జీ మోడల్​ కూడా అందుబాటులో ఉంది. ఇందులో.. డ్యూయెల్​ సిలిండర్​ ఐసీఎన్​జీ టెక్నాలజీ ఉంటుంది.

టాటా పంచ్​ వేరియంట్లు- ధర..

Tata Punch SUV sales : టాటా పంచ్​ ఎస్​యూవీలో మొత్తం 8 వేరియంట్లు ఉన్నాయి. ప్యూర్​, ప్యూర్​ (ఓ) బేస్​ వేరియంట్లు మేన్యువల్​ ట్రాన్స్​మిషన్​తో అందుబాటులో ఉన్నాయి. అడ్వెంచర్​, అడ్వెంచర్​ (ఓ), అకంప్లీష్​డ్​, అంకప్లీష్​డ్​ (ఓ), క్రియేటివ్​, క్రియేటివ్​ (ఓ) వేరియంట్స్​లో ఎంటీతో పాటు ఏఎంటీ ఆప్షన్స్​ ఉంటాయి.

ఇక ఈ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలు- పూ, 9.5లక్షల మధ్యలో ఉంటుంది.

టాటా పంచ్​ ఎస్​యూవీలో పుష్​- బటన్​ స్టార్ట్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, లెథర్​ వ్రాప్​డ్​ స్టీరింగ్​ వీల్​, గేర్​ నాబ్​, ఆటో-ఫోల్డింగ్​ ఓఆర్​వీఎం, కూల్డ్​ గ్లోవ్​బాక్స్​, రేర్​ సీట్​ ఆర్మ్​రెస్ట్​, 7 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​తో పాటు ఇతర ఫీచర్స్​ ఉంటాయి.

ఇక ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో.. హ్యుందాయ్​ ఎక్స్​టర్​, నిస్సాన్​ మాగ్నైట్​ వంటి ఎస్​యూవీలకు గట్టిపోటీనిస్తోంది టాటా పంచ్​.

టాటా పంచ్​ ఈవీ కోసం ఎదురుచూపులు..

Tata Punch EV launch in India : టాటా పంచ్​ ఎస్​యూవీ దుమ్మురేపింది. ఇక ఇప్పుడు టాటా పంచ్​ ఈవీ లాంచ్​కు సిద్ధమవుతోంది. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​పై భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ మోడల్​ 2023లోనే లాంచ్​ అవ్వాల్సి ఉంది. కానీ.. సంస్థ ఎందుకో దీనిని ఆలస్యం చేస్తూ వస్తోంది. కాగా.. ఈ 2024లో ఈ టాటా పంచ్​ ఈవీ కచ్చితంగా లాంచ్​ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

టాటా పంచ్​ ఈవీ ఎంట్రీతో.. టాటా మోటార్స్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ లైనప్​ మరింత పటిష్ఠంగా మారనుంది. సంస్థ ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​లో నెక్సాన్​ ఈవీ, టిగోర్​ ఈవీ, టియాగో ఈవీ మోడల్స్​ బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం